Trump Card: కాల్పుల విరమణకు భారత్, పాక్ అంగీకారం- సంచలన ట్వీట్ చేసిన ట్రంప్
Trump: భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ ప్రకటించారు. ఇందు కోసం రాత్రంగా జరిపిన చర్చలు ఫలించాయన్నారు.

India and Pakistan have agreed to a full and immediate ceasefire: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో భారత్ మరియు పాకిస్తాన్ మధ్య పూర్తి , తక్షణ కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని ప్రకటించారు. అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాత, భారత్ , పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని రెండు దేశాలు తెలివిగా , బాధ్యతాయుతంగా తీసుకున్నాయని అభినందించారు.
US President Donald Trump says, "After a long night of talks mediated by the United States, I am pleased to announce that India and Pakistan have agreed to a full and immediate ceasefire..." https://t.co/0k2ZrrqHZf pic.twitter.com/z5C2n6CWX6
— ANI (@ANI) May 10, 2025
ట్రంప్ ప్రకటన అకస్మాత్తుగా , ధృవీకరణ లేకుండా రావడం వల్ల ఇందులో నిజం ఎంత ఉందన్న సందేహం వస్తోంది. ఇప్పటి వరకూ రెండు దేశాల నుండి అధికారిక ధృవీకరణ లేదు. ఆపరేషన్ సిందూర్ గురించి తొలి స్పందనలో ట్రంప్ ఈ ఉద్రిక్తతలను “శాంతియుతంగా ముగియాలని” కోరుకున్నారు. ఆ రెండు దేశాలు “శతాబ్దాలుగా పోరాడుతున్నాయి” అని, “త్వరగా ముగియాలని” సెటైరిక్ గా స్పందించారు. తర్వతా ఈ ఘర్షణలను ఆపేయాలని అవసరమైతే తాను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని, రెండు దేశాలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఏప్రిల్ 26 పహల్గాం దాడిని “దారుణమైనది” అని ఖండించి, భారత్ , పాకిస్తాన్ స్వయంగా ఈ సమస్యను పరిష్కరించుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశాడు.
అయితే హఠాత్తుగా తాను మధ్యవర్తిత్వం వహించానని కాల్పుల విరమణకు అంగీకరించారని ప్రకటించారు. కానీ ఆయన ప్రకటన పూర్తి స్తాయిలో నమ్మశక్యంగా లేదు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ఆయన అవాస్తవాలను అసువుగా చెప్పేసతున్నారు. టారిఫ్ ల విషయంలో చైనాతో చర్చలు జరుగుతున్నాయని.. తాను స్వయంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో మాట్లాడానని కూడా చెప్పారు కానీ.. అవన్నీై ఉత్తదేనని చైనా ప్రకటించింది. అధ్యక్ష స్థానంలోఉన్న వ్యక్తి ఇలా ఎందుకు అబద్దాలు చెబుతారని అందరూ ఆశ్చర్యపోయారు.
ట్రంప్ తీరు అంతేనని అంటున్నారు. అయితే కాల్పుల విరమణపై అటు పాకిస్తాన్ నుంచి కానీ.. భారత్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ట్రంప్ తో ఎవరు చర్చలు జరిపారో స్పష్టత లేదు. నిజానికి శుక్రవారం కాల్పులు జరుగుతున్న సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. నన్ ఆఫ్ మై బిజినెస్ అంటూ స్పందించారు. ఆ ఉద్రిక్తతలతో తమకు సంబంధం లేదన్నారు. ఒక వేళ చర్చలు జరుగుతూ ఉంటే ఆయన అలా ఎందుకు స్పందించారన్నది కూడా ఆసక్తి కరమే. ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా సమక్షంలో వచ్చి ఉంటే.. కాస్త ఉద్రిక్తతలు చల్లారే అవకాశం ఉంది.
అయితే పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్.. ఈ ప్రకటన నిజమేనని కాల్పుల విరమణకు అంగీకరించామని ట్వీట్ చేశారు.
Pakistan and India have agreed to a ceasefire with immediate effect. Pakistan has always strived for peace and security in the region, without compromising on its sovereignty and territorial integrity!
— Ishaq Dar (@MIshaqDar50) May 10, 2025





















