అన్వేషించండి

Kavitha:KTR టార్గెట్‌గా కవిత సంచలన వ్యాఖ్యలు! బీఆర్ఎస్ లో సంక్షోభం!

Kavitha: తనపై కుట్రలు జరుగుతున్నాయని కవిత చెప్పడం ఆ గులాబీ పార్టీలో పాతుకుపోయిన విభేదాలు, నాయకత్వ సంక్షోభాన్ని చూపించేలా ఉన్నాయి. ఈ పరిణామాలు ఎక్కడికైనా దారి తీసేలా కనిపిస్తున్నాయి.

Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో చిట్‌చాట్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణవ్యాప్తంగా సంచలం సృష్టిస్తున్నాయి. పార్టీలోని అంతర్గత సమస్యలను మీడియాతో పంచుకోవడంతో, ఆ పార్టీలో అంతర్గత సంక్షోభం నెలకొన్నట్లు అర్థం అవుతోంది. తనపై కుట్రలు జరుగుతున్నాయని  చెప్పడం ఆ గులాబీ పార్టీలో పాతుకుపోయిన విభేదాలు, నాయకత్వ సంక్షోభాన్ని చూపించేలా ఉన్నాయి.

కమలంలో, గులాబీని కలపేసే కుట్ర

తనపై కుట్రలు జరుగుతున్నాయంటూ మాట్లాడిన కవిత పార్టీపై జరుగుతున్న మరో కుట్రను బహిర్గతం చేశారు. బీఆర్ఎస్ ని బీజేపీలో కలిపేందుకు కొందరు పార్టీ అగ్రనేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కుట్ర తాను జైలుకు వెళ్లినప్పటి నుంచి మొదలైందని వివరించారు. జైలుకు వెళ్లేటప్పుడు పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పినా తన మాట వినలేదని వాపోయారు. అయితే ఇక రానున్న రోజుల్లో పార్టీ మనుగడ కష్టం అన్న రీతిలో ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు గులాబీ పార్టీ కార్యకర్తలు, నేతలను షాక్‌కు గురి చేస్తున్నాయి. అంతే కాకుండా తాను ఈ కుట్రలకు అడ్డుపడుతున్నందుకే తనను బయటకు పంపే కుట్రలు చేస్తున్నారన్నట్లుగా కవిత వ్యాఖ్యలు ఉన్నాయి.

లీకులతో కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తారా?

కేసీఆర్‌కు తాను రాసిన లేఖను ఎవరు బయటపెట్టారో వెలికి తీయమంటే తనపై దుష్ప్రచారానికి దిగారని ఆగ్రం వ్యక్తం చేశారు కవిత. లీకు వీరులు పట్టుకోమంటే, గ్రీకు వీరులు తనపై దండెత్తుతున్నారని ఎద్దేవా చేశారు. కవిత చేసిన ఈ వ్యాఖ్యలు నాయకత్వ స్థానంలో ఉన్న కొందరు నేతలు తనను పార్టీలో బలిపశువును చేసేందుకు కుట్రలు చేస్తున్నారన్న చర్చకు దారి తీస్తోంది. తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వచ్చిన తప్పుడు వార్తలను ఎందుకు పార్టీ ఖండించడం లేదని ప్రశ్నించారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు తనను పార్టీలో ఒంటరి చేస్తున్నారన్న భావన వ్యక్తం చేసేలా ఉంది. సోషల్ మీడియాలో తనను టార్గెట్ చేస్తున్నారన్న కవిత తన జోలికి వస్తే సహించనని హెచ్చరికలు చేశారు. ఈ మాటలు టీం కేటీఆర్ పేరుతో సోషల్ మీడియాలో చేస్తోన్న ప్రచారంపైనే అన్నది మాత్రం స్పష్టంగా అర్థం అవుతోంది.

కేసీఆర్ నాయకత్వం తప్ప మరెవరని అంగీకరించేది లేదు

పార్టీలో అందరూ సమానమే అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా కవిత బీఆర్ఎస్‌లో కేసీఆర్ ఒక్కరే నాయకుడని స్పష్టంగా మీడియా ముందు చెప్పినట్లు అర్థం చేసుకోవచ్చు. పార్టీలో నెంబర్ వన్ కేసీఆర్, నెంబర్ టూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే తాను కేసీఆర్ నాయకత్వం తప్ప వర్కింగ్ ప్రెసిడెంట్ నాయకత్వాన్ని అంగీకరించేది లేదన్న సంకేతాలు ఈ వ్యాఖ్యల ద్వారా పార్టీ అధినేతకు పంపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే పార్టీ అధ్యక్షుడైన కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కేటీఆర్‌కు కట్టబెట్టారు. అయితే తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలు పార్టీలో నెంబర్ టూగా ఉంటున్న కేటీఆర్‌ను ఉద్దేశించినవే అన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. ఇది ఓ రకంగా కేసీఆర్ నిర్ణయాన్ని తప్పుబట్టినట్లేనన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి.  ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీలో కేటీఆర్ స్థానాన్ని, ఆయన నాయకత్వాన్ని అంగీకరించేది లేదన్న స్పష్టతను కల్వకుంట్ల కవిత ఈ మీడియా చిట్ చాట్ ద్వారా ఇచ్చినట్లైంది.

కేసీఆర్‌ను నడిపే కోటరీపైన నిప్పులు

కేసీఆర్‌ను తామే నడిపిస్తున్నామని చెప్పుకునే వారిని కవిత వదిలిపెట్టలేదు. కేసీఆర్‌కు నోటీసులు వస్తే సైలంట్‌గా ఉన్న గులాబీ నేతలు, మరో నేతకు అంటూ కేటీఆర్ ప్రస్తావన తెచ్చారు. కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇస్తే మాత్రం ఎందుకు హంగామా ఎందుకు చేశారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యల ద్వారా కేసీఆర్‌ను మించిపోయినట్లు సదరు నేతల ప్రవర్తన ఉందని చెబుతూనే ఈ విషయంలో కేసీఆర్ మౌనాన్ని కూడా ప్రశ్నించినట్లు ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. కోవర్టులు ఉన్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఉదాహరిస్తూ ఆ కోవర్టులను ఎందుకు పార్టీ పక్కకు పెట్టడం లేదని కౌంటర్ క్వశ్చన్ వేశారు. ఈ వ్యాఖ్యలు పార్టీలో మరింత సంచలనంగా మారాయి. కేసీఆర్ తాను సైలంట్‌గా ఉండిపోయి, కవిత విమర్శిస్తున్న నేతల చేతుల్లో పార్టీ మొత్తాన్ని పెట్టారా అన్న చర్చ గులాబీ పార్టీలో సాగుతోంది.

కేసీఆర్‌తో దూరం పెంచుతున్నారు

"కాంగ్రెస్‌ పార్టీ ఓ మునిగిపోయే నావ" అని కవిత వ్యాఖ్యానించారు. "కాంగ్రెస్‌తో రాయబారాలు జరిపే అవసరం నాకు లేదు" అని ఆమె తేల్చిచెప్పారు. తనపై, కేసీఆర్‌ మధ్య దూరం పెంచే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. "నన్ను దూరం చేస్తే ఎవరికి లాభమో అందరికీ తెలుసు" అని అన్నారు. ఈ వ్యాఖ్యలు, తనపై జరుగుతున్న కుట్ర పార్టీలోని అత్యంత సన్నిహితుల లేదా ఇంట్లోని వారితోనే మొదలైనట్లు ఆమె మాటల ద్వారా స్పష్టం అవుతోంది. ఆమె కుటుంబ సభ్యులే తన రాజకీయ భవిష్యత్తుకు అడ్డుపడుతున్నారనే అభిప్రాయం ఆమె మాటల్లో కనిపిస్తోంది. కావాలనే తనను ఎంపీ ఎన్నికల్లో ఓడించారని కూడా ఆమె ఆరోపించడం గమనార్హం. ఇది కుటుంబంలోనే తనకు వ్యతిరేకంగా చక్రం తిప్పినట్లు ఆమె భావిస్తున్నారని తెలియజేస్తుంది. పార్టీలో తన స్థాయి, ప్రాధాన్యత తగ్గించడానికి అంతర్గతంగానే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె పరోక్షంగా ఆక్షేపించారు.

బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం తెలంగాణ జాగృతి అవుతుందా?

బీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన పనులు తాను తెలంగాణ జాగృతి తరపున చేస్తున్నానని కవిత మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. "జాగృతి పని చేస్తోంది, బీఆర్ఎస్ ఏం చేయడం లేదు" అని మీడియాతో ఆమె చేసిన వ్యాఖ్యలు చాలా కీలకమైనవిగా చెప్పాలి. పార్టీ తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైందని, ఆ లోటును జాగృతి భర్తీ చేస్తోందని ఆమె చెప్పకనే చెబుతున్నారు. ఇది బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా తెలంగాణ జాగృతిని నిలబెట్టాలనే కవిత ఆలోచనను స్పష్టం చేస్తోందా అన్న ప్రశ్నను సర్వత్రా రేకెత్తిస్తోంది. ఇదే కాకుండా పార్టీలో తన ప్రాధాన్యతను పెంచుకోవడమే కాకుండా, ఒక వేళ తనను పక్కన పెడితే తనకు ప్రత్యామ్నాయ వేదిక ఉందని చెప్పే ప్రయత్నంగా కూడా అర్థం చేసుకోవచ్చు. మరో కోణంలో చూస్తే పార్టీలో తాను చేయాల్సన పనులు చేయనీనందుకే , జాగృతి ద్వారా పని చేస్తున్నానని చెబుతోందా అన్న ప్రశ్నలు తలెత్తేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి.అంటే పార్టీలోతనను జీరో చేసే కుట్ర జరుగుతుందని చెబుతోందని అర్థం చేసుకోవచ్చు.

తాను కాంగ్రెస్ పార్టీతో ఆరుగురు ఎమ్మెల్యేలను తీసుకొని వెళ్తానని పత్రికల్లో వచ్చిన వార్తలను ఖండించడమే కాకుండా పార్టీలో జరుగుతున్న పరిణాలను కవిత  తన చిట్ చాట్ ద్వారా బహిర్గతం చేశారు. తనను టార్గెట్ చేస్తోంది కుటుంబ సభ్యులే అని అది కేటీఆరే అని స్పష్టత ఇచ్చేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి. అయితే ఈ పరిణామాలు చివరకు ఎలా దారి తీస్తాయో మాత్రం వేచి చూడాల్సిందే.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!

వీడియోలు

రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్
Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
New Kia Seltos: అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
Dhandoraa OTT : ఆ ఓటీటీలోకి శివాజీ 'దండోరా' - ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఆ ఓటీటీలోకి శివాజీ 'దండోరా' - ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Unbreakable Cricket Records : క్రికెట్ చరిత్రలో ఈ 11 రికార్డులు బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం! ఆ జాబితా ఇక్కడ చూడండి!
క్రికెట్ చరిత్రలో ఈ 11 రికార్డులు బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం! ఆ జాబితా ఇక్కడ చూడండి!
Embed widget