అన్వేషించండి

BRS Foundation Day: అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని కెసిఆర్ చూపిస్తున్న బాటలో పునరంకితం అవుదాం- బీఆర్‌ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపు

Telangana News: అంబేద్కర్‌ ఆశయాలతో కేసీఆర్ చూపిన బాటలో పయనించి ప్రజల కోసం కొట్లాడదామంటూ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణలో జరిగిన బీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు.

KTR Comments On BRS: విజయాలకు పొంగిపోయి అపజయాలకు కుంగిపోయే పార్టీ బీఆర్‌ఎస్‌ కాదని... ప్రజల కోసం ఎప్పుడూ కొట్లాడుతూనే ఉంటుందన్నారు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్. బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో కేటీఆర్ జెండా ఎగరేశారు. ఈ సందర్బంగా టీఆర్‌ఎస్‌గా ప్రయాణం ప్రారంభించి బీఆర్‌ఎస్‌గా రూపొంతరం చెందిన పార్టీ సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నారు కేటీఆర్. 

శూన్యం నుంచి 2001లో తెలంగణ రాష్ట్ర సమితిని కేసీఆర్ ప్రారంభించారని అప్పటి నుంచి అనేక ఆటుపోట్లు ఎదుర్కొని స్వరాష్ట్రం సాధించడమే కాదు... రెండుసార్లు అధికారాన్ని కూడా పొందారని వివరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... "2001లో ఉన్న శూన్యం లాంటి వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్టీని కేసీఆర్ ఏర్పాటు చేశారు. ఆరోజు ఉన్న పరిస్థితుల్లో అనేక ప్రతికూలతలు ఉన్న తెలంగాణ కోసం పార్టీని ఏర్పాటు చేశాం.

Image

కెసిఆర్ నడిపిన తెలంగాణ ఉద్యమం దేశంలోని అనేక రాష్ట్రాలకు, ప్రజాస్వామిక ఉద్యమాలకు ఒక దిక్సూచిగా, ఆదర్శంగా నిలిచిందన్నారు కేటీఆర్‌. "తెలంగాణ ప్రజల సహకారంతోనే తెలంగాణ రాష్ట్రం సహకారమైంది. మా పార్టీ తరఫున ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేం. ఆనాడు ఎన్ని రకాల కుట్రలు చేసినా సమైక్యవాద శక్తుల కుట్రలు ఛేదించి... తెలంగాణ ప్రజల గొంతుకను అన్ని చట్టసభల్లో వినిపించింది టిఆర్ఎస్. సాధించుకున్న తెలంగాణకు సరైన నాయకత్వం కేసీఆర్‌దే అని 2014లో మా పార్టీకి అవకాశం ఇచ్చారు. తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలనలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేశాం" అన్నారు. 

తెలంగాణలో సాధించిన ప్రగతిని ఇతర ప్రాంతాలకు విస్తరించాలన్న ఒక సదుద్దేశంతో భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చి జాతీయ పార్టీగా రూపాంతరం చెందిందని గుర్తు చేశారు కేటీఆర్. మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా లాంటి రాష్ట్రాల్లో అద్భుతమైన స్పందన లభించిందని తెలిపారు. "దురదృష్టవశాత్తు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రాలేదు. అయితే కెసిఆర్ తలపెట్టిన ఏ పనినైనా వదలకుండా ముందుకు తీసుకుపోయిన చరిత్ర గత రెండున్నర దశాబ్దాల్లో ప్రజలందరూ చూశారు. బోధించు, సమీకరించి, పోరాడు అనే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని ముందుకు నడుస్తున్న పార్టీ భారత రాష్ట్ర సమితి. అని వివరించారు.

Image

"తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ శ్రేణులు కార్యకర్తలు అందరికీ మాకు అందరికీ మద్దతుగా నిలబడిన తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు. విజయాలకు పొంగిపోము, అపజయాలకు కృంగిపోము ఇదే తీరుగా మా ప్రస్థానం సాగింది. భవిష్యత్తులోనూ ప్రజల కోసం మాట్లాడుతూనే ఉంటాం.. కొట్లాడుతూనే ఉంటాం" అన్నారు కేటీఆర్

తెలంగాణకంటూ ఒక గొంతు ఉండడం అవసరం... తెలంగాణ కంటు ఉన్న ఒక ఇంటి పార్టీ టిఆర్ఎస్... తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అన్న జయశంకర్ సార్ మాటలు ఎప్పటికీ వాస్తవంగా నిలుస్తాయని పేర్కొన్నారు కేటీఆర్.  

"తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పోరాడిన గులాబీ దండుకు ప్రాణాలు అర్పించి, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వందలాది తెలంగాణ అమరవీరులకు పేరుపేరునా ధన్యవాదాలు. తెలంగాణ ప్రజలందరికీ రుణపడి ఉంటాం. కెసిఆర్ చూపిస్తున్న బాటలో మరోసారి పునరంకితం అవుదాం " అని శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024:చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
YS Viveka Case: కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
Shobha Shetty: మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
Modi Speech In peeleru : వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KA Paul with Thati Munjalu | ఓట్లతో కుండలు నింపాలంటున్న కేఏ పాల్ | ABP DesamKTR On Krishank Arrest |క్రిశాంక్ తో ములాఖత్ ఐన కేటీఆర్ | ABP DesamParakala Prabhakar Exclusive Interview | మోదీ సర్కార్ చెప్పే దొంగ లెక్కలు ఇవే..! | ABP DesamVelichala Rajender Rao | Karimnagar | వినోద్ కుమార్, బండి సంజయ్‌లతో ప్రజలు విసిగిపోయారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024:చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
చితగగొట్టేసిన హెడ్, అభిషేక్- హైదరాబాద్ అద్భుత విజయం
YS Viveka Case: కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
Shobha Shetty: మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
మరో ఎంగేజ్‌మెంట్‌ వీడియో షేర్‌ చేసిన శోభా శెట్టి - ఇరు కుటుంబ సభ్యులను పరిచయం చేసిన 'మోనిత'!
Modi Speech In peeleru : వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
వైసీపీకి కౌంట్‌డౌన్ - అన్ని మాఫియాలకూ ట్రీట్‌మెంట్ - పీలేరులో మోదీ హెచ్చరిక
Swathi Reddy: ‘ఛీ.. నీ బ్రతుకు’ అంటూ స్వాతిపై నెటిజన్ నెగిటివ్ కామెంట్ - ఆమె రిప్లై చూస్తే ఫ్యాన్ అయిపోతారు!
‘ఛీ.. నీ బ్రతుకు’ అంటూ స్వాతిపై నెటిజన్ నెగిటివ్ కామెంట్ - ఆమె రిప్లై చూస్తే ఫ్యాన్ అయిపోతారు!
Nagarjuna: మీరు యాక్టర్ అవ్వకపోయుంటే ఏం చేసేవారు? మీకు ఆట ఇష్టం? - మిథాలీ ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇదే
మీరు యాక్టర్ అవ్వకపోయుంటే ఏం చేసేవారు? మీకు ఆట ఇష్టం? - మిథాలీ ప్రశ్నకు నాగార్జున సమాధానం ఇదే
Meenakshi Chaudhary Latest Photos: గుంటూరు మిర్చిలా ఘాటుగా ఉన్న మీనాక్షి !
గుంటూరు మిర్చిలా ఘాటుగా ఉన్న మీనాక్షి !
KTR: కేసీఆర్ మళ్లీ తెలంగాణ రాజకీయాలు శాసిస్తారు, ఎలాగో ఉపాయం చెప్పిన కేటీఆర్
కేసీఆర్ మళ్లీ తెలంగాణ రాజకీయాలు శాసిస్తారు, ఎలాగో ఉపాయం చెప్పిన కేటీఆర్
Embed widget