By: ABP Desam | Updated at : 03 Dec 2022 11:24 AM (IST)
సీఎం కేసీఆర్‌తో కవిత భేటీ
ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ విచారణకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను పిలవడం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారుతోంది. ఎప్పటి నుంచో ఈ కేసులో ఆమె ఉన్నట్టు ప్రచారం జరిగినా... దాన్ని టీఆర్‌ఎస్ ఖండిస్తూ వచ్చింది. కానీ మొన్నటికి మొన్న ఈడీ కోర్టుకు ఇచ్చిన రిపోర్టులో కవిత పేరు ఉండటం ఇప్పుడు సీబీఐ విచారణకు పిలవడం చకచకా జరిగిపోయింది. తర్వాత ఏం జరగబోతోందన్న చర్చ తెలంగాణలో నడుస్తోంది.
తాను ఎలాంటి తప్పు చేయలేదని... ఇలాంటి రాజకీయ కేసులు చాలా చూశామని కాబట్టి విచారణ ధైర్యంగా ఎదుర్కొంటానని కవిత ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నెల ఆరు ఆమెను సీబీఐ విచారించనుంది. రాజకీయంగా జరుగుతున్న ప్రచారంపై ఎలాంటి కౌంటర్ ఇవ్వాలి... దీనికి ప్రతి వ్యూహం ఏంటన్న విషయంపై కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారని టాక్. అందులో భాగంగా ఇవాళ కేసీఆర్‌ను కవిత కలవనున్నారు. ప్రగతి భవన్‌కు వెళ్లారు. కేసీఆర్‌తో సమావేశమయ్యారు.
కవిత తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ధర్నాలు చేస్తున్నాయి. ఏ పార్టీకి చెందిన కార్యకర్తలైనా ఆమె నివాసం వైపు రావచ్చన్న అనుమానంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇంటి వద్ద భారీగా బలగాలను మోహరించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత వివరణ తీసుకునేందుకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 6న విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసుల్లో తెలిపింది. దిల్లీ, హైదరాబాద్ లో ఎక్కడైనా హాజరుకావొచ్చని సీబీఐ చెప్పింది. ఈ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు.
"దిల్లీ లిక్కర్ స్కామ్ లో వివరణ కోరుతూ Cr.P.C సెక్షన్ 160 ప్రకారం CBI నోటీసులు జారీచేసింది. వారి అభ్యర్థన మేరకు డిసెంబర్ 6వ తేదీన హైదరాబాద్‌లోని నా నివాసంలో కలుసుకోవచ్చని అధికారులకు తెలియజేశాను" - ఎమ్మెల్సీ కవిత
ఈడీ రిమాండ్ రిపోర్టులో కవిత పేరు
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పేరు దిల్లీ లిక్కర్ స్కాంలో ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు అత్యంత సన్నిహితుడైన అమిత్ అరోరాను ఈడీ అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్టును కోర్టులో ప్రొడ్యూస్ చేసింది. అందులో కవిత పేరును ప్రస్తావించింది ఈడీ. సౌత్ గ్రూప్ నుంచి రూ. వంద కోట్లను అమిత్ అరోరా ద్వారా విజయ్ నాయర్‌కు చేర్చారని ఈడీ తేల్చింది. ఈ విషయాన్ని అరోరా అంగీకరించారని తెలిపారు. ఈ డీల్‌ను సౌత్ గ్రూప్ నుంచి శరత్ రెడ్డి, కవిత చూసుకోగా.. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సమన్వయపరిచారని ఈడీ చెబుతోంది. ఈ మొత్తం స్కాం గురించి బయటకు రాకుండా ఎప్పటికప్పుడు ఫోన్లు వాడారాని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. కవిత కూడా ఫోన్లు మార్చారని.. వాటిని దొరకకుండా ధ్వంసం చేశారని ఈడీ తెలిపింది. అమిత్ అరోరా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు అమిత్ సన్నిహితుడు. ఇక ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో అమిత్ అరోరా కీలకంగా వ్యవహరించారని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. గురుగాంకు చెందిన అమిత్ అరోరా ,దినేష్ అరోరా, అర్జున్ పాండేలతో కలిసి పాలసీని రూపొందించడంలో కీలకంగా పనిచేసినట్లు ఈడీ చెబుతోంది. వీరిలో దినేష్ అరోరా ఇప్పటికే అప్రూవర్‌గా మారారు. అమిత్ అరోరా బడ్జీ అనే ప్రైవేట్ కంపెనీ యజమానిగా ఉన్నాడు. సీబీఐ, ఈడీ FIRలో అమిత్ అరోరా 9వ నిందితునిగా ఉన్నాడు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారులు ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేశారు.
ముందు నుంచే ఆరోపణలు
ఢిల్లీలో లిక్కర్ స్కామ్‌లో సీబీఐ దర్యాప్తు ప్రారంభించినప్పుడే తెలంగాణకు చెందిన కల్వకుంట్ల పేరును బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఆమెపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే తనపై ఆరోపణలు చేయడాన్ని కవిత ఖండించారు. ఆధారాలు లేకుండా ఆరోపిస్తున్నారని.. తనపై విమర్శలు చేయకుండా కోర్టుకు వెళ్లి ఆదేశాలు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బీజేపీ నేతలు సైలెంట్ అయ్యారు. ఇటీవల సీబీఐ ఢిల్లీ లిక్కర్ స్కాంలో తొలి చార్జిషీటును దాఖలు చేసింది. అలాగే.. ఈడీ కూడా సమీర్ మహేంద్రుపై చార్జిషీటు దాఖలు చేసింది. కానీ సెల్ ఫోన్ల ధ్వంసం గురించి ప్రస్తావించారు కానీ.. కవిత పేరు మాత్రం తెరపైకి తీసుకురాలేదు. ఇటీవల ఈడీ ఈ కేసు విషయంలో కవిత పేరును ప్రస్తావించింది.
Bandi Sanjay : గవర్నర్ విషయంలో హైకోర్టు చివాట్లు, కేసీఆర్ ముఖం ఎక్కడ పెట్టుకుంటావ్?- బండి సంజయ్
Kamareddy Master Plan : కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టు విచారణ, ప్రభుత్వ నిర్ణయాన్ని తెలపాలని ఆదేశాలు
Breaking News Live Telugu Updates: ఏపీ సీఎం జగన్ విమానంలో సాంకేతిక లోపం, ఎమర్జెన్సీ ల్యాండింగ్
Hyderabad Traffic: హైదరాబాదీలు జర సోచో - ఆ రూట్లో నేటి నుంచి 40 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
Gutha Sukender Reddy On Governor : వక్రబుద్ధితో కొందరు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు- గుత్తా సుఖేందర్ రెడ్డి
Dasara: ఒక ఆర్ఆర్ఆర్, ఒక కేజీయఫ్, ఒక దసరా - టీజర్ లాంచ్‌లో నాని ఏమన్నాడంటే?
TSPSC Group4 Application: 'గ్రూప్-4' ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్, దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం
Upcoming Movies This Week: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే!