అన్వేషించండి

రాజాసింగ్‌ అరెస్టుకు కారణమేంటి- ఒకేసారి ఇన్ని ఫిర్యాదులు ఎందుకూ?

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు వ్యతిరేకంగా భారీగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అరెస్టు చేయ్యాలంటూ వివిధ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 

వివాదం అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే నాయకుడి పేరు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదం ఉంటుందని అంటుంటారు ప్రతిపక్ష పార్టీల నాయకులు. ఎప్పుడూ ఏదో ఒక వివాదం ఆయన చుట్టూ ఉంటూనే ఉంటుంది. ఈ బీజేపీ కీలక నేత రాజాసింగ్ చుట్టూ మరో వివాదం ముసురుకుంది. 

ఆయన తాజాగా విడుదల చేసిన ఓ వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. ఆ వీడియో చివర్లో.. తాను మాట్లాడింది అంతా కామెడీ అని... తాను చెప్పింది తనకే నచ్చలేదని చెప్పారు రాజాసింగ్. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలతో విడుదలైన ఈ వీడియాపై.. ఎంఐఎం, కాంగ్రెస్ భగ్గుమన్నాయి. రాజాసింగ్‌కు వ్యతిరేకంగా అర్ధరాత్రి హైదరాబాద్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కార్యాలయం ముందు, పట్టణంలోని ఇతర ప్రాంతాల‌లో నిరసనలు చెలరేగాయి. స్టాండప్‌ కమెడియన్ మునావర్ ఫరూఖీ, అతని తల్లిని కూడా "కామెడీ" అని రాజాసింగ్ అన్నారు. రాజాసింగ్‌ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ అనేక మంది ప్రజలు వీధుల్లో నిరసనలు చేశారు.

నుపూర్ శర్మ చెప్పిన విషయాలను పునరావృతం..

వీడియో చివర్లో, అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత.. తాను మాట్లాడినదంతా 'కామెడీ' అని, తాను చెప్పింది తనకే నచ్చలేదని చెప్పారు. సస్పెండైన బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మ ఇటీవల టీవీలో చెప్పిన కొన్ని విషయాలను సింగ్ పునరావృతం చేశారు. అప్పట్లో నుపుర్ శర్మ వ్యాఖ్యలను ముస్లిం దేశాలు అన్నీ తీవ్రంగా ఖండించాయి. భారత దేశం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. దీంతో నుపుర్ శర్మను  బీజేపీ అధికార ప్రతినిధిగా అధిష్ఠానం సస్పెండ్ చేసింది. 

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హైదరాబాద్ లో అర్ధరాత్రి బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ముందు నిరసనలు చెలరేగాయి. సీపీ ఆఫీస్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. రాజాసింగ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలోని భవనీనగర్, డబీర్ పురా, రెయిన్ బజార్, మీర్‌చౌక్ సహా.. వివిధ ప్రాంతాల్లో కూడా ప్రజలు నిరసనలు తెలిపారు.

కాంగ్రెస్ నేత రషెద్ ఖాన్ నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాలా తన మద్దతుదారులతో ఫిర్యాదు చేసేందుకు దబీర్‌పురా పోలీస్ స్టేషన్ ‌కు వచ్చారు. రాజాసింగ్ పై దబీర్ పురా పోలీసు స్టేషన్ లో Cr.no 133 /2022 under sec 153a, 295, 505 కింద కేసులు నమోదు చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
మైనర్ కొడుకును కిల్లర్‌గా మార్చిన తల్లి.. సిద్ధిపేటలో దారుణం - క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించేలా
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget