అన్వేషించండి

HYDRAA Latest News:పోచారం మున్సిపాలిటీలో హైడ్రా కూల్చివేత‌లు.. ఆనందంలో కాలనీవాసులు

HYDRAA Latest News:రంగారెడ్డి జిల్లా పోచారం మున్సిపాలిటీలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. మున్సిపాలిటీ పరిధి నారపల్లి దివ్యానగర్‌లోని లేఅవుట్స్‌లో రహదారికి అడ్డుగా నిర్మించిన ప్రహరీని కూల్చివేసింది. 

HYDRAA Latest News:హైదరాబాద్​ పరిధిలో హైడ్రా కూల్చివేత‌లు కొనసాగుతున్నాయి. శనివారం రంగారెడ్డి జిల్లా పోచారం మున్సిపాలిటీలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. దీంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధి నారపల్లి దివ్యానగర్‌లోని లేఅవుట్స్‌లో రహదారికి అడ్డుగా నిర్మించిన ప్రహరీని సిబ్బంది కూల్చివేశారు. 

దివ్యానగర్​లో భూముల కబ్జాలకు పాల్పడి రోడ్డుకు అడ్డంగా రోడ్డు నిర్మించారు. ప‌లు కాల‌నీలు, నివాస ప్రాంతాల‌కు వెళ్లేందుకు అవ‌కాశం లేకుండా దివ్య‌న‌గ‌ర్ లేఔట్ చుట్టూ అక్ర‌మంగా ప్రహరీ నిర్మించారు. ఆ గోడకు గేటు పెట్టి త‌మ‌ను అనుమ‌తించ‌డంలేదంటూ న‌ల్ల మ‌ల్లారెడ్డిపై అక్కడి ప్లాట్ల య‌జ‌మానులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దివ్య‌న‌గ‌ర్ లేఔట్‌లోంచి త‌మ నివాసాల‌కు, ప‌క్క‌నే ఉన్న ఇత‌ర లే ఔట్ల‌ ఉన్న దారుల‌ను మూసేసి ఇబ్బందులు పెడుతున్నారంటూ న‌ల్ల‌ మ‌ల్లారెడ్డిపై ప‌లు కాల‌నీవాసుల వాసులు ఫిర్యాదులు చేశారు. 

లేఔట్​ను పరిశీలించిన కమిషనర్​
స్థానికుల ఫిర్యాదుల నేపథ్యంలోనే ఈ నెల 8న హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ దివ్యానగర్ లేఅవుట్స్‌ను పరిశీలించారు. అక్రమ కట్టడాల నిర్మాణంపై ఆరా తీశారు. అధికారులు సర్వే చేసి ప్రభుత్వ స్థలంలో ప్రహరీ నిర్మించారని గుర్తించి కూల్చివేశారు. 
 
అమ్మితే రూ.50 వేలు చెల్లించాలని ఆదేశం!
ఆ అంశంపై పూర్తి విషయాలు తెలుసుకునేందుకు 23వ తేదీన హైడ్రా ప్ర‌ధాన కార్యాల‌యంలో ఇరు ప‌క్షాల‌తో హైడ్రా క‌మిష‌న‌ర్‌ చ‌ర్చలు జరిపారు. చర్చల్లో కాలనీ వాసులు మాట్లాడారు. దారులు మూసివేశారని, ఆ లే ఔట్ల‌లోని త‌మ ప్లాట్లు అమ్ముకోలేని ప‌రిస్థితి ఉందంటూ ప‌లువురు ఆవేద‌న‌ వ్యక్తం చేశారు. ఒక వేళ అమ్మినా తన స‌మ‌క్షంలో అమ్మ‌కాలు జ‌ర‌గాల‌ని ఇందుకు రూ. 50 వేలు చెల్లించాలని నల్ల మల్లారెడ్డి ఆంక్షలు విధించినట్లు ఆరోపించారు. 

Also Read: పేలిన బ్యాటరీలు.. హైదర్‌గూడలో బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం

మమ్మల్ని కొట్టారు
లేఔట్ డెవ‌ల‌ప్‌మెంట్ ఛార్జీల పేరిట డ‌బ్బులు వ‌సూలు చేశారని.. మురుగునీటి వ్య‌వ‌స్థ‌, ర‌హ‌దారులు నిర్మించ‌కుండా లేఔట్ చుట్టూ భారీ ప్ర‌హ‌రీ నిర్మించి, గేట్లు పెట్టి త‌మ‌ను కూడా అనుమ‌తించ‌డంలేద‌ని మండిపడ్డారు. ఇదే విష‌యాన్ని నిల‌దీస్తే త‌మ‌ను కొట్టారని న‌ల్ల‌మ‌ల్లారెడ్డి స‌మ‌క్షంలోనే క‌మిష‌న‌ర్‌కు ఫిర్యాదు చేశారు.  
త‌మ ప్లాట్లను తామే చూడాల‌న్నా, వేరే వాళ్ల‌కు చూపాల‌న్నా అనుమ‌తి ఉండ‌ద‌ని.. ఆయ‌న నిర్దేశించిన స‌మ‌యంలోనే రావాల్సి ఉంటుంద‌ని వివరించారు. గేటు ద‌గ్గ‌ర ఎంట్రీ పుస్త‌కంలో వివ‌రాల‌న్నీ రాస్తే.. ఆనుమ‌తించాలా లేదా అనే విష‌యాన్ని న‌ల్ల‌మ‌ల్లారెడ్డి నిర్ణ‌యిస్తార‌ని, అప్ప‌డే త‌మ‌కు ఎంట్రీ ఉంటుంద‌ని ప‌లువురు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సింగ‌రేణి కంపెనీలో ఉద్యోగాలు చేసి ప్లాట్లు కొంటే అవ‌స‌రాల‌కు తమ ప్లాట్లను తాము అమ్ముకునే అవ‌కాశం కూడా లేకుండా చేశారని అన్నారు. 

కమిషనర్​ ఆదేశాలతో కూల్చివేతలు
ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న కమిషనర్​..  ప్ర‌హ‌రీ నిర్మాణానికి అనుమ‌తులు లేవంటూ నిర్ధారించారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌హ‌రీ కూల్చివేత‌కు క‌మిష‌న‌ర్ ఆదేశాలివ్వగా.. ఆ ఆదేశాల మేరకు శనివారం అధికారులు కూల్చివేత‌లు చేప‌ట్టారు. 

తీరిన రోడ్డు కష్టాలు
ప్ర‌హ‌రీ కూల్చివేత‌తో దివ్య‌న‌గ‌ర్ లేఔట్​తోపాటు ప‌రిస‌ర ప్రాంతాల్లోని ఇత‌ర లేఔట్ నివాసితులు, య‌జ‌మానులు ఊపిరి పీల్చుకున్నారు. దివ్య‌న‌గ‌ర్ లేఔట్ చుట్టూ ఉన్న ప్ర‌హ‌రీ కూల్చివేత‌తో.. ఏక‌శిల లేఔట్‌, వెంక‌టాద్రి టౌన్‌షిప్‌, సుప్ర‌భాత్‌ వెంచ‌ర్–1, 2, 3, 4, మ‌హేశ్వ‌రి కాల‌నీ, క‌చ్చ‌వాణి సింగారం, ఏక‌శిల–పీర్జాదిగూడ రోడ్డు, బాలాజీన‌గ‌ర్‌, వీజీహెచ్ కాల‌నీ, ప్ర‌తాప్ సింగారం రోడ్డు, సాయిప్రియ‌, మేడిప‌ల్లి, ప‌ర్వ‌త‌పురం, చెన్నారెడ్డి కాల‌నీ, హిల్స్ వ్యూ కాల‌నీ, ముత్తెల్లిగూడకు రోడ్ల కష్టాలు తీరాయి.

200 ఎక‌రాల్లో 2218 ప్లాట్లు 
రంగారెడ్డి జిల్లా పోచారం మున్సిపాలిటీలో మొత్తం విస్తీర్ణం  200 ఎక‌రాల్లో దివ్య లేఔట్  విస్తరించి ఉంది. ఇందులో మొత్తం 2218 ప్లాట్లు వేశారు. ఈ ప్లాట్ల‌లో 30 శాతం  న‌ల్ల‌మ‌ల్లారెడ్డివేనని స‌మాచారం. ప్లాట్ య‌జ‌మానుల‌ను బెదిరించ‌డ‌మే కాకుండా స‌ర్వే నంబ‌రు 66లో 6.06 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని కూడా న‌ల్ల‌మ‌ల్లారెడ్డి క‌బ్జా చేశార‌ని ఫిర్యాదున్నాయి.

Also Read: ఈనోకు ఫ్రీ పబ్లిసిటీ - హైదరాబాద్ అంతా హోర్డింగులు - కేసీఆర్, కేటీఆర్ కడుపు మంటేమో కానీ కాంగ్రెస్‌కు ఖర్చే !

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
HYDRA Ranganath: హైడ్రా చుట్టూ వివాదాల వలయం - హైకోర్టు ఆదేశాలనూ లెక్క చేయడం లేదా? ఆర్మీ జోక్యం ఎందుకు?
హైడ్రా చుట్టూ వివాదాల వలయం - హైకోర్టు ఆదేశాలనూ లెక్క చేయడం లేదా? ఆర్మీ జోక్యం ఎందుకు?
Breaking News: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: YS Jagan సూటి ప్రశ్న
ధర్మేంద్ర ప్రధాన్ లాగా AP DSC అక్రమాలపై నారా లోకేష్ రాజీనామా చేస్తారా?: వైఎస్ జగన్ ప్రశ్న
Revanth Reddy: ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
ఇది జెన్-జీ విజయం.. క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలో వేసుకోదు: క్యాండిల్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి
IND VS ZIM 2nd T20 Result Update: శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్, య‌శ్, ప్రిన్స్
శ్రేయ‌స్ ఖాతాలో తొలి సిరీస్.. రెండో టీ20లో జింబాబ్వే చిత్తు, స‌త్తా చాటిన ఇషాన్, తిల‌క్, అభిషేక్ శర్మకు 3 వికెట్లు
Dharmendra Pradhan Resignation Reasons: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక అసలు కథ - మోదీ సర్కార్ పట్టు వదలడానికి 3 ప్రధాన కారణాలు!
Pawan Kalyan Seed Balls: డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
డ్రోన్లతో సీడ్ బాల్స్ వర్షం - 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంగా పవన్ కళ్యాణ్ బిగ్ ప్లాన్
Dharmendra Pradhan Resignation News: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా- సీజేపీ, విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన కేంద్రం
Azadi 501 Series Trailer : ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్ స్కామ్ సిరీస్ - ఇంట్రెస్టింగ్‌గా ఆజాదీ 501 ట్రైలర్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Team India Equals Own World Record :  వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
వ‌ర‌ల్డ్ రికార్డును స‌మం చేసిన టీమిండియా.. అత్య‌ధిక సార్లు ఆ ఘ‌న‌తను సాధించిన జ‌ట్టుగా శ్రేయ‌స్ సేన‌.. పొట్టి ఫార్మాట్లో అత్య‌ధికంగా..
Embed widget