Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్ - రెండు రోజులపాటు మద్యం దుకాణాలు బంద్
Sri Rama Navami 2022: శ్రీరామనవమి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో రెండు రోజుల పాటు వైన్స్ బంద్ కానున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Liquor Shops to be Closed In Hyderabad: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. హైదరాబాద్ నగరంలో రెండు రోజుల పాటు వైన్స్ బంద్ (Liquor Shops Close In Hyderabad) కానున్నాయి. నేటి ( శనివారం) సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు నగరంలో మద్యం దుకాణాలు బంద్ చేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
శనివారం సాయంత్రం నుంచి..
శ్రీరామ నవమి పండుగ (Sri Rama Navami 2022) సందర్భంగా పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రతి ఏడాది తరహాలోనే శ్రీరామనవమి పండుగ సందర్భంగా మద్యం అమ్మకాలపై నిషేధం విధించినట్లు పోలీసులు తెలిపారు. శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్రలు వంటివి ఉండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడటంలో భాగంగా పోలీస్, ఎక్సైజ్ శాఖ మద్యం దుకాణాలను మూసి వేయాలని నిర్ణయం తీసుకున్నాయి.
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వైన్స్ షాపులు, బార్లు మూసివేయాలని పోలీసులు సూచించారు. అయితే స్టార్ హోటల్స్, రిజిస్టర్ అయిన్ క్లబ్‌లను దీని నుంచి మినహాయింపు కల్పించారు. మిగతా వైన్స్, మద్యం దుకాణాలు మూసివేసిన సమయంలో ఇలాంటి ప్రత్యేకమైన స్టార్ హోటల్స్, క్లబ్‌లో మద్యం విక్రయాలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో పండుగల సమయంలో మద్యం అమ్మకాలపై తాత్కాలికంగా నిషేధం ఉంటుంది. సున్నితమైన ఏరియాలలో, శోభాయాత్రలు జరిగే ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.
శ్రీరామనవమి శోభాయత్రకు భారీ బందోబస్తు
భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించే శోభాయత్రకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. సిద్ధంబర్ బజార్‌లోని బహేతి భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో భాగ్యనగర్ సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్ భగవంత్ రావు, వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం రామరాజు మాట్లాడారు. ఈ ఏడాది శోభాయాత్ర సీతారాంబాగ్ నుంచి ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు కోఠిలోని హనుమాన్ వ్యాయామశాలకు చేరుకుంటుందని చెప్పారు. పది వేల మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన సేవా సమితి సభ్యులు తెలిపారు.
Also Read: Wakefit survey: హైదరాబాద్‌కు నిద్ర కరవు- సోషల్ మీడియాతో అట్లుంటది మరి
Also Read: Khammam News: వీడు మామూలోడు కాదు - లాకప్‌లో పినాయిల్ తాగి, ప్లాన్ ప్రకారం ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్