News
News
X

కేసిఆర్ వేసిన స్కెచ్‌కు ఆ రెండు జాతీయపార్టీలు ఇంతే సంగతులా?

జాతీయ పార్టీ ప్రకటనతో ఇప్పటి వరకూ నార్త్ ఇండియా, హిందీ బెల్ట్ ఓట్ల మీద తెలంగాణ బీజేపీ పెట్టుకున్న ఆశలపై కేసిఆర్ నీళ్లు జల్లినట్లయిందని విశ్లేషకులు చెబుతున్నారు. .

FOLLOW US: 

సమస్య వచ్చినప్పుడల్లా దాన్ని నుంచి బయటపడటానికి తెలంగాణ సిఎం కెసిఆర్‌ ఏదో ఒక విషయాన్ని బయటకు తీస్తారా ? ఇప్పుడలానే జాతీయపార్టీ ప్రకటన వెనక కూడా డ్రామా ఉందా ? అసలు ఏ ధైర్యంతో కెసిఆర్‌ జాతీయరాజకీయాల్లోకి వస్తున్నారు ? జాతీయపార్టీ పెట్టడం ఈజీనే కానీ దాన్ని గుర్తింపు అందుకోవడం ఎంతవరకు సాధ్యం ? ఎలాంటి వ్యూహాలతో కెసిఆర్‌ జాతీయరాజకీయాల్లోకి వెళుతున్నారు ?  ఇప్పుడిదే దేశరాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు భారత్‌ రాష్ట్ర సమితిగా మారుతోంది. ఈసీకి ఇప్పటికే అందుకు సంబంధించిన పత్రాలను కూడా ఆ పార్టీ నేతలు అందజేశారు. కానీ అసలు ఏ ధైర్యంతో కెసిఆర్‌ జాతీయరాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. రాష్ట్ర రాజకీయాలంటే ఇక్కడే పుట్టి పెరిగారు కాబట్టి తెలుసు. కానీ దేశ రాజకీయాలంటే అంత ఆషామాషీ కాదు. ఈ విషయం కెసిఆర్‌ కి తెలియంది కాదు. కానీ ఏ నమ్మకం..ఈ గులాబీనేత ఏ ధైర్యంతో రాష్ట్ర పార్టీని జాతీయపార్టీగా మార్చుతున్నారు అన్నదే సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.

జాతీయపార్టీ హోదా పొందాలంటే …

1. పార్లమెంట్ లేదా అసెంబ్లీ స్థానాల్లో నాలుగు, అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో అభ్యర్థులు పోటీ చేయాలి. ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించాలి. దీనితోపాటు ఏదైనా ఒక రాష్ట్రం లేదా రాష్ట్రాల నుంచి కనీసం నలుగురు అభ్యర్థులు ఎంపీలుగా ఎన్నికవ్వాలి.

News Reels

2. కనీసం నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి.

3. గత సాధారణ ఎన్నికల్లో లోక్‌ సభలోని మొత్తం సీట్లలో కనీసం రెండు శాతం సీట్లను గెలుచుకొని ఉండాలి. గెలుపొందిన అభ్యర్థులు మూడు రాష్ట్రాల నుంచి ఎన్నికవ్వాలి.  

ఈ అర్హతలు తప్పనిసరిగా ఉండాల్సిందే ! ప్రస్తుతం తెలంగాణలో టీఆర్‌ ఎస్‌ అధికారంలో ఉంది. వరసగా రెండు సార్లు ఆపార్టీ అధికారాన్ని అందుకుంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ  తరుణంలో కెసిఆర్‌ జాతీయపార్టీని ప్రకటించడంతో రాజకీయవర్గాల్లో ఒక్కసారిగా తుపాను వచ్చినట్లైంది.

ఏ ధైర్యంతో కెసిఆర్‌ జాతీయరాజకీయాల్లోకి వచ్చారన్న దానిపై రాజకీయవిశ్లేషకులు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకి సరిహద్దు అయిన మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలపైనే కెసిఆర్‌ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే సరిహద్దు జిల్లాల ప్రజల నుంచి బీఆర్‌ ఎస్‌ కి మద్దతు ఉంది. అంతేకాదు ఆ ప్రభుత్వాలు పట్టించుకోని సరిహద్దు ప్రాంత ప్రజలను బీఆర్‌ ఎస్‌ కొంత మేర ఆదుకుంటోంది కూడా. అంతేకాదు ఇక్కడ ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. అయితే నిన్నటివరకు అక్కడ అధికారంలో ఉన్న మాజీ సిఎం ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ బీజేపీని ఎదుర్కోవడానికి ప్రత్నామ్నాయాలు చూస్తున్నారు. ఇప్పుడు కెసిఆర్‌ వారికి తోడైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు చీల్చే అవకాశం ఉంటుంది. తద్వారా ఇరువర్గాలకు మేలు జరుగుతుందన్న ప్లాన్‌ లో ఉన్నారు.

ఇక కర్నాటకలోనూ బీజేపీనే ఉంది. ఆ పార్టీని ఎదుర్కోనే దమ్ము అక్కడున్న ప్రాంతీయపార్టీలకు లేదు. కాంగ్రెస్‌ పార్టీ ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేము కాబట్టి కెసిఆర్‌ ఈ రాష్ట్రంపై కూడా ఆశలు బాగానే పెట్టుకున్నారు.

తెలంగాణలో ఎక్కువగా బిహార్‌, ఒడిషా రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఉన్నారు. కార్మికరంగంలో ఎక్కువగా వీరే పనిచేస్తుంటారు. ఈ మధ్యనే ఓ అగ్నిప్రమాదంలో చనిపోయిన బిహార్‌ కి చెందిన మృతుల కుటుంబాలకు కెసిఆర్‌ ఎక్స్‌ గ్రేషియా ప్రకటించారు కూడా. తెలంగాణలో ఎలాంటి పథకాలు అమలవుతున్నాయో ఇక్కడి బిహారీలకు తెలుసు కాబట్టి  వీరి ద్వారా ఆ రాష్ట్ర ప్రజలను కూడా తనవైపు తిప్పుకోవచ్చన్నది కెసిఆర్‌ ఆలోచనట.

ఇక్కడ నేతలు తెలంగాణలో వారికి పరిహారం ఇవ్వకుండా మిగిలిన రాష్ట్రాల వారికి ఎందుకు ఇస్తున్నారో ఇప్పుడు అర్థం అయ్యి ఉంటుంది. గులాబీ దళపతి స్కెచ్ లేట్ అయినా లేటెస్ట్ గా అర్థం అయిందంటున్నారు ఆ పార్టీ నేతలు. 

ఇక గుజరాతీ, మర్వాడీలు కూడా హైదరాబాద్‌ లో చాలామందే ఉన్నారు. ఇలా తెలంగాణలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఎక్కువ మంది నివసిస్తుండటంతో ఏ వర్గ ప్రజలను ఎలా ఆకట్టుకుంటే ఓట్లు పడతాయో కెసిఆర్‌ కి తెలుసు కాబట్టే జాతీయ రాజకీయాల్లోకి దిగుతున్నారని చెబుతున్నారు ఆయన అభిమానులు.

దేశంలోని పలు రాష్ట్రాల్లో చిన్నా చితకా పార్టీలు బీఆర్ఎస్ లో విలీనానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసిఆర్ వారితో టచ్ లో ఉన్నారు. తమిళనాడు సిట్టింగ్ ఎంపీకూడా తన పార్టీని బీఆర్ఎస్ లో విలీనం చేస్తారని టాక్ వినిపిస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న పలు సంఘాలు కూడా కేసిఆర్ తో కలిసి నడవడానికి సిద్ధం అవుతున్నట్లు గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. 

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ వీక్‌గా ఉన్న జిల్లాలపై ఎలా బీజేపీ ఫోకస్‌ చేస్తోందో అలాగే కెసిఆర్‌ కూడా ఏ ఏ రాష్ట్రాల్లో కాషాయంకి పట్టులేదో , స్థానిక ప్రాంతీయ పార్టీలకు బలమైన ఆర్ధిక వ్యవస్థ లేదో అక్కడ కెసిఆర్‌ మాయాజాలం చూపించబోతున్నారట. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల లిస్ట్‌ కెసిఆర్‌ చేతిలో ఉందని చెబుతున్నారు.

వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసమే కెసిఆర్‌ ఈ జాతీయపార్టీని తెర మీదకి తెచ్చినా రానున్న రోజుల్లో ప్రత్నామ్నాయ రాజకీయపార్టీ కోసం చూస్తోన్న ప్రజలకు భారత్‌ రాష్ట్ర సమితి ఓ వెలుగుగా కనిపించే అవకాశాలు లేకపోలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. 

కెసిఆర్‌ ఎలా రెండు సార్లు తెలంగాణ సిఎం అయ్యారో మోదీ కూడా రెండు సార్లు పీఎం అయ్యారు. అంతేకాదు బీజేపీ విధానాలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా దేశాన్ని నడిపించగల మరో జాతీయపార్టీ, దమ్మున్న నేత లేకపోవడంతో కాషాయానికే పట్టం కడుతున్నారన్న వాదనలూ లేకపోలేదు. ఇలాంటి తరుణంలో కెసిఆర్‌ జాతీయపార్టీ ఏ మేర సత్ఫలితాలను ఇస్తుందో తెలుసుకోవాలంటే 2024 వరకు ఆగాల్సిందే. 

Published at : 06 Oct 2022 11:31 PM (IST) Tags: BJP karnataka BRS KCR Maharashtra

సంబంధిత కథనాలు

తెలంగాణకు కేంద్రం నోటీసులు- రెండు రోజుల్లో 152 కోట్లు తిరిగి ఇవ్వాలని హెచ్చరిక

తెలంగాణకు కేంద్రం నోటీసులు- రెండు రోజుల్లో 152 కోట్లు తిరిగి ఇవ్వాలని హెచ్చరిక

 TS News Developments Today: బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం అవుతుందా? ఇవాల్టి తెలంగాణ టాప్‌ న్యూస్ డెవలప్‌మెంట్స్ ఇవే

 TS News Developments Today: బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం అవుతుందా? ఇవాల్టి తెలంగాణ టాప్‌ న్యూస్ డెవలప్‌మెంట్స్ ఇవే

Petrol-Diesel Price, 28 November 2022: ఈ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుముఖం- మిగతా చోట్లో స్థిరంగా ధరలు

Petrol-Diesel Price, 28 November 2022: ఈ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుముఖం- మిగతా చోట్లో స్థిరంగా ధరలు

Gold Silver Rate Today: బంగారం కొనాలనుకుంటున్నారా? నేడు ఎంత ధర పెరిగిందో తెలుసా!

Gold Silver Rate Today: బంగారం కొనాలనుకుంటున్నారా? నేడు ఎంత ధర పెరిగిందో తెలుసా!

CM KCR : రెండు నెలల్లో వస్తా, అందమైన నిజామాబాద్ ను తీర్చిదిద్దాలె - సీఎం కేసీఆర్

CM KCR :  రెండు నెలల్లో వస్తా,  అందమైన నిజామాబాద్ ను తీర్చిదిద్దాలె - సీఎం కేసీఆర్

టాప్ స్టోరీస్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం: సీఎం కేసీఆర్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం:  సీఎం కేసీఆర్

మంత్రి అప్పలరాజుకు అసమ్మతి సెగ, అతడిని ఓడించాలంటూ వైసీపీ నేతల ప్రచారాలు!

మంత్రి అప్పలరాజుకు అసమ్మతి సెగ, అతడిని ఓడించాలంటూ వైసీపీ నేతల ప్రచారాలు!

Bandi Sanjay : పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Bandi Sanjay :  పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Weather Latest Update: ‘ఆ ఫేక్ తుపానును నమ్మొద్దు’ -ఏపీకి స్వల్ప వర్ష సూచన! తెలంగాణలో 4 జిల్లాలకి చలి అలర్ట్

Weather Latest Update: ‘ఆ ఫేక్ తుపానును నమ్మొద్దు’ -ఏపీకి స్వల్ప వర్ష సూచన! తెలంగాణలో 4 జిల్లాలకి చలి అలర్ట్