అన్వేషించండి

CM Revanth Reddy: గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం అక్కర్లేదు: సీఎం రేవంత్ రెడ్డి

గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం Madhu Ridge Park Apartment స్థలాన్ని ప్రభుత్వం తీసుకోవడం లేదని, 50 మీటర్ల బఫర్ జోన్లో ఉందని భవిష్యత్తులోనూ వారికి నష్టమేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

Madhu Ridge Park Apartment | హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో అత్యంత వివాదాస్పదమైన మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలంపై అసెంబ్లీ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణానికి మధు రిడ్జ్ పార్క్ అపార్ట్‌మెంట్ స్థలం తీసుకోకపోయినా ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఆ అపార్ట్‌మెంట్ స్థలాన్ని ప్రభుత్వం అడగలేదని ఆయన తేల్చి చెప్పారు. మూసీ బఫర్ జోన్ వల్లే అపార్ట్‌మెంట్ వాసులకు నష్టం వాటిల్లుతుందని, భూమి ఇస్తే కనుక వారికి పరిహారం చెల్లించి ప్రత్యామ్నాయం చూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వానికి చెందిన 98 ఎకరాలు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 100 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని, అది తమకు సరిపోతుందని ఆయన వివరించారు. 2005-06లో అపార్ట్‌మెంట్ వాసులు దాన్ని చిన్న నాలాగా చూపించి పర్మిషన్ తీసుకున్నారు. 2012, 2016లో పరిశీలిస్తే 50 మీటర్లలో బఫర్ జోన్ ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అపార్ట్ మెంట్ సగం వరకు బఫర్ జోన్లో ఉందని క్లారిటీ ఇచ్చారు. 

బఫర్ జోన్ సమస్యపై హెచ్చరిక.. పరిహారం చెల్లింపుపై ప్రకటన
అపార్ట్‌మెంట్ వాసులకు ఉన్న అసలు సమస్య బఫర్ జోన్ మార్పు వల్లేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆ అపార్ట్‌మెంట్ బఫర్ జోన్‌లో ఉండటం వల్ల భవిష్యత్తులో యజమానులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బఫర్ జోన్ నిబంధనల కారణంగా ఆ అపార్ట్‌మెంట్‌ను భవిష్యత్తులో ఎవరూ కొనలేరని, అమ్మలేరని, అది దేనికీ పనికిరాకుండా పోతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఒకవేళ మధు రిడ్జ్ అపార్ట్‌మెంట్ కు సంబంధించిన స్థలాన్ని అభివృద్ధి కోసం ప్రభుత్వానికి ఇస్తే కనుక వారికి నష్ట పరిహారం ఇచ్చి, ప్రత్యామ్నాయం చూపించేందుకు ప్రభుత్వానికి ఏ ఇబ్బంది లేదని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కొనుగోలుదారుల జాగ్రత్త
ప్రస్తుత పరిస్థితుల్లో ఆ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులోనూ ప్రయోజనం ఉండదని, దాని వల్ల కొనుగోలుదారులే నష్టపోతారని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం స్థలం అడుగుతోందన్న ప్రచారాన్ని తోసిపుచ్చుతూ, కేవలం నిబంధనల పరంగా ఉన్న చట్టపరమైన చిక్కుల గురించే తాము ప్రస్తావిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

మా ఇండ్లే మాకు కావాలి.. పరిహారం వద్దు: మధు పార్క్ రిడ్జ్ నివాసితులు 
రంగారెడ్డి జిల్లాలోని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ నివాసితులు ఇటీవల ప్రధాన రహదారి పక్కన శాంతియుత నిరసన దీక్ష చేపట్టారు. తమ ఇళ్లను కూల్చివేయవద్దని, తమకు ఎలాంటి పరిహారం వద్దని చెప్పారు. ఎన్నో ఏళ్ల కష్టార్జితంతో కట్టుకున్న ఇళ్లను కూల్చివేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, కానీ తమ ఇండ్లను కూలగొడితే చూస్తూ కూర్చునేది లేదన్నారు. 

ప్రభుత్వంపై అపార్ట్మెంట్ వాసుల ఆగ్రహం
సీఎం రేవంత్ రెడ్డి తమ ఇళ్లకు జీరో వ్యాల్యూ అని ప్రకటించడంపై మధు రిడ్జ్ అపార్ట్‌మెంట్ నివాసితులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అన్ని అనుమతులు తీసుకుని నిర్మించుకున్న ఇళ్లను ఇప్పుడు బఫర్ జోన్ అని సాకులు చెప్పి పనికిరాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇండ్లను కూల్చేందుకు బుల్డోజర్లు వస్తే వాటి కింద పడుకుంటాం తప్ప కష్టపడి కట్టుకున్న ఇళ్లను వదులుకోం.. అవసరమైతే చావడానికైనా సిద్ధమని ఇటీవల తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Telangana Cabinet Decisions: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget