KTR Help : వాళ్లిద్దరి భవిష్యత్‌కు కేటీఆర్ సాయం ! వాళ్లెవరంటే ?
క్రీడారంగంలో ఒకరు... ఉన్నత విద్యలో మరొకరు ఉజ్వలంగా ఎదుగుతున్నారు.కానీ వారికి ఆర్థిక అడ్డంకులు వచ్చాయి. కేటీఆర్‌కు వారి గురించి తెలిసింది. తర్వాత..
క్రీడారంగంలో దూసుకెళ్తే సాయం కోసం ఎదురు చూస్తున్న ఇద్దరు యువ ఆటగాళ్లకు మంత్రి కేటీఆర్ సాయం అందించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కు చెందిన హ్యాండ్ బాల్ ప్లేయర్ మాధవి కరీనాకు ఆర్థిక సహాయం అందించారు. ఎస్ టి సామాజిక వర్గానికి చెందిన ఆమె ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ లో చదువుకుంటున్నారు. ఆమె తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్నారు. హ్యాండ్ బాల్ ప్లేయర్‌గా ఇప్పటికే ఆమె అనేక రాష్ట్రస్థాయి టోర్నమెంట్ లలో పాల్గొని మెడల్స్ సాధించింది. ఆమెకు ఆసియా యూత్ ఉమెన్ హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్‌లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం అందింది. ఈ నెల 18 నుంచి కజకిస్తాన్ లో జరిగే ఈ పోటీల్లో ఆమె పాల్గొనాల్సి ఉంది.
అయితే వ్యవసాయ కూలీలు అయిన తల్లిదండ్రులకు ఆమెను పోటీలకు పంపించేంత స్థోమత లేదు. ఆమె కజకిస్తాన్ వెళ్లేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న విషయం మంత్రి కే తారకరామారావు దృష్టికి వచ్చింది. ఆమె టోర్నమెంట్లో పాల్గొనేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ప్రగతిభవన్‌కు ఆహ్వానించి.. ఆర్థిక సాయం అందించి ప్రోత్సహించారు. మరింత ప్రతిభ చూపి..స అంతర్జాతీయగా పేరు సంపాదించాలని ఆకాంక్షించారు.,
హైదరాబాద్ అంబర్పేట్ కి చెందిన సంకురు మణిదీప్ 98.6 ఆరు శాతం మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని జేఈఈ అడ్వాన్స్ పరీక్షల్లో మంచి ర్యాంక్ తెచ్చుకుని ఐఐటీ గౌహతి లో బీటెక్ లో సీటు సాధించారు. మణిదీప్ తండ్రి రోజు వారి కూలి, తల్లి గృహిణి కావడంతో అనేక ఇబ్బందులు పడి సుమారు రూ. 35 వేల రూపాయలను తన అడ్మిషన్ కోసం చెల్లించారు. అయితే ఐఐటి లో అకామిడేషన్, మెస్ మరియు ఇతర ఫీజుల కోసం చెల్లించాల్సిన మొత్తానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. వెంటనే మణిదీప్‌కు ఓ ల్యాప్ ట్యాప్.. అ ఫీజులకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించారు.
మంత్రి కేటీఆర్ పెద్ద మనసుతో స్పందించి తమ కలలను సాకారం చేసుకునేందుకు సహాయం అందించడం పట్ల మణిదీప్, మధవిలు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఇరువురుకి కేటీఆర్ వారి భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు తెలిపారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు కేటీఆర్ ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. ఆయన ప్రత్యేకంగా ఓ టీంను ఇందు కోసం ఏర్పాటు చేస్తారు. కేటీఆర్ దృష్టికి వచ్చిన వాటిని ఆ టీంకు రిఫర్చేస్తారు. వారు ఎంక్వైరీ చేసి సాయానికి సిఫారసు చేస్తారు.