India Pakistan War: యుద్ధమంటే మాకు పండగే - ఇన్ఫ్లుయెన్సర్‌కు షాక్ ఇచ్చిన నెటిజన్లు!
India Pakistan War Updates: భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తపరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఓ రిక్వెస్ట్ పెట్టిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కి నెటిజన్లు షాకిచ్చారు

India Pakistan War : భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ పేరుతో మనసైన్యం పాక్ సైనికుల దాడిని తిప్పికొడుతోంది. మన సైనికుల ధైర్య సాహసాలు చూసి దేశ ప్రజలంతా కొనియాడుతున్నారు. సైనికుల ధైర్యసాహసాల పట్ల ప్రజలంతా ఎవరికి వారే తమ స్టైల్లో దేశభక్తిని చాటుకుంటున్నారు.ఈ సందర్భంగా ఓ ఓ సోషల్ మీడియా ఇన్ఫూయెన్సర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. సరిహద్దుల్లో జరుగుతున్న సంఘటనలను ఉద్దేశించి..."యుద్ధాన్ని సెలబ్రేట్ చేసుకోవద్దు" అని పోస్ట్ పెట్టింది. అయితే ఆమె ఉద్దేశం ఇక్కడ..హింసను, విధ్వంసాన్ని ప్రోత్సహించడం సరైనది కాదు అనే ఉద్ధేశం. అయితే ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె వాదనలతో ఏకీభవించగా..మరికొందరు కౌంటర్ ఇస్తున్నారు.
హిందూ ధర్మంలో మనం జరుపుకునే పండుగలన్నీ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా చేసుకునేవే...
రాక్షసులను భగవంతుడు సంహరించిన ప్రతిసారీ పండుగ చేసుకున్నాం
శ్రీ మహావిష్ణువు దశావతారాల వెనుకున్న ఆంతర్యం కూడా ఇదే...
హోలీ, దసరా, దీపావళి ఇవన్నీ ఆ ఉద్దేశంతో చేసుకున్న పండుగలే
హోలిక అనే రక్కసిని దహనం కావడంతో రంగులుచల్లుకుని హోలీ పండుగ జరుపుకున్నాం
మహిషాసురుడి సంహారించిన దుర్గమ్మను పూజిస్తూ దసరా జరుపుకుంటున్నాం
లోకాన్ని పీడించే నరసకాసుడి వధను సెలబ్రేట్ చేసుకుంటూ దీపావళి జరుపుకుంటున్నాం
ఇలా హిందువుల ప్రతి పండుగల వెనుక ఆంతర్యం...దుష్ట శిక్షణ శిష్ట రక్షణ
ఇక్కడ యుద్ధం కూడా దుష్టశక్తుల నిర్మూలనే..ఉగ్రమూకను మట్టుబెట్టేందుకే...
అందుకే మన సైన్యం వేసే ప్రతి అడుగూ చెడుని అంతం చేసేందుకే.
పరోక్షంగా యుద్ధ విజయాలను , దుష్ట శక్తుల అంతాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది హిందూ సంస్కృతిలో భాగంఅని ఓ నెటిజన్ రిప్లై ఇచ్చాడు.
యుద్ధం చేయాల్సిన పరిస్థితి రావడం హింస కాదు..అన్యాయంపై విజయం సాధించడం.. అరాచకులను మట్టుబెట్టడం.. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కూడా ఈ కోవకే చెందుతుంది..
View this post on Instagram
సరిహద్దుల్లో అశాంతిని సృష్టించాలని చూస్తున్న దుష్టశక్తులను మన సైన్యం తిప్పికొడుతోంది అంతే.. పాక్ పౌరులకు ఎలాంటి నష్టం కలిగించడం లేదు. హింసను ప్రోత్సహించడం లేదు...హింసను అడ్డుకుంటోంది అని ఉద్దేశం వచ్చేలా వీడియో షేర్ చేశాడు.ఈ కౌంటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ యుద్దాన్ని భావోద్వేగంతో కాకుండా.. కేవలం సాంస్కృతిక, ధార్మిక కోణంలో యుద్ధం, విజయం పట్ల భారతీయ దృక్పథాన్ని స్పష్టం చేశాడు. యుద్ధం ఎప్పుడూ బాధాకరమైన విషయమే అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో హింసను అడ్డుకోవడం కోసం, దేశరక్షణ కోసం పోరాడి, దుష్టశక్తులపై విజయం సాధించినప్పుడు దానిని స్మరించుకోవడం, గర్వపడటం అత్యంత సహజం. యుద్దాన్ని సెలబ్రేట్ చేసుకోవద్దన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కి సమాధానంగా ...యుద్దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది మన సంస్కృతిలో ఉందనే సమాధానం ఇచ్చాడు.
సుదర్శన చక్రం గురించి మీకు తెలియని విషయాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి






















