జనవరి 26, 2025న 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం.

మనకి స్వాతంత్య్రం వచ్చిన ఆగస్టు 15 ఎంత ముఖ్యమో, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కూడా అంటే ముఖ్యం.

భారతదేశ జనవరి 26, 1950 ఉదయం 10:18 నిమిషాలకు గణతంత్ర రాజ్యాంగా అవతరించింది.

సరిగ్గా ఆరు నిమిషాల తర్వాత అంటే 10. 24 గంటల తర్వాత డాక్టర్ రాజేంద్రప్రసాద్ రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు.

1950 జనవరి 26న తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జాతీయ జెండాను ఎగరేశారు.

అప్పటి వరకు 1935 నాటి భారత బ్రిటిష్ కొలొనియల్ ప్రభుత్వ చట్టమే అమలు.

రాష్ట్రపతికి గౌరవ సూచకంగా ఈ వేడుకల్లో 21 గన్ సెల్యూట్ చేస్తారు.

జాతీయ గీతం ప్రారంభం కాగానే.. మొదటి ఫైరింగ్, పూర్తి కాగానే చివరి ఫైరింగ్

భారత రాష్ట్రపతి త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు.

జనవరి 29న జరిగే బీటింగ్ రీట్రీట్ సెరెమనీ తో వేడుకలు పూర్తవుతాయి.