KTR: అధైర్య పడకండి, అండగా ఉంటాం.. సిరిసిల్ల బాధితులకు మంత్రి కేటీఆర్ హామీ
హైదరాబాద్‌లో నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను, కుటుంబ సభ్యులను మంత్రి కేటీఆర్ స్వయంగా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని అన్నారు.
ఎల్లారెడ్డి పేట మండలం అల్మాస్ పూర్ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని మంత్రి కేటీఆర్ అన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లో నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను, కుటుంబ సభ్యులను మంత్రి కేటీఆర్ స్వయంగా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని అన్నారు. నిందితుడు ఎవరైనా కఠిన శిక్షపడాల్సిందేనని అన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. పాపకి అవసరమైన, మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి డాక్టర్లకు మంత్రి సూచించారు.
Also Read: కేసీఆర్ అహంకారాన్ని బొంద పెట్టిన.. మీ రుణం తీర్చుకోలేను.. ఉపఎన్నిక ఫలితంపై ఈటల
వి.శ్రీనివాస్ గౌడ్‌ను పరామర్శించిన కేటీఆర్
రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ పరామర్శించారు. మహబూబ్ నగర్‌లోని శ్రీనివాస్ గౌడ్ నివాసంలో ఆయన తల్లి శాంతమ్మ చిత్రపటానికి కేటీఆర్ పూలమాల వేసి నివాళి అర్పించారు. కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు లక్ష్మా రెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్సీ నవీన్ రావు కూడా మంత్రిని పరామర్శించిన వారిలో ఉన్నారు.
శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ (78) కొన్ని రోజుల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. గత శుక్రవారం రాత్రి ఆమెకు ఆకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో కన్నుమూశారు. అంతేకాక, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే మంత్రి శ్రీనివాస్ గౌడ్ తండ్రి కూడా చనిపోయారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అనారోగ్యం వల్ల మృతి చెందారు. ఒకే ఏడాదిలోనే మంత్రికి తల్లిదండ్రులిద్దరూ దూరం కావడం ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి మాతృమూర్తి శ్రీమతి శాంతమ్మ గారు మరణించిన సందర్భంగా ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు అల్లా వెంకటేశ్వర్ రెడ్డి, గువ్వల బాలరాజు, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, కాలేరు వెంకటేష్ , కృష్ణ మోహన్ రెడ్డి & ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ pic.twitter.com/WYnLPcGKMI
— VSGOffice (@VSGOfficeMBNR) November 3, 2021
మంత్రివర్యులు వి.శ్రీనివాస్ గౌడ్ గారి మాతృమూర్తి శ్రీమతి శాంతమ్మ గారు మరణించిన సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి గారు శాంతమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రిగారికి మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. pic.twitter.com/JZVVYNuXLB
— VSGOffice (@VSGOfficeMBNR) November 3, 2021
Also Read: Hyderabad: పెట్రోల్ ధరలతో భయమొద్దు.. రూ.100 చెల్లించండి రోజంతా తిరగండి.. సజ్జనార్ ప్రకటన
Also Read: Eatala Rajender: కేసీఆర్ అహంకారాన్ని బొంద పెట్టిన.. మీ రుణం తీర్చుకోలేను.. ఉపఎన్నిక ఫలితంపై ఈటల
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి