Crime News: ఒక్క లంచమే రూ.70లక్షలు - సీబీఐకి చిక్కిన IRS ఆఫీసర్ - వైరా మాజీ ఎమ్మెల్యే కొడుకు !
Corrupt Officer: 70 లక్షల లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కాడు ఐఆర్ఎస్ ఆఫీసర్. ఆయన వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ కుమారుడు.

IRS officer caught by CBI: ఆదాయపు పన్ను శాఖ అధికారిగా ఉంటూ పెద్ద ఎత్తున లంచాలు తీసుకుంటున్న అధికారిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇండియన్ రెవిన్యూ సర్వీస్ కు చెందిన జీవన్ లాల్ హైదరాబాద్‌లోని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఎక్సెమ్షన్ కమిషనర్‌గా పనిచేస్తున్నాడు. ఒక వ్యాపారవేత్త నుండి, అతని సంస్థకు సంబంధించిన పన్ను సంబంధిత సమస్యలను సెటిల్ చేయడానికి లంచం సెటిల్ చేసుకున్నాడు. ఏకంగా 70 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు.
CBI arrests Commissioner Income Tax (Exemptions), Hyderabad Jeevan Lal Lavidiya and four others in connection with alleged bribery of Rs 70 lakh: Officials. pic.twitter.com/T88CP8krsd
— Press Trust of India (@PTI_News) May 10, 2025
వారు సీబీఐకి ఫిర్యాదు చేశారు. సీబీఐకి సమాచారం అందడంతో వారు ట్రాప్ చేశారు. జీవన్ లాల్ లంచం తీసుకుంటున్న సమయంలో అరెస్టు చేశారు. జీవన్ లాల్ తండ్రి రాములు నాయక్, తెలంగాణలోని వైరా నియోజకవర్గం నుండి స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో పోటీ చేసి గెలిచారు. తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. గత ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ రాలేదు. ఆయన కుమారుడు జీవన్ లాల్.
BREAKING:
— Lakshya Nain Guladhi (@lak_jaihind) May 10, 2025
The CBI has arrested Jeevan Lal Lavidiya, Commissioner of Income Tax (Exemptions), Hyderabad, along with 4 others in connection with an alleged bribery case, officials confirm.
This marks a major crackdown on corruption within high-ranking tax administration circles. pic.twitter.com/JRWAuhhSlL
సీబీఐ అరెస్టు చేసి అతని ఇంటిలో, కార్యాలయంలో సోదాలు నిర్వహించింది. లంచం డబ్బుతో పాటు కొన్ని ఆస్తుల సంబంధిత డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. జీవన్ లాల్‌ను కోర్టులో హాజరుపరిచి, సీబీఐ కస్టడీకి తీసుకున్నారు. జీవన్ లాల్ భార్య ఐపీఎస్ అధికారి. మహారాష్ట్రలో పని చేస్తున్నారు. షాపూర్జీ పల్లోంజీ కంపెనీ నుంచి ఈ లంచం తీసుకుంటున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.
CBI books Shapoorji Pallonji Group Company (Shapoorji Pallonji Infrastructure Gujarat Pvt Ltd), Jeevan Lal Lavidiya, IRS and others over allegations of corruption in deciding tax appeals.
— Harmeet Kaur K (@iamharmeetK) May 10, 2025
The entity building Chhara Port.
Adani ji ke liye kya kya nahi karna padta...
ఈ ఘటన హైదరాబాద్‌లో సంచలనం సృష్టించింది, ముఖ్యంగా జీవన్ లాల్ తండ్రి రాజకీయాల్లో ఉండటంతో వైరల్ అయింది. గతంలో కూడా ఇలాంటి లంచం కేసుల్లో ఐఆర్ఎస్ అధికారులు అరెస్టయిన సందర్భాలు ఉన్నాయి . జీవన్ లాల్ అరెస్టు ఘటన ఆదాయపు పన్ను శాఖలో అవినీతిని వ్యవహారాన్ని మరోసారకి చర్చనీయాంశం చేసింది.





















