TSRTC: కిన్నెర మొగులయ్యకు ఎండీ సజ్జనార్ బంపర్ ఆఫర్.. ఎందుకంటే..
మొగులయ్యను బస్ భవన్‌లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బుధవారం సన్మానించారు. ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్సు పాస్‌ను మొగులయ్యకు అందజేశారు.
భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్‌తో తెలుగు వారిని ఆకట్టుకున్న కిన్నెర మొగులయ్యకు తెలంగాణ ఆర్టీసీ మంచి ఆఫర్ ప్రకటించింది. కిన్నెర మొగులయ్య ఈ మధ్య చాలా పేరు సంపాదించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఆర్టీసీపై ఆయన పాడిన పాటతో మొగులయ్య పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. తాజాగా మరోసారి కిన్నెర మొగులయ్య టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను కలిశారు. ఈ సందర్భంగా మొగులయ్యకు వీసీ సజ్జనార్ బంపర్ ఆఫర్ ప్రకటించారు.
కిన్నెర మొగులయ్య కుమార్తె వివాహం ఇటీవలే జరిగింది. ఈ శుభ కార్యానికి మొగులయ్య ఆర్టీసీ బస్సును ప్రత్యేకంగా బుక్ చేసుకున్నారు. ఆ శుభకార్యం అయిపోయాక బస్సు ముందు నిలబడి ఆర్టీసీ సేవలను ప్రశంసిస్తూ తనదైన శైలిలో పాట అందుకున్నారు. అది బస్సు కాదు.. తల్లిలాంటిదని.. శభాష్ సజ్జనార్ సర్.. అంటూ ప్రశంసించారు. ఆ పాట అచ్చం భీమ్లా నాయక్ ట్యూన్‌లోనే ఉండడంతో అందర్నీ ఆకట్టుకుంది. కిన్నెర వాయిద్యం వాయిస్తూ పాడిన ఆ పాటకు సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఆనందకరమని, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని ఈ పాట ద్వారా మొగులయ్య ప్రజలకి సందేశం ఇచ్చారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
ఈ క్రమంలోనే మొగులయ్యను బస్ భవన్‌లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బుధవారం సన్మానించారు. ఆర్టీసీ బస్సుల్లో (కేటగిరీపై పరిమితితో) రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్సు పాస్‌ను మొగులయ్యకు అందజేశారు. భవిష్యత్తులో ఆయన ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ ఆర్టీసీ సేవలను తన పాట ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎండీ సజ్జనార్ ఆకాంక్షించారు.
♦హైదరాబాద్: కిన్నెర వాయిద్య కళాకారుడు మొగులయ్యకు ఆర్టీసీ ఉచిత బస్ పాస్ వసతి కల్పించింది.
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) November 25, 2021
♦ఇటీవల ఆయన ఆర్టీసీ సేవలను ప్రశంసిస్తూ, సమాజంతో ఆ బస్సుకు పెనవేసుకున్న బంధాన్ని వర్ణిస్తూ పాట పాడారు.
♦దానికి మంచి స్పందన రావడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.@tsrtcmdoffice @TSRTCHQ pic.twitter.com/ojgitFVNtk
కూతురు వివాహానికి TSRTC బస్ బుక్ చేసుకున్న కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్య గారి స్వీయ అనుభవం.@tsrtcmdoffice #Hyderabad #TeluguFilmNagar #Tollywood pic.twitter.com/BqvkpwRRxa
— Abhinay Deshpande (@iAbhinayD) November 21, 2021
Also Read: తెగువతో పని చేస్తే తెలంగాణలో మనదే అధికారం.. పార్టీ శ్రేణులకు బండి సంజయ్ సందేశం !
Also Read: Tomato Farmers : ఆ రైతు పంట పండించిన టమాటా .. ఒక్క సీజన్‌లో రూ. 80 లక్షలు !