KCR-Jagan Meet: నేరుగా కలుసుకున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు.. పక్కపక్కనే కూర్చొని కేసీఆర్-జగన్ ముచ్చట్లు
తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలు స్నిగ్ధా రెడ్డి వివాహం.. ఓఎస్‌డీ కృష్ణ మోహన్ రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డితో వీఎన్‌ఆర్ ఫామ్స్‌లో ఆదివారం ఘనంగా జరిగింది.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ కలుసుకున్నారు. తెలంగాణ శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలి పెళ్లి వేడుక ఇందుకు వేదికైంది. ఈ శుభకార్యానికి ఒకే సమయంలో హాజరైన సీఎంలు పక్కపక్కనే కూర్చుకున్నారు. పెళ్లిలో కాసేపు మాట్లాడుకున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు నెలకొన్న వేళ నేతల మధ్య పరస్ఫర ఆరోపణలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరూ కలుసుకొని మాట్లాడుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
విజయమ్మ కూడా హాజరు
తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలు స్నిగ్ధా రెడ్డి వివాహం.. ఓఎస్‌డీ కృష్ణ మోహన్ రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డితో వీఎన్‌ఆర్ ఫామ్స్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఒకరినొకరు పలకరించుకున్న ఇరు రాష్ట్రాల సీఎంలు ఒకే వేదిక మీద.. పక్కపక్కన కూర్చుని కాసేపు ముచ్చటించుకున్నారు. అనంతరం వేదిక మీదకు వెళ్లి వధువరూలను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకకు వైఎస్ విజయమ్మతో పాటు ఇరు రాష్ట్రాల నుంచి పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అలానే ఏపీ స్పీకర్ తమ్మినేని కూడా హాజరయ్యారు.
Several days later, the CMs of the Telugu states appeared on the same stage. On Sunday, the CMs of both the states attended the wedding of Pocharam Srinivas Reddy's granddaughter. #BREAKING #YsJagan #CMKCR #CMJagan pic.twitter.com/UUHhNeGDUK
— Medi Samrat (@Medi2Samrat) November 21, 2021
మరోవైపు, ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు, అధికారుల బృందం సైతం కూడా ఢిల్లీకి పయనం కానుంది. పర్యటనలో ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంతో సంప్రదించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఒక బృందం, సీఎస్ సోమేశ్ కుమార్ అధ్యక్షతన అధికారుల మరో బృందాలు ఢిల్లీకి పయనం కానున్నాయి. కేంద్ర మంత్రితో పాటు సంబంధిత అధికారులు, ఎఫ్‌సీఐని ధాన్యం యాసంగి కొనుగోళ్లకు సంబంధించిన విషయాలపై స్పష్టత కోసం కలవనున్నారు. వీలైతే ప్రధాని నరేంద్ర మోదీని కూడా సీఎం కేసీఆర్ కూడా కలిసే అవకాశం ఉంది.
Also Read: Nalgonda Mystery: గదిలో నుంచి పాడు వాసన.. తలుపులు తెరిచి చూసి ఇంటి ఓనర్ షాక్!
Also Read: Nellore Floods: నెల్లూరు వద్ద NH-16 కు గండి, తెగిపోయిన నేషనల్ హైవే.. కి.మీ. మేర నిలిచిన వాహనాలు
Also Read: Telangana Govt: ఈ థియేటర్లలో సినిమాకి వెళ్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్!