News
News
X

Harish Rao: సొంత జాగా ఉంటే డబ్బులిస్తాం, ఇల్లు కట్టుకోవచ్చు: హరీశ్ రావు, ఎప్పటినుంచంటే

తెలంగాణ రాష్ట్రంలో దసరా నాటికి సొంత స్థలం ఉన్నవారికి ఇళ్లు కట్టుకునేందుకు నిధులు ఇస్తామని హరీశ్ రావు వెల్లడించారు.

FOLLOW US: 

Harish Rao News: తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మందికి పైగా పింఛన్లు ఇస్తున్నామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో ఎంత మంది పెన్షన్లకు అర్హులుగా ఉంటే అంత మందికి పింఛన్లు ఇవ్వాలని సీఎం చెప్పారు. సంగారెడ్డిలో పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో పింఛనుదారులకు స్మార్ట్​ కార్డులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఏ తోడూ లేని పెద్ద వారికి, ఒంటరి మహిళలకు పింఛను, రేషన్ బియ్యం భరోసా ఇస్తున్నాయని అన్నారు. అలాంటిది ఉచితాలు ఆపేయాలని కేంద్రంలోని బీజేపీ చెబుతోందని అన్నారు. కార్పొరేట్ వ్యాపారులకు రూ.వేల కోట్లు మాఫీ చేస్తూ పేదలకు ఉచిత పథకాలు ఇవ్వొద్దని చెప్తున్నారని విమర్శించారు. అన్ని వస్తువులపై ధరలు పెంచి పేదలపై భారం మోపుతున్నారని విమర్శించారు. గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.వెయ్యి దాటిందని, దాంతో పేదలు వంట గ్యాస్ కొనలేకపోతున్నారని అన్నారు. రైతులకు ఉచిత కరెంట్‌ ఇస్తామని చెప్పిన హామీని నెరవేర్చామని అన్నారు.

ఇంటి స్థలం ఉన్నవారికి నిధులు ఇస్తాం - మంత్రి
తెలంగాణ రాష్ట్రంలో దసరా నాటికి సొంత స్థలం ఉన్నవారికి ఇళ్లు కట్టుకునేందుకు నిధులు ఇస్తామని హరీశ్ రావు వెల్లడించారు. రూ.3 లక్షలు సొంత స్థలం ఉంటే ఇస్తామని అన్నారు. రైతులకు, నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తుంటే, కేంద్రం ఉచితాలు ఇవ్వొద్దని చెబుతుందని హరీశ్ ​రావు విమర్శించారు. ఏడాదిలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. బీజేపీ నాయకులవి మాటలు తప్ప చేతలు లేవని హరీశ్ రావు వ్యాఖ్యలు చేశారు.

ఏ విషయంలో అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట తప్పబోరని మంత్రి హరీష్ రావు అన్నారు. డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ ఉన్న కర్ణాటకలో కూడా తెలంగాణలో ఇచ్చినంత పెన్షన్ ఇవ్వడం లేరని అన్నారు. పెన్షన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదికి రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.

రెండు మూడు రోజుల్లో గ్రూప్‌ 4 నోటిఫికేషన్‌ వస్తుందని హరీశ్ రావు తెలిపారు. రాబోయే వారం రోజుల్లో 28 వేల ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రి హరీశ్‌ రావు చెప్పారు. ఇప్పటికి 52 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామని వెల్లడించారు.

అంతకుముందు, సంగారెడ్డి జిల్లాలోని నందికంది‌ గ్రామంలో గల రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని‌ హరీశ్‌ రావు సందర్శించి పూజలు‌ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 శతాబ్దం నాటి దేవాలయం నంది కొండలో ఉండటం గొప్ప విషయం అని అన్నారు. ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కోరిక మేరకు 25 లక్షల రూపాయలు తక్షణం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు రోజుల్లో జీవో కాపీ అందిస్తామని అన్నారు. ఆర్కియాలజీ డిపార్ట్‌ మెంట్‌తో కూడా సమావేశమై ఇంకా ఎలా అభివృద్ధి చేయాలో ప్రణాళికలు రూపొందిస్తామని హరీశ్ రావు అన్నారు.

Published at : 01 Sep 2022 02:15 PM (IST) Tags: sangareddy Minister Harish Rao pensions Harish Rao houses in telangana

సంబంధిత కథనాలు

Telangana Free Electricity: వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ, మరెన్నో కీలక విషయాలు

Telangana Free Electricity: వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ, మరెన్నో కీలక విషయాలు

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Minister Prashanth: రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే సర్కార్ కాదు - మంత్రి వేముల

Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణం, యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి!

Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణం, యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి!

Kishan Reddy : అప్పుల కోసం కేంద్రాన్ని కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు- కిషన్ రెడ్డి

Kishan Reddy : అప్పుల కోసం కేంద్రాన్ని కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు- కిషన్ రెడ్డి

YS Sharmila: ఆయన మోసగాడు, రంగులు మార్చడంలో దిట్ట - షర్మిల ఘాటు వ్యాఖ్యలు

YS Sharmila: ఆయన మోసగాడు, రంగులు మార్చడంలో దిట్ట - షర్మిల ఘాటు వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

MS Dhoni: ధోనీ ఫేస్ బుక్ పోస్టుపై స్పష్టత, ఈసారి ప్రపంచకప్ మనదే అంటున్న మహీ

MS Dhoni:  ధోనీ ఫేస్ బుక్ పోస్టుపై స్పష్టత, ఈసారి ప్రపంచకప్ మనదే అంటున్న మహీ

Zaheerabad Rape: పెళ్లైన మహిళపై గ్యాంగ్ రేప్! జహీరాబాద్‌లో దారుణం

Zaheerabad Rape: పెళ్లైన మహిళపై గ్యాంగ్ రేప్! జహీరాబాద్‌లో దారుణం

DJ Tillu 2: మొన్న డైరెక్టర్, ఇప్పుడు హీరోయిన్లు - 'డీజే టిల్లు'సీక్వెల్‌ను లైట్ తీసుకుంటున్నారా?

DJ Tillu 2: మొన్న డైరెక్టర్, ఇప్పుడు హీరోయిన్లు - 'డీజే టిల్లు'సీక్వెల్‌ను లైట్ తీసుకుంటున్నారా?

Hero E-scooter: హీరో నుంచి ఎట్టకేలకు ఇ-స్కూటర్, విడుదల ఎప్పుడంటే?

Hero E-scooter: హీరో నుంచి ఎట్టకేలకు ఇ-స్కూటర్, విడుదల ఎప్పుడంటే?