By: ABP Desam | Updated at : 23 Apr 2022 02:29 PM (IST)
పరికరం ఆవిష్కరిస్తున్న మంత్రి కేటీఆర్
నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన గ్రామీణ శాస్త్రవేత్త మండాజి నర్సింహాచారి రూపొందించిన ఇంస్టాషిల్డ్ వైరస్ కిల్లర్ పరికరాన్ని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని మంత్రి నివాసంలో నర్సింహాచారి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్బంగా ఆయన ఆ పరికరం ఎలా రూపొందించింది అడిగి తెలుసుకున్నారు. చారిని అభినందిస్తూ, ఆవిష్కరణ అద్భుతంగా ఉందని ఈ పరికరం అందరికి ఉపయోగ పడుతుందని తెలిపారు. పరికరం ఉత్పత్తికి పరిశ్రమ ఏర్పాటుకోసం ప్రభుత్వపరంగా సహకరిస్తామని తెలిపారు. ఇంస్టాషిల్డ్ లాంటి ఆవిష్కరణలకు ఊతం ఇస్తామని గతంలో నర్సింహాచారి ఇంటింటా ఇన్నోవేటర్ పురస్కారానికి ఎంపికయ్యారని ఇప్పుడు ఈ స్థాయికి చేరడం ఆనందంగా ఉందని మంత్రి అన్నారు.
చారి మాట్లాడుతూ ప్రజారోగ్యాన్ని వైరస్ ల బారి నుండి కాపాడాటానికే రెండేళ్లు శ్రమించి ఇంస్టాషీల్డ్‌ను రూపొందించామన్నారు. ప్రతి ఒక్కరికి దీనిని చేర్చడమే తన జీవితాశయమన్నారు. కరోనా, సార్స్, ఓమైక్రాన్, డెల్టా తదితర బ్యాక్టీరియా అన్ని రకాల వైరస్ లను నెగెటివ్ ఎలక్ట్రాన్ల సహాయంతో సంహరించే పరికరాన్ని రూపొందించారు. సీసీఎంబీ, సీడీఎస్సీవో, వింటా, ఎంటాక్ ల్యాబ్ తదితర సంస్థలు దీనిని ధ్రువీకరించాయని ఇంస్టాషిల్డ్ మెడికల్ డివైస్ పేరిట విడుదల చేస్తున్నారని చారి తెలిపారు.
ఈయన హైదరాబాద్ రాజేంద్రనగర్ సమీపంలోని బుద్వేల్ లో ఉంటున్నారు. కరోనా మూలాల్ని తెలుసుకొని, పలు ప్రయోగాలు చేసి ఈ పరికరం తయారు చేశారు. ఆత్యల్ప సమయంలోనే ఇది అన్ని రకాల వైరస్ లను సంహరిస్తుంది. దీనివల్ల దుష్పరిణామాలు ఉండవని సీసీఎంబీ తేల్చింది. చారి పరిశోధనలకు సీసీఎంబీ, టీఎస్ఐసీ సహకరించాయి.
ఇంస్టాషిల్డ్ తో కరోనా, కోవిడ్, కోవ్2, సార్స్, ఓమైక్రాన్, డెల్టా తదితర బ్యాక్టీరియా అన్ని రకాల వైరస్ లను, భవిష్యత్తులో వచ్చే కొత్త రకాల వైరస్ లను చంపటానికి సరిపడే ఒక నిర్దిష్టమైన వేవ్ లెంత్ తో కొన్ని ట్రిలియన్లలో నెగెటీవ్ ఎలెక్ట్రాన్ లు అభివృద్ధి చేసి తద్వారా ఈ అన్ని రకాల వైరస్ లను సంహరించే టెక్నాలజీని రూపొందించారు.
ఆత్యల్ప సమయంలోనే ఇది అన్ని రకాల వైరస్ లను సంహరిస్తుంది. ఇది సుమారుగా 5 వేల స్వాకైర్ పిట్ల వరకు పనిచేస్తుంది. ఈ కరోనా వైరస్ ను చంపడానికి నిర్దిష్టమైన వేవ్ లెంత్ ఎలక్ట్రాన్ నులు మన ఇంటి గోడల మధ్యలోనుండి కూడా బయటకు దూసుకొని పోతాయి. తద్వారా వెలుపల ఉన్నా వైరస్ లు కూడా చనిపోతాయి. విద్యాసంస్థలు, బ్యాంకులు, కార్యాలయాలు, ఇళ్లు, సమావేశ గదులు, వివాహకార్యక్రమాలు, హోటళ్లు, ఆస్పత్రులు మొదలైన అన్ని రకాల కమ్యూనిటీ ప్రదేశాలలో ఇంస్టాషిల్డ్ ను ఉపయోగించి వైరస్‌ల నుంచి రక్షించుకోవచ్చు.
అతి తక్కువ కరెంటుతో..
ఇక దీనికి అయ్యే కరెంట్ ఖర్చు చాలా తక్కువ. 3.6 వాట్ల విద్యుత్ మాత్రమే తీసుకుంటుంది. అంటే ఐదు వాట్ల కరెంట్ తీసుకొనే మన మొబైల్ ఛార్జింగ్ కన్నా తక్కువ అన్నమాట. దీనివల్ల దుష్పరిణామాలు ఏవీ ఉండవని కూడా సీసీఎంబీ తేల్చింది.
Hyderabad News : బీజేపీ కార్పొరేటర్ ఆర్డర్ చేసిన బిర్యానీలో బల్లి, హోటల్ నిర్వాహకుడికి నోటీసులు
Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం
TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు
Kishan Reddy On TRS: తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి పెట్టుబడులు కేంద్రం ఘనతే- ప్రజలు గమనిస్తున్నారన్న కిషన రెడ్డి
Hyderabad Crime : ఇళ్లు రెంట్ కు చూపిస్తానని చెప్పి యువతిపై అత్యాచారయత్నం, వాట్సాప్ గ్రూప్ ద్వారా ట్రాప్!
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!
Rashmika Mandanna: బ్లాక్ డ్రెస్ లో రష్మిక - ఫొటోలు వైరల్
Texas School Shooting : మృత్యుంజయురాలు ఆ చిన్నారి - అమెరికాలో కాల్పుల నుంచి ఎలా తప్పించుకుందంటే ?