Manchu Manoj Comments: మీడియాకు క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్- నాన్న దేవుడంటూ కన్నీటి పర్యంతం
Manchu Manoj And Mohan Babu: మంచు ఫ్యామిలీలో జరుగుతున్న పరిణామాలపై మనోజ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివి చూస్తానని అనుకోలేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తన తండ్రి దేవుడు అంటూ కామెంట్స్ చేశారు.
Manchu Family Fight: ప్రేమించి అమ్మాయి కోసం పోరాటం చేసే క్రమంలో తన తండ్రికి, తనకు మధ్య విభేదాలు సృష్టించారని తీవ్ర ఆరోపణలు చేశారు. మీడియాపై తన తండ్రి చేసిన దాడికి క్షమాపణలు చెప్పారు. తనకు అండగా నిలబడిన వాళ్లకు ఇలా జరగడం ఊహించలేదన్నారు. ఇప్పుడు కనిపిస్తున్న వ్యక్తి తన తండ్రి కాదని ఆయన్ని పూర్తిగా బ్రెయిన్ వాష్ చేశారని ఆరోపించారు. తన తండ్రి దేవుడని... ఇలా ఉండే వాడు కాదని అన్నారు.
మోహన్ బాబు చేసిన దాడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జర్నలిస్ట్ సంఘాలు జల్‌పల్లిలోని ఆయన నివాసం వద్దే ధర్నా చేశారు. దీనికి మంచు మనోజ్ సంఘీభావం ప్రకటించారు. వారితో కలిసి ఆందోళన చేశారు. అనంతరం మీడియా మాట్లాడిన ఆయన కుటుంబంలో జరుగుతున్న పరిణామాలపై బోరున విలపించారు. ఇలాంటివి జరుగుతాయని ఎప్పుడూ ఊహించలేదన్నారు. ఎన్ని విధాలుగాప్రయత్నించినా అవి సామరస్యంగా పరిష్కారం కాలేదని అన్నారు.
ఇంకా ఏమన్నారంటే..." నేను మీ తమ్ముడిని అనుకోండి వేరే వాడిని అనుకోండి. మీకు ఏ సాయం కావాలన్నా ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉంటాను నాకు సపోర్ట్ కోసం వచ్చి మీకు ఇలా జరగడం బాధగా ఉంది. నా బార్య పేరు లాగుతున్నారు ఏడు నెలల కూతురు పేరు లాగుతున్నారు. నేను ఏం అడగలేదు. నా భార్య కూడా డబ్బు తీసుకురాలేదు. డబ్బు కూడా ఆశించలేదు. నేను కూడా అడగలేదు. ఆస్తి అడగలేదు. మా ఆవిడ ఏడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు తెలిసిన వాళ్లు మాట్లాడు. ఎప్పటి నుంచో బయట ఉన్నావ్. మీ అన్న దుబాయ్ షిప్టు అయ్యాడు. మీ తల్లిదండ్రులు ఒక్కరే ఉన్నారు. మీ భార్య గర్భవతిగా ఉంది. ఆమెకు సహాయం కావాలి కాబట్టి ఇక్కడి రావాలని చెప్పారు. అందరూ చెప్పేది వినాలని నా భార్య కూడా చెప్పడంతో నేను ఇక్కడకు వచ్చాను.
చేయని తప్పులకు తనను దోషిగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు మనోజ్. "ఇంటికి వచ్చిన తర్వాత ఇవాళ ఆరోపణలు చేస్తున్నారు. అన్నింటికీ ఆధారాలు చూపిస్తాను. ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదామంటున్నా పట్టించుకోలేదు. అక్కడ ఉండే నా బంధువులు నా వద్దకు వచ్చి సమస్యలను చెప్పుకున్నారు. నేను వాళ్లకు సపోర్ట్‌గా ఉన్నాను. వినయ్‌కు మెసేజ్‌లు పెట్టాను. ఇష్యూ క్లియర్ చేయమంటే దురుసుగా మెసేజ్‌లు పెట్టారు. ఇకపై ఆగలేను. ప్రతిదీ ఈవినింగ్ చెప్తాను. "
మొన్న గొడవ జరిగినప్పుడు ఇంట్లో నన్ను కొట్టారని ఆ రోజు ఆసుపత్రికి తాను 108 అంబులెన్స్‌లో వెళ్లాల్సి వచ్చిందన్నారు మనోజ్. "ఆరోజు నేను పోలీసుల మద్దతు అడిగినప్పుడు 100కు ఎందుకు ఫోన్ చేశాను ఆరోజు ఏమాట్లాడానో పోలీసుల నుంచి తీసుకోండి. ఆ రోజు మా ఇంటికి 108 అంబులెన్స్ వచ్చింది. ఇన్ని కార్లు ఉండగా 108 వాహనం ఎందుకు వచ్చిందో ఎవరికైనా తెలుసా? పోలీసులకి కూడా ఈ విషయం తెలుసు. సీసీ కెమెరాలు తెప్పిస్తే నేను ఎవర్ని కొట్టానో తెలుస్తుంది." అని అన్నారు
మనోజ్ ఇంకా ఏమన్నారంటే..." విజయ్, కిరణ్ దొంగతనం చేశారని చెప్పాను. మేం చూసుకుంటామని చెప్పిన పోలీసులు పట్టించుకోలేదు. నిన్న ఆ కిరణ్ మా ఇంట్లోనే తిరిగాడు. పనివాళ్లను బెదిరించి పారిపోయేలా చేశాడు. నా కూతురు బట్టలు కూడా ప్యాక్ చేసేందుకు ప్రయత్నించాడు. అప్పుడు నేను కంగారుగా డీజీ ఆఫీస్‌లకు వెళ్లాల్సి వచ్చింది. ఇలాంటివి చూస్తుంటే భయమేస్తుంది. "
నాన్న దేవుడితో సమానం అన్నారు మంచు మనోజ్. ఇప్పుడు చూస్తున్న వ్యక్తి మా నాన్న కాదని అన్నారు. "మా నాకు మా నాన్న దేవుడు, ఇది మా నాన్న కాదండి. ఇవాళ ఏదైనా చూస్తున్నారో అది మా నాన్న కాదు. నేను అబద్దాలు ఆడేవాడిని కాదు. ప్రతీదీ సాయంత్రం వివరిస్తాను. నిన్న మా ఇంట్లో కొట్టేటప్పుడు విజయ్ అనే వ్యక్తి మా ఇంట్లోనే ఉన్నాడు. మా నాన్న భజాలపై గన్ పెట్టి కాలుస్తున్నారు. నా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి మా నాన్న బ్రెయిన్ వాష్ చేశారు. అది కూడా నేను తప్పు చేయకపోయినా సరే కార్నర్ చేశారు.