(Source: ECI/ABP News/ABP Majha)
Telangana Govt: ఈ థియేటర్లలో సినిమాకి వెళ్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్!
కరోనా కారణంగా థియేటర్లకు ప్రేక్షకులు రావడం బాగా తగ్గిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై పలు థియేటర్ల యజమానులు ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.
సినిమా ప్రియులకు ఇది కాస్త చేదు వార్త. ముఖ్యంగా సింగిల్ స్ర్కీన్ థియేటర్లకు తరచూ వెళ్తుండే వారికి బ్యాడ్ న్యూస్. ఎందుకంటే.. గతంలో నిలిపివేసిన పార్కింగ్ ఫీజును మళ్లీ వసూలు చేయనున్నారు. తాజాగా సింగిల్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేసుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు థియేటర్లలో పార్కింగ్ ఫీజుల వసూలుపై తెలంగాణ ప్రభుత్వం కొత్త జీవో 63ను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం.. సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఆవరణలో నిలిపి ఉంచే వెహికిల్స్‌కు పార్కింగ్ ఫీజులు ఆయా వాహనాన్ని బట్టి వసూలు చేసుకోవచ్చని జీవోలో స్పష్టంగా తెలిపింది. వాణిజ్య సముదాయాల్లోని మల్టీప్లెక్స్ థియేటర్లలో మాత్రం యథాతథంగా ఉచిత పార్కింగ్ కొనసాగుతుందని వివరించింది.
కరోనా కారణంగా థియేటర్లకు ప్రేక్షకులు రావడం బాగా తగ్గిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై పలు థియేటర్ల యజమానులు ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. వారి వినతులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం నిబంధనలు సవరించి కొత్త జీవో జారీ చేసింది.
Also Read: Weather Updates: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. వచ్చే మూడు రోజులు ఈ ప్రాంతాల్లో మళ్లీ వానలే..
సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమాన్యాలు చెబుతున్న ప్రకారం.. థియేటర్లలోని పార్కింగ్ ప్రదేశాల్లో సినిమాకు వచ్చిన వారే కాకుండా ఇతర పనుల కోసం వచ్చిన వారు కూడా వాహనాలను పార్కింగ్ చేస్తున్నారని అంటున్నాయి. దీంతో వాహనాల పార్కింగ్, భద్రత విషయం సవాలుగా మారిందని ప్రభుత్వానికి వివరించాయి. వీరి విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం పార్కింగ్ ఫీజు వసూలు చేసుకునేందుకు అమతించింది. ఈ విషయమై పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఇది కేవలం సింగిల్ స్ర్కీన్ థియేటర్లకు మాత్రమే వర్తిస్తుందని.. మల్టీప్లెక్సులు, షాపింగ్ మాల్స్ విషయంలో ‘నో పార్కింగ్ ఫీజు’ నిబంధన యథావిధిగా కొనసాగుతుందని జీవోలో స్పష్టంగా వివరించారు.
Also Read: గుడ్ న్యూస్! రూ.250 తగ్గిన బంగారం ధర.. వెండి తగ్గుదల.. నేటి తాజా ధరలు ఇవీ..
Also Read: Nellore Floods: నెల్లూరు వద్ద NH-16 కు గండి, తెగిపోయిన నేషనల్ హైవే.. కి.మీ. మేర నిలిచిన వాహనాలు
Also Read: ప్రాణాలు కాపాడేందుకు వచ్చి.. విగత జీవిగా మారిన ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్