అన్వేషించండి

Neeraj Murder Case: నీరజ్‌ హత్య కేసు విచారణలో మరో ట్విస్ట్- హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన నిందితుల బంధువులు

హైదారాబాద్‌ పరువు హత్య కేసు మరో మలుపు తిరిగింది. తమ వారికి ప్రాణ హాని ఉందంటూ నిందితుల బంధువులు మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు.

నీరజ్ హత్య కేసులో నిందితులకు రక్షణ కల్పించాలని తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు వారి బంధువులు, తల్లిదండ్రులు. పోలీసుల అదుపులో ఉన్న నిందితులకు ప్రాణ హాని ఉందని అనుమానం వ్యక్తం చేస్తూ రక్షించాలని వేడుకున్నారు. 

హైదరాబాద్‌లోని బేగంబజార్‌లో వ్యాపారి కుమారుడు నీరజ్‌ పన్వార్‌ దారుణ హత్యకు గురయ్యారు. తెలంగాణలో సంచలనం కలిగించిన ఈ కేసులో ఆరుగుు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని కోర్టు ముందు హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. కేసులో మరింత పురోగతి కోసం నిందితులను షాహీనాయతగంజ్‌ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 

నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకోవడంతో వారి బంధువుల్లో టెన్షన్ మొదలైంది. వారికి ఏమైనా ప్రమాదం పొంచి ఉందేమో అన్న కంగారు వారిలో కనిపిస్తోంది. అందుకే వాళ్లంతా మానవ హక్కుల కమిషన్‌  ఆశ్రయించారు. పోలీసుల అదుపులో ఉన్న తమ బిడ్డలను కాపాడాలంటూ వేడుకున్నారు. 

పోలీసుల అదుపులో ఉన్న నిందితులైన తమ పిల్లలను లాక్ డెత్, ఎన్ కౌంటర్ చేస్తారనే అనుమానంగా ఉందని మానవహక్కుల కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ పిల్లలకు ప్రాణ రక్షణ లేదని.. విచారణ పేరుతో వారిని వేధిస్తున్నారని ఆరోపించారు. నీరజ్‌ హత్య కేసులో ప్రమేయం లేని వాళ్లను కూడా పోలీసులు భయపెడుతున్నారని... అక్రమ కేసుల్లో ఇరికించచే ప్రయత్నం చేస్తున్నారని వాపోతున్నారు. 

పోలీసులు నాలుగు రోజుల కస్టడీలో తమ వారిని చట్టబద్ధంగా విచారణ చేసేలా మానవహక్కుల కమిషన్ ఆదేశాలు ఇవ్వాలని వేడుకున్నారు. హింసించే విధంగా కొట్టకూడదని హెచ్చార్సీను కోరారు. ఈ విషయంలో మాట్లాడేందుకు  త్వరలో నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ను కలవనున్నట్లు వారు తెలిపారు.

బేగం బజార్ షాహీనాథ్‌ గంజ్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలో నీరజ్ పన్వార్ అనే యువకుడు బైకుపై వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని దుండగులు అతడ్ని అడ్డుకున్నారు. బైక్ ఆపిన వెంటనే తమ వెంట తెచ్చుకున్న కత్తులతో నీరజ్ పన్వార్‌పై విచక్షణారహితంగా దాడి చేశారు. కొందరు రాళ్లతో కూడా యువకుడిపై దాడికి పాల్పడ్డారు. దాదాపు 20 సార్లు కత్తితో పొడవడంతో నీరజ్ పన్వార్ కుప్పుకూలిపోయి అక్కడే మరణించాడు. ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కారణంతో పగ పెంచుకున్న యువతి బంధువులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఏడాది కిందట నీరజ్ పన్వార్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. 

గత ఏడాది నీరజ్ పన్వార్ ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి అమ్మాయి కుటుంబసభ్యులు అతడిపై కక్షకట్టారు. ఈ క్రమంలో నలుగురు వ్యక్తులు బేగంబజార్ మచ్చి మార్కెట్‌లో వెళ్తున్న నీరజ్ పన్వార్‌ బైక్ అడ్డుకుని కత్తులతో విచక్షణారహితంగా దాడిచేసి హత్య చేశారు. వెంటనే అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Jio Airtel Best Plans: కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Embed widget