News
News
X

KTR On Delhi Liquor Case: కవితకు వచ్చినవి ఈడీ సమన్లు కావు, మోడీ సమన్లు : కేటీఆర్

KTR On Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు సమన్లు రావడం రాజకీయ కుట్రలో భాగమేనన్నారు మంత్రి కేటీఆర్. అవి ఈడీ సమన్లు కావని అభిప్రాయపడ్డారు.

FOLLOW US: 
Share:

KTR On Delhi Liquor Case: భయోత్పాత వాతావరణం సృష్టించి అధికారంలోకి రావడం బీజేపీకి ఉన్న అలవాటు అని ఆరోపించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. బీఆర్‌ఎస్ గాలిని తట్టుకోలేక మొదటి నుంచి తమ పార్టీకి చెందిన నేతలపైకి ఈడీ, ఐటీ, సీబీఐలను పంపిస్తోందన్నారు. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్సీ కవితకు వచ్చిన నోటీసులు కూడా ఆలంటి కోవలోనివేననన్నారు. అసలు ఇవి ఈడీ పంపించిన సమన్లు కావని... మోడీ పంపిన సమన్లు అని ఎద్దేవా చేశారు. 

దేశంలో అందరూ అవినీతి పరులు తాము మాత్రమే సత్యహరిశ్చంద్రకు కజిన్ బ్రదర్స్‌లా ఫోజులు కొడుతున్నారని మోడీపై మండిపడ్డారు కేటీఆర్. దేశంలో అందరూ అవినీతి పరులు తాము మాత్రమే సత్యహరిశ్చంద్రకు కజిన్ బ్రదర్స్‌లా ఫోజులు కొడుతున్నారని మోడీపై మండిపడ్డారు. ఇలాగైనా చేసి బయటపడదామనే చిల్లర ప్రయత్నమే తప్ప ఇంకొకటి కాదన్నారు. నీతి లేని పాలనకు నిజాయితీ లేని దర్యాప్తు సంస్థలకు పర్యాయపదంగా మారింది ఎన్డీఏ ప్రభుత్వం అని విమర్శించారు. ప్రతిపక్షాలపై కేసులు దాడి ప్రజలపై ధరల దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గంగలో మునిగితే పాపాలు పోతాయని అన్నట్టు... బీజేపీలోకి వెళ్లిన వారంతా నీతిపరులైపోతారని మండిపడ్డారు కేటీఆర్. 120 షెల్‌ కంపెనీల ద్వారా బ్యాంక్ లను మోసం చేశారని సుజనా చౌదరిపై 2018లో హడావుడి చేసిన దర్యాప్తు సంస్థలు తర్వాత ఎందుకు సైలెంట్ అయ్యాయని ప్రశ్నించారు. బీజేపీలో జాయిన్ అయిన తర్వాత ఆ కేసులు ఏమయ్యాయని నిలదీశారు. 

ఈడీ అనేది 2014 తర్వాత చేసిన దాడుల్లో 95 శాతం ప్రతిపక్షాలపైనే అన్నారు కేటీఆర్‌. ఐదవేల నాలుగు వందల ఇరవై రెండు కేసుల్లో తీర్పు వచ్చింది కేవలం 23 కేసుల్లోనే అని వివరించారు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే లక్ష్యంతో ఇలా చేస్తున్నారన్నారు. ఈడీ అంటే ఎరాడికేషన్ డెమోక్రసీ అని అభిప్రాయపడ్డారు. కర్నాటకలో ఎమ్మెల్యే కుమారుడు విరూపక్ష కుమారుడు డబ్బులు తీసుకుంటూ దొరికినా కేసులు లేవన్నారు. మరో ఎంపీ మాట్లాడుతూ.. తన జోలికి ఈడీ రాదని నిర్భీతిగా చెబుతున్నారన్నారు. బీజేపీలోకి వెళ్లిన తర్వాత ఈడీ గోల లేకుండా ప్రశాంతంగా ఉన్నానంటూ ఓ కాంగ్రెస్ ఎంపీ చెప్పారని గుర్తు చేశారు. 

హిమంత్‌ బిశ్వ శర్మపై ఉన్న కేసులు ఏమయ్యాయని ప్రశ్నించారు కేటీఆర్. ప్రతిపక్షాలపై ఇన్ని కేసులు పెట్టిన కేంద్రం బీజేపీ నేతలపై పెట్టిన కేసులు గురించి చెప్పగలదా అని నిలదీశారు. మోడీ, అదాని స్నేహం గురించి ఇంకా ఎంత కాలం దాయగలరూ అని క్వశ్చన్ చేశారు. . కర్నాటక అత్యంత అవినీతిమైయమైంది చెబితే చర్యలు ఏమైనా తీసుకున్నారా...కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నా చర్యలు తీసుకున్నారా నిలదీశారు. మేఘాలయలో అత్యంత అవినీతిపరుడని అక్కడ సీఎంపై ఆరోపణలు చేసిన మోదీ ఆయన ప్రమాణస్వీకారానికి ఎలా వెళ్లారని ప్రశ్నించారు. 

విచారణ ఎదుర్కొంటాం: కేటీఆర్
ఎమ్మల్సీ కవిత ఈడీ విచారణ ఎదుర్కొంటారన్నారు కేటీఆర్. బీజేపీ నేతల్లా కేసులు పెడితే దాక్కోవడం కాదని బీఎల్‌ సంతోష్ అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు జరుగుతుందంతా పొలిటికల్ హంబక్కే తప్ప ఇంకేం లేదన్నారు. 

బీజేపీ అనుబంధ సంఘాలే ఈడీ, సీబీఐ, ఐటీ

రిటైర్‌ అయిన వ్యక్తులను ఈ దర్యాప్తు సంస్థలతోపాటు ఎల్‌ఐసీ, ఇండసిండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ ఛైర్మన్‌లుగా ఎందుకు కొనసాగిస్తున్నారో తెలుసు అన్నారు కేటీఆర్. ఈడీ ఉన్నతాధికారికి రిటైర్‌మెంట్‌ను మూడుసార్లు పొడిగించారన్నారు. ఎల్‌ఐసీ ఛైర్మన్‌కు మూడుసారు పొడిగింపు ఇచ్చారన్నారు. అదానీలకు లబ్ధి చేకూర్చాలి... మోడీ చెప్పినట్టు వినాలనే ఇలాంటి వెసులుబాటు ఇస్తున్నారన్నారు. ఇన్వెస్టర్ల సంపద ఆవిరైనా దోస్తు మాత్రం భద్రంగా ఉండాలనే మోదీ తాపత్రయం అన్నారు. వన్‌ నేషన్ వన్ దోస్తు అనేది మోడీ కొత్త స్లోగన్‌ అనిచెప్పారు. 

Published at : 09 Mar 2023 12:41 PM (IST) Tags: Modi KTR ED Kavitha BRS CBI

సంబంధిత కథనాలు

TSPSC Paper Leak: పేపర్ లీకేజీ కేసులో నలుగురు నిందితులకు కస్టడీ, ఈ సారైన నోరు విప్పుతారా?

TSPSC Paper Leak: పేపర్ లీకేజీ కేసులో నలుగురు నిందితులకు కస్టడీ, ఈ సారైన నోరు విప్పుతారా?

TSPSC Paper Leak: దేశం దాటిన 'గ్రూప్​–1' పేపర్, సిట్ విచారణలో విస్మయపరిచే విషయాలు!

TSPSC Paper Leak: దేశం దాటిన 'గ్రూప్​–1' పేపర్, సిట్ విచారణలో విస్మయపరిచే విషయాలు!

TS SSC Exams 2023: ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి పరీక్షలు, హాల్‌టికెట్లు అందుబాటులో!

TS SSC Exams 2023: ఏప్రిల్ 3 నుంచి పదోతరగతి పరీక్షలు, హాల్‌టికెట్లు అందుబాటులో!

Hyderabad News : నీటి శుద్ధిలో సరికొత్త ప్రయోగాలు - ఇక ప్లాంట్లు కూడా క్లీన్ !

Hyderabad News :  నీటి శుద్ధిలో సరికొత్త ప్రయోగాలు - ఇక ప్లాంట్లు కూడా క్లీన్ !

దమ్ముంటే సిట్‌కు బీజేపీ నేతలు ఆధారాలు ఇవ్వాలి- మంత్రి జగదీశ్‌ రెడ్డి

దమ్ముంటే సిట్‌కు బీజేపీ నేతలు ఆధారాలు ఇవ్వాలి- మంత్రి జగదీశ్‌ రెడ్డి

టాప్ స్టోరీస్

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ, ఈ జిల్లాల్లో వానలు! ఈదురుగాలులు కూడా

Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో అలెర్ట్ జారీ, ఈ జిల్లాల్లో వానలు! ఈదురుగాలులు కూడా