అన్వేషించండి

Hyderabad Latest News: కేబుల్ టచ్ చేస్తే మీటర్ పేలిపోద్ది..! హైదరాబాద్ నగరంలో కేబుల్ వ్యవస్దను మార్చడం సాధ్యమేనా?

Hyderabad Latest News: హైదరాబాద్‌లో కేబుల్ ఆపరేటర్లు వర్సెస్ విద్యుత్ శాఖ వివాదంలో కేబుల్ ఆపరేటర్ల తమ పంతాన్ని నెగ్గించుకున్నారు. టచ్ చేస్తే ఇంటర్ నెట్ బంద్ అనే ప్రకటనతో ప్రభుత్వం దిగొచ్చింది.

Hyderabad Latest News: హైదరాబాద్ నగరంలో కేబుల్ ఆపరేటర్ల ఎంత పవర్ ఫుల్ అంటే.. వాళ్లు అనుకుంటే ఏకంగా గంటల వ్యవధిలో తమ పంతాన్ని నెగ్గించుకోగలరు. తాజాగా నగరంలో వేగంగా జరిగిన పరిణామాలే అందుకు నిదర్శం అనే వాదనలు వినిపిస్తున్నాయి. వరుస విద్యత్ షాక్‌లతో నగరంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రామంతపూర్‌లో ఏకంగా ఆరుగురు కృష్ణాస్టమి వేడుకలో విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత ఘటనలలో అనేక మంది గాయపడ్డారు. ఇటీవల ఈ రెండు ఘటనలే కాదు గతంలో నగరంలో అనేక ప్రాంతాల్లో హైటెన్షన్ వైర్లు తగిలి ప్రాణాలు కోల్పోయినవారు ఎంతో మంది ఉన్నారు. తాజాగా ఓకేసారి ఆరుగురు చనిపోవడం పెను సంచలనంగా మారింది. ఈ విషాదాన్ని సీరియస్‌గా తీసుకున్న తెలంగాణ సర్కార్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించడం, రంగంలోకి దిగిన విద్యుత్ షాక్‌ అధికారులు, కారణం కేబుల్ వైర్లే నంటూ ఆరోపిస్తూ .. పలు ప్రాంతాల్లో కేబుల్ వైర్లు కట్ చేయడం చకచకా జరిగిపోయాాయి.

ఎప్పుడైతే కేబుల్ వైర్ కట్ అయ్యిందో అత్యంత వేగంగా పరిణామాలు మారిపోయాయి. కేబుల్ ఆపరేటర్లు యూనిన్ రంగంలోకి దిగి, కేబుల్ వైర్లు కట్ చేయడం ఆపకపోతే హైదరాబాద్ వ్యాప్తంగా ఇంటర్ నెట్ సేవలు బంద్ చేస్తామంటూ హెచ్చరించింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఇంటర్ నెట్ సేవలు సైతం గంటల తరబడి నిలిచిపోయాయి. ఇంటర్ నెట్‌పై ఆధారపడ్డ లక్షల మంది వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సైతం దిగిరాక తప్పలేదు. ఆపరేటర్లతో చర్చలు జరిపి, కేబుల్ వైర్లు కట్ చేకుండా ఆపడంతో సమస్య తాత్కాలికంగా సద్దుమణిగిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ కొత్త ట్విస్ట్ ఏంటంటే.. ప్రభుత్వం ఆదేశించినట్లు, కేబుల్ ఆపరేటర్లు చెప్పినట్లు నగరవ్యాప్తంగా కేబుల్ వైర్లు క్రమబద్దీకరించడం సాధ్యమేనా.. అలా సాధ్యమైన పనైతే ఇన్నాళ్లు ఎందుకు లైట్ తీసుకున్నారు. సాధ్యం కాని పని అయితే ఇప్పుడెందుకు డైవర్షన్ టెక్నిక్‌ప్లే చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

హైదరాబాద్ నగరంలో కోటిన్నర మందికిపైగా జనాభా నివసిస్తున్నారు. లక్షన్నర మంది కేబుల్ ఆపరేటర్లు ఇంటర్ నెట్ సరఫరా చేసే వివిధ కంపెనీలలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే నగరవ్యాప్తంగా కేబుల్ వైర్లు దాదాపు తొంభై శాతంపైగా విద్యుత్ స్తంభాలపై ఆదారపడే ఇంటర్ నెట్ సేవలు అందిస్తున్నాయి. కొన్ని దశాబ్దాలుగా ఇదే కొనసాగుతోంది. విద్యుత్ శాఖ సీఎండీ నుంచి క్రింది స్థాయి అధికారులు వరకూ అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే. కానీ చూసీచూడనట్లుగా విద్యుత్ శాఖాధికారులు వ్యవహరిస్తూనే వచ్చారు. అవకాశం ఇచ్చారు కాదా, మనమెందుకు ఆగాలి అన్నట్లుగా కేబుల్ ఆపరేటర్లు సైతం ప్రత్యామ్నాయ వ్యవస్ద ఏర్పాటు చేసుకోకుండా, విద్యుత్ వైర్లు, విద్యుత్ స్తంభాలకు సమాంతరంగా ఇంటర్ నెట్ కేబుల్ వైర్లు లక్షల మీటర్ల మేరా ఏర్పాటు చేశారు. ఇవన్నీ తొలగించి, సింగిల్ ఫైబర్ లైన్ వేస్తామంటూ తాజాగా ఆపరేటర్లు చెబుతున్నప్పటికీ ఆచరణ సాధ్యం కానిదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

Hyderabad Latest News: కేబుల్ టచ్ చేస్తే మీటర్ పేలిపోద్ది..! హైదరాబాద్ నగరంలో కేబుల్ వ్యవస్దను మార్చడం సాధ్యమేనా?

విద్యుత్ షాక్‌లకు కారణం కేబుల్ వైర్లు మాత్రమే కాదనే విషయం విద్యుత్ శాఖ అధికారులకు తెలుసు. విద్యుత్ సరఫరా నిర్వహణలో లోపాాలు ఉన్నాయనే వాస్తవాలు వారికి తెలుసు. కానీ తాత్కాలికంగా ఆపరేటర్లపై నెపం వేయడంతో విద్యుత్ షాక్‌ విషయం ప్రక్కదారి పట్టింది అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆపరేటర్లు సైతం తామేం తక్కువ తినలేదన్నట్లు గంటల వ్యవధిలో ప్రభుత్వాన్ని దారిలోకి తెెచ్చిమరీ, పంతం నెగ్గించుకున్నారు. కానీ మీడియా ముందు హమీ ఇచ్చినట్లుగా నగర వ్యాపంగా విద్యుత్ స్తంభాలపై ఆధారపడకుండా సింగల్ ఫైబర్ వ్యవస్ద ఏర్పాటు చేయడం అసాధ్యమనే వాదనలు వినిపిస్తున్నాయి. కమిట్‌మెంట్ ఇచ్చినట్లుగా కేబుల్ వ్యవస్ద మారితే సంతోషించదగ్గ పరిణామమే కానీ, తప్పు మాది కాదంటే మాది కాదన్నట్లుగా తప్పించుకునేందుకు అటు విద్యుత్ శాఖ, ఇటు కేబుల్ ఆపరేటర్లు చేతులు దులుపుకున్నాం కాదా అని సరిపెట్టుకుంటే మళ్ళీ వరుస షాక్‌లతో అమాయకులు ప్రాణాలు కోల్పోక తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I: పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
పొగ మంచు కారణంగా భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ రద్దు
Train Luggage Charges: రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ - ఇక విమానాల తరహాలో లగేజీ చార్జీలు వసూలు - ఇవిగో డీటైల్స్
Sahana Sahana Song: లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
లవ్లీ & రొమాంటిక్‌గా సహానా సహానా... ప్రభాస్ 'రాజా సాబ్'లో కొత్త సాంగ్ చూశారా?
Kamareddy Tiger News: కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
కామారెడ్డిలో పెద్దపులి సంచారం.. ట్రాప్ కెమెరాలు, బోను ఏర్పాటు.. దండోరాతో వార్నింగ్
Rajamouli - James Cameron: వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
వారణాసి సెట్‌కు రావచ్చా? రాజమౌళికి జేమ్స్ కామెరూన్ రిక్వెస్ట్ - 'అవతార్ 3' ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే?
Trimukha Movie Release Date: సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
సన్నీ లియోన్ కొత్త తెలుగు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్... జనవరి మొదటి వారంలో!
Droupadi Murmu Arrives In Hyderabad: శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌‌కు రాష్ట్రపతి ముర్ము.. 5 రోజులపాటు ఆమె షెడ్యూల్ విడుదల
Tata Sierra Dealership: టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
టాటా సియెరా డీలర్‌షిప్ ఎలా పొందాలి, ఆదాయం ఎన్ని విధాలుగా వస్తుందో తెలుసా
Embed widget