Nalgonda Mystery: గదిలో నుంచి పాడు వాసన.. తలుపులు తెరిచి చూసి ఇంటి ఓనర్ షాక్!
ఈ మహిళ ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హత్య చేశారా? అనేది తేల్చేందుకు మృతురాలి ఫోన్ కాల్స్ డేటా కోసం ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
నల్గొండ జిల్లాలో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. నల్గొండ పట్టణంలోని అశోక్‌నగర్‌లో శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన 45 ఏళ్ల మహిళ మహిళది హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం సంఘటనా స్థలంలో ఆధార్ కార్డు లభించినట్లుగా పోలీసులు వెల్లడించారు. అందులో పేరు జి.రాజ్యలక్ష్మి అని, భర్త జగదీశ్వర్‌రావు, బంజారాహిల్స్, భువనగిరి అని ఉన్నట్లు నల్గొండ టూ టౌన్ పోలీసులు వెల్లడించారు.
ఈ మహిళ ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హత్య చేశారా? అనేది తేల్చేందుకు మృతురాలి ఫోన్ కాల్స్ డేటా కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. మృతురాలి ఫొటోను సైతం కూడా విడుదల చేశారు. అయితే, వఈమె తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందిన కాంతారావుతో ఆమె కొద్ది కాలంగా సహ జీవనం చేస్తున్నట్లు పోలీసుల విచాణలో తేలింది. 40 రోజుల క్రితం.. కాంతారావు, ప్రస్తుతం చనిపోయిన మహిళతో కలిసి అశోక్ నగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు దిగారు. భార్యాభర్తలమని చెప్పి తమ వివరాలను స్థానికులకు తెలియకుండా గోప్యంగా ఉంచారు. కాగా ఈ నెల 15వ తేదీన ఇంటికి కాంతారావు తాళం వేసి ఎక్కడికో వెళ్లిపోయాడు.
Also Read: Nellore Floods: నెల్లూరు వద్ద NH-16 కు గండి, తెగిపోయిన నేషనల్ హైవే.. కి.మీ. మేర నిలిచిన వాహనాలు
సరిగ్గా మూడు రోజుల తర్వాత వారు ఉంటున్న రూం నుంచి దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు ఇంటి లోపలికి వెళ్లి చూడగా మహిళ మృదేహం కుళ్లిపోయిన స్థితిలో మంచంపైన పడి ఉంది. ఇంటి యజమాని రామచంద్రయ్య ఇచ్చిన వివరాలతో కాంతారావు నంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వస్తుందని పోలీసులు తెలిపారు. మహిళ మృతి చెందిన సమాచారం టీవీల్లో, పేపర్‌లో చూసిన కాంతారావు సైతం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు తెలిసింది. మృతురాలి ప్రాథమిక ఆధారాలు గుర్తించామని మిగతా వివరాలు ఆమె కుటుంబ సభ్యుల ఆచూకీ తెలిస్తే తెలిసే అవకాశం ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
Also Read: Telangana Govt: ఈ థియేటర్లలో సినిమాకి వెళ్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్!
Also Read: ప్రాణాలు కాపాడేందుకు వచ్చి.. విగత జీవిగా మారిన ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్
Also Read: గుడ్ న్యూస్! రూ.250 తగ్గిన బంగారం ధర.. వెండి తగ్గుదల.. నేటి తాజా ధరలు ఇవీ..