అన్వేషించండి

కేటీఆర్ ఆ మాట అనడం ముమ్మాటికీ కరెక్ట్, వాళ్లకి అంత ఉలికి పాటు దేనికి - కడియం శ్రీహరి

టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో కడియం శ్రీహరి, ఎంపీ లింగయ్య యాదవ్, ప్రభుత్వ విప్ ఎం. ఎస్. ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీ వి. జి. గంగాధర్ గౌడ్, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశంతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.

కేంద్రంలో బీజేపీ పాలనకు ఎనిమిదేళ్లు పూర్తి అయిందని, ఈ ఎనిమిదేళ్లలో ఏ ఒక్క రంగం అభివృద్ధి చెందలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన ఎంపీ లింగయ్య యాదవ్, ప్రభుత్వ విప్ ఎం. ఎస్. ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీ వి. జి. గంగాధర్ గౌడ్, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశంతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎనిమిది ఏళ్లలో డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ నానాటికి పతనమైందని, మోదీ ప్రధాని అయినపుడు డాలర్ విలువ 58 రూపాయలుగా ఉండేదని అన్నారు. ఇపుడు డాలర్ 82 రూపాయలకు చేరిందని విమర్శించారు.

ద్రవ్యోల్భణం పెరిగిపోతోంది.. ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతోంది. 2014 లో ఆర్ధిక వృద్ధి రేటు 7 శాతం ఉంటే ఇప్పుడది 5 శాతానికి దిగజారింది. బీజేపీ నేతలు ఒప్పుకోకున్నా ఇవి నిజాలు. గ్లోబల్ హాంగర్ ఇండెక్స్ లో భారత్ స్థాయి 121 దేశాల్లో 107 స్థానంగా ఉంది. 2014 లో హంగర్ ఇండెక్స్ లో 55 వ స్థానంలో ఉన్నాం. ఆసియా దేశాల్లో, పొరుగున ఉన్న దేశాలతో పోలిస్తే హంగర్ ఇండెక్స్ లో భారత్ స్థానం దిగజారి పోయింది. హ్యాపీనెస్ ఇండెక్స్ లో 136వ స్థానంలో ఉన్నాం. 2014లో 117 వ స్థానంలో ఉన్నాం. అసమానతలు తగ్గించే ఇండెక్స్ లో 123 వ స్థానంలో ఉన్నాం. మానవ అభివృద్ధి ఇండెక్స్ లో 133 వ స్థానంలో ఉన్నాం. అన్నింటిలో మోదీ పాలన భారత్ స్థాయిని దిగజార్చింది.

మోదీ పాలనలో నిరుద్యోగం పెరిగింది. ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం అయ్యాయి. ఉద్యోగాల భర్తీ తగ్గింది. రుణ ఎగవేత దారులకు 12 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ డాలర్ బలపడుతోంది కనుక రూపాయి విలువ పడిపోతోంది అంటున్నారు. రూపాయి విలువ పడిపోతోంది కనుకే డాలర్ విలువ పెరుగుతోంది అని మేమంటున్నాం.. తేడా ఏముంది? చమురు ధరలు పెరిగాయని చెప్పి అధికారంలోకి వచ్చి మోదీ వాటిని తగ్గించారా? దేశంలో పరిస్థితులు దిగజారి పోతుంటే బీజేపీ నేతలు అహో మోదీ ఓహో మోదీ అని జబ్బలు చరచు కుంటున్నారు. అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను దిగజార్చారు.

తెలంగాణపై బీజేపీ కక్ష కట్టింది. తెలంగాణకు చట్టబద్ధంగా రావాల్సిన నిధులు కూడా బీజేపీ ప్రభుత్వం ఇవ్వడం లేదు. తెలంగాణ బీజేపీ నేతలు చవటలు దద్దమ్మలుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ బీజేపీ నేతలకు బాధ్యత లేదా? బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అంటారా? తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే బండి సంజయ్ ఏం చేస్తున్నారు? బీజేపీకి బడుగు బలహీన వర్గాలంటే బీజేపీకి గిట్టదు. పేదవర్గాలకు అన్యాయం చేసేందుకే బీజేపీ రిజర్వేషన్లు, సబ్సిడీలు ఎత్తివేసే కుట్ర చేస్తోంది. ప్రశ్నించే వాళ్ళను అర్బన్ నక్సల్స్ గా ముద్ర వేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలపై ఈడీ, సీబీఐలను వాడుకుని బీజేపీ వేధిస్తోంది’’

‘‘బీజేపీ అధికార దాహం, రాజగోపాల్ రెడ్డి అహంకారం మునుగోడు ఉపఎన్నికకు కారణమయ్యాయి. కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీ కోవర్టుగా పని చేశానని 18 వేల కాంట్రాక్టు దక్కింది నిజమేనని రాజగోపాల్ రెడ్డి అంగీకరించారు. రాజగోపాల్ ది కోవర్టు చర్య కాక మరేమిటి? కోవర్టు అంటే రాజగోపాల్ కు ఎందుకు ఉలికి పాటు? కోమటి రెడ్డి వెంకట రెడ్డికి ఇవన్నీ తెలియవా? తన పార్లమెంటు నియోజక వర్గం పరిధిలో ఎన్నికలు జరుగుతుంటే కోమటి రెడ్డి ఎందుకు ప్రచారానికి వెళ్ళరు? కోమటి రెడ్డి వెంకట రెడ్డి కోవర్టు కాక మరేమిటి? కోమటి రెడ్డి సోదరులను కోవర్టు సోదరులు అని కేటీఆర్ అనడం ముమ్మాటికీ కరెక్ట్. డబ్బు ఉందనే అహంకారంతో కోమటి రెడ్డి బ్రదర్స్ విచ్చల విడిగా ప్రవర్తిస్తున్నారు.’’ అని కడియం శ్రీహరి అన్నారు.

బూర నర్సయ్య చేసే ఆరోపణలు అన్నీ అబద్ధాలు - ఎంపీ బడుగుల
‘‘మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కు కేసీఆర్ వల్లే రాజకీయంగా గుర్తింపు వచ్చింది. 2014, 2019 లో ఎంపీగా పోటీ చేసే అవకాశం టీఆర్ఎస్ బూర నర్సయ్యకు ఇచ్చింది. 2019 లో ఎంపీగా ఓడిపోయినా బూరకు కేసీఆర్ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. మా కంటే ఎక్కువగా బూర కేసీఆర్ ను కలిశారు. ఇటీవల సీఎం కేసీఆర్ యాదాద్రిలో పర్యటించినపుడు బూరకు అన్నింటా ప్రాధాన్యత లభించింది. వెనకబడిన వర్గాలకు టీఆర్ఎస్ ప్రాధాన్యం ఇవ్వడం లేదని బూర చేసిన ఆరోపణలు శుద్ధ అబద్ధం. రాజ్యసభ సభ్యులుగా ముగ్గురు బీసీలకు కేసీఆర్ అవకాశం ఇచ్చారు. గొర్లు కాచుకునే నాకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశమిచ్చారు కేసీఆర్.. ఇది బీసీ లకు గౌరవం లభించినట్టు కాదా? ఇన్నేళ్లలో బీసీలకు లభించని గౌరవం కేసీఆర్ ఈ ఎనిమిదేళ్ల పాలనలో లభించింది.’’ అని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Weather Update Today: అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Look Back 2024: అన్నకు ఎదురెళ్ళిన బాణం.. షర్మిల 2024లో ప్లస్సు అదే.. మైనస్ అదే
అన్నకు ఎదురెళ్ళిన బాణం.. షర్మిల 2024లో ప్లస్సు అదే.. మైనస్ అదే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP DesamAmitshah vs Rahul Gandhi Ambedkar Controversy | పార్లమెంటును కుదిపేసిన 'అంబేడ్కర్ కు అవమానం' | ABPఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Weather Update Today: అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Look Back 2024: అన్నకు ఎదురెళ్ళిన బాణం.. షర్మిల 2024లో ప్లస్సు అదే.. మైనస్ అదే
అన్నకు ఎదురెళ్ళిన బాణం.. షర్మిల 2024లో ప్లస్సు అదే.. మైనస్ అదే
Constable Physical Events: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల కాల్‌లెటర్లు విడుదల - షెడ్యూలు ఇదే
కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల కాల్‌లెటర్లు విడుదల - షెడ్యూలు ఇదే
This Week OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
WhatsApp: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ త్వరలో - ఇకపై ఫోన్ కాలింగ్ తరహాలో!
వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ త్వరలో - ఇకపై ఫోన్ కాలింగ్ తరహాలో!
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
Embed widget