అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Encroachment Land: చెరువులో కాలేజీల నిర్మాణం, ప్రమాదంలో విద్యార్థుల భవితవ్యం! హైడ్రా ఉక్కుపాదం

HYDRA News: హైదరాబాద్ లో హైడ్రా యాక్షన్ మొదలైన నాటి నుండి కబ్జా బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. నేపధ్యంలో తాజాగా చెరువులో నిర్మించిన ఓ కాలేజి నిర్వాకం వివాదంగా మారింది.

Hyderabad News | హైడ్రా దెబ్బకు అడ్డగోలు ఆక్రమణలు, హద్దుమీరిన నిర్మాణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ప్రక్రుతికి కూడా హైడ్రాకు అండగా ఉంటుంది అన్నట్లుగా వర్షాల ప్రభావంతో చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలు బయటపడుతున్నాయి.తాజాగా నిజాంపేట్ లోని పత్తికుంట చెరువుకు చెందిన ఎఫ్ టిెఎల్ పరిధిని సైతం ఆక్రమించిన కబ్జాబాబులు ఏకంగా బహులంతస్తుల కాలేజి నిర్మించడంతోపాటు ఏళ్లతరబడి ప్రభుత్వ స్దలంలో కాలేజి నిర్వహించడంతోపాటు ఇప్పుడు వారి ప్రాణాలనే ప్రమాదంలో నెట్టింది. వివరాల్లోకి వెళితే..

FTL పరిధిలో అక్రమ నిర్మాణాలు

పత్తికుంట చెరువు పది ఎకరాల విస్తీర్ణంలో సర్వే నెంబర్ 127లో పరిధిలో కొన్ని దశాబ్దాలుగా విస్తరించి ఉంది. అయితే ఆ తరువాత కాలంలో కబ్జాదారులకు వంతపాడుతున్న కొందరు అధికారలు చెరువుకు సంబంధించి ప్రైమరీ నోటిఫికేషన్ లో ఐదు ఎకరాలు మాత్రమే చూపించారు. దీనిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తే మరోసారి పూర్తి విస్తీర్ణం పదిఎకరాల లెక్కలు బయటకు తీసారు. ఇప్పుడు పది ఎకరాలు చెరువు కాస్త కేవలం ఐదు ఎకరాలు మాత్రమే ఉంది. మిగతా ప్రాంతంలో ఏకంగా ఎప్ టిఎల్ పరిధిలో అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టారు. 

Encroachment Land: చెరువులో కాలేజీల నిర్మాణం, ప్రమాదంలో విద్యార్థుల భవితవ్యం! హైడ్రా ఉక్కుపాదం

ఈ చెరువు ఎఫ్ టిఎల్ పరిధిలో నిర్మించిన ఎస్ ఆర్ జూనియర్ కాలేజి వివాదంగా మారింది. తాజాగా భారీ వర్షాల నేపధ్యంలో ఏకంగా కాలేజి సెల్లార్ లో ఒక్కసారిగా నీరు ఉబికి పైకి రావడంతో విద్యార్దుల్లో ఆందోళన నెలకొంది. చెరువును ఆక్రమించి నిర్మించిన కట్టడం కావడంతో ఎగువ నుండి వస్తున్న వరదనీరు, భూమిలో పైకి ఉబికి వస్తున్న వరద నీటితో సెల్లార్ నీటితో నిండిపోవడంతోపాట కాలేజి భవనం కూలే ప్రమాదం ఉండటంతో అధికారుల రంగంలోకి దిగారు. విద్యార్దులను కాళీచేయించి కాలేిజి సెల్లార్ ప్రాంగణాన్ని తాత్కాలికంగా సీజ్ చేసారు.  

ఆక్రమించి కట్టిన భవనం అంటే పరువుపోతుందని భావించిన కాలేజి యాజమాన్యం అతి తెలివి ప్రదర్శించి విద్యార్దులకు భారీ వర్షాల నేపధ్యంలో సెలవులు ఇస్తున్నామని చెప్పి వారి ఇళ్లకు పంపివేశారు.ఇప్పడు ఏ క్షణం కూలుతుందో తెలియని కాలేజి భవనం. తరగతులు ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తారో తెలియని అయోమయంలో ఇంటర్ మొదటి ,రెండవ సంవత్సరాకు చెందిన 500మందికి పైగా విద్యార్దుల జీవితాలు ప్రమాాదంలో పడ్డాయి. దీనికి ప్రధాన కారణం నిబంధనలు పాటించకుండా చెరువును ఆక్రమించి భవనం కడుతుంటే కళ్లు మూసుకుని అనుమతులు మంజూరు చేసిన అధికారులు. ఇప్పటికే అడ్డగోలు అనుమతులపై, అప్పటి అధికారులపై ద్రష్టిపెట్టిన హైడ్రా ఎస్ ఆర్ జూనియర్ కాలేజికి అనుమతులు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని స్దానికులు డిమాండ్ చేస్తున్నారు. 

ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణం, ఇప్పుడు చెరువు నీరుచేరి కూలేదశలో భవనం ఉంటంతో గుట్టుచప్పుడు కాకుండా సెల్లార్ లో నిటీని పైప్ లైన్ ద్వారా చెరువులోకి తరలిస్తున్నారు. ఆక్రమణ వ్యవహారంపై నిర్వాహకులతో మాట్లడే ప్రయత్నం చేసింది ఏబిపి దేశం. చెరువులో కాలేజి నిర్మాణంపై నిర్వాహకులు ఏమంటున్నారంటే..

Encroachment Land: చెరువులో కాలేజీల నిర్మాణం, ప్రమాదంలో విద్యార్థుల భవితవ్యం! హైడ్రా ఉక్కుపాదం

అన్ని అనుమతులూ తీసుకునే కాలేజి భవనం నిర్మాణం చేపట్టాము. గ్రామపంచాయితి పదేళ్ల క్రితమే మాకు అనుమతులు ఇచ్చింది. సెల్లార్ లో నీరు వస్తున్నమాట వాస్తవం ,కానీ అవి చెరువునీరు కాదు. ఎఫ్ టిఎల్ పరిధి ఐదు ఎకరాలు మాత్రమే ఉందని మావద్ద ఆధారాలున్నాయి.చట్టపరంగా ముందుకు వెళ్తాం అంటున్నారు ఎస్ ఆర్ జూనియర్ కాలేజి భవన నిర్వాహకులు.

అయితే వాస్తవాాలకు విరుద్దంగా నిర్వాకులు వివరణ ఉందని స్దానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పట్లో అధికారులను తప్పుదోవపట్టించి చెరువును ఆక్రమించారని విమర్శిసున్నారు. గ్రామ పంచాయితీ అనుమతులు ఉంటే జి ఫ్లెస్ టూ నిర్మాణం మాత్రమే చేపట్టాలి. ఇంతలా భారీ కాలేజి నిర్మాణం ఎలా చేపట్టారని ప్రశ్నిస్తున్నారు.  

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్..  కాంగ్రెస్‌, BJPకి ఆ శక్తి లేదుఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
Embed widget