News
News
X

KA Paul On TS Secretariat: నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది - సచివాలయం అగ్నిప్రమాదంపై కేఏ పాల్ షాకింగ్ కామెంట్లు

KA Paul On TS Secretariat: నేను వద్దనుకున్నాను.. అందుకే దేవుడు కూడా వద్దనుకొని తెలంగాణ నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగేలా చేశాడని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

FOLLOW US: 
Share:

KA Paul On TS Secretariat: తెలంగాణ నూతన సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ షాకింగ్ కామెంట్లు చేశారు. తాను సచివాలయం చూసేందుకు వెళ్తానంటే అధికారులు అడ్డుకున్నారని.. అందుకే తాను నూతన సచివాలయం వద్దనుకున్నానని చెప్పారు. అందుకే దేవుడు కూడా వద్దనుకున్నాడని.. ఈ క్రమంలోనే సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగిందని అన్నారు. తనతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని చెప్పారు. దేవుడు కూడా సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. దేవుడికి కూడా నచ్చకపోవడం వల్లే సచివాలయానికి వ్యతిరేకంగా నిలబడ్డారని కేఏ పాల్ పేర్కొన్నారు. కేసీఆర్ అవినీతి ఎంతో కాలం చెల్లదని కేఏ పాల్ వెల్లడించారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా విషయం తెలుసుకొని పశ్చాత్తాప పడాలని సూచించారు. 

తెలంగాణ నూతన సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టుకొని ఆయన పుట్టినరోజు నాడు కాకుండా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు ప్రారంభించడం ఏంటని కేఏ పాల్ ప్రశ్నించారు. వాస్తు బాగా లేదని సెక్రటేరియట్ కూలగొట్టడం ఏంటని నిలదీశారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ గెలవరని... అలాంటప్పుడు ప్రధాని ఏం అవుతారని ఎద్దేవా చేశారు. అంబేడ్కర్ జయంతి రోజే సచివాలయాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఇటీవలే నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభించడాన్ని సవాలు చేస్తూ కేఏ పాల్ హైకోర్టులో పిల్ వేశారు. సీఎం తన వ్యక్తిగత ప్రచారం నిమిత్తం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, అందులో భాగంగానే ఆయన పుట్టిన రోజు నాడు సచివాలయం ప్రారంభించబోతున్నారని చెప్పారు. 

"నేను వద్దన్నాను. దేవుడు వద్దని అనుకున్నాడు. అందుకే సెక్రటేరియేట్ కాలిపోయింది. నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. దేవుడు కూడా కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నాడు. 600 కోట్ల రూపాయలు పెట్టి కొత్త బిల్డింగ్ కట్టారు. నేను వద్దన్నానని బిల్డింగ్ కాలిపోయింది కదా. దేవుడు కూడా మీకు వ్యతిరేకంగా ఉన్నాడు.. దళితులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మీకు అందరూ వ్యతిరేకం అవుతున్నారు. ఏప్రిల్ 14న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పుట్టిన రోజునే సెక్రటేరియట్ ఓపెన్ చేయండి. లేదంటే కోర్టులో చూస్కుందాం. అయినా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టి.. పేరొకరిది ఊరొకరిది లాగా చేస్తున్నారెందుకు. నాకు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి." - కేఏ పాల్   

రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జన్మించిన రోజు కాకుండా ముఖ్యమంత్రి పుట్టిన రోజు సంద్రభంగా ప్రారంరభించడం సరికాదని చెప్పారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఇందులో ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు సీఎం కార్యాలయాన్ని చేర్చారు. నంబరు కేటాయింపు నిమిత్తం పరిశీలనలో ఉంది.   

శుక్రవారం ఉదయం ప్రమాదం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ప్లాస్టిక్ మెటీరియల్ కు మంటలు అంటుకున్నాయి. దీంతో సచివాలయం ప్రధాన గుమ్మం దగ్గర దట్టంగా పొగలు అలముకున్నాయి. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 11 అగ్ని మాపక యంత్రాలతో రంగంలోకి దిగింది. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఫైర్ డీజే నేరుగా రంగంలోకి దిగారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

Published at : 03 Feb 2023 05:50 PM (IST) Tags: KA Paul comments Telangana News KA Paul Shocking News New Secretariat Fire Accident KA Paul Comments on New Secretariat

సంబంధిత కథనాలు

TSPSC Paper Leak: ఉదాసీనతే కొంప ముంచిందా? విధులు నిర్వహిస్తూనే పరీక్షలకు హాజరైన కమిషన్ ఉద్యోగులు! అయినా నో రెస్పాన్స్!

TSPSC Paper Leak: ఉదాసీనతే కొంప ముంచిందా? విధులు నిర్వహిస్తూనే పరీక్షలకు హాజరైన కమిషన్ ఉద్యోగులు! అయినా నో రెస్పాన్స్!

TSPSC Paper Leak: విచారణకు హాజరుకాలేను- సిట్ కు బండి సంజయ్ లేఖ 

TSPSC Paper Leak: విచారణకు హాజరుకాలేను- సిట్ కు బండి సంజయ్ లేఖ 

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో కీలక అంశాలివే!

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో కీలక అంశాలివే!

రేవంత్‌ హౌస్‌ అరెస్టు- భారీగా మోహరించిన పోలీసులు

రేవంత్‌ హౌస్‌ అరెస్టు- భారీగా మోహరించిన పోలీసులు

TSRTC Dynamic Pricing: రద్దీ టైంలో తెలంగాణ బస్‌ టికెట్లపై బాదుడు - కిటికీ పక్క సీటు స్పెషల్ కాస్ట్- ఈనెల 27 నుంచే అమలు 

TSRTC Dynamic Pricing: రద్దీ టైంలో తెలంగాణ బస్‌ టికెట్లపై బాదుడు - కిటికీ పక్క సీటు స్పెషల్ కాస్ట్- ఈనెల 27 నుంచే అమలు 

టాప్ స్టోరీస్

300కార్లతో ర్యాలీ- టీడీపీలోకి వెళ్లే సమయంలో కోటంరెడ్డి బలప్రదర్శన

300కార్లతో ర్యాలీ- టీడీపీలోకి వెళ్లే సమయంలో కోటంరెడ్డి బలప్రదర్శన

పది పరీక్షలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం-విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్

పది పరీక్షలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం-విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్

Ustad Bhagat Singh Shoot : రాసుకో సాంబ - షూటింగుకు ఉస్తాద్ పవన్ కళ్యాణ్ రెడీ

Ustad Bhagat Singh Shoot : రాసుకో సాంబ - షూటింగుకు ఉస్తాద్ పవన్ కళ్యాణ్ రెడీ

Actor Ajith Father Died : కోలీవుడ్ హీరో అజిత్ ఇంట్లో విషాదం - హీరో తండ్రి మృతి 

Actor Ajith Father Died : కోలీవుడ్ హీరో అజిత్ ఇంట్లో విషాదం - హీరో తండ్రి మృతి