అన్వేషించండి

HYDRA News: కొండాపూర్‌లో రూ.700 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడి, ఫెన్సింగ్ వేసిన హైడ్రా

హైడ్రా హైదరాబాద్‌లో కబ్జాదారుల ఆట కట్టిస్తోంది. ఈ క్రమంలో కొండాపూర్ పరిధిలోని రూ.700 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది.

హైదరాబాద్: నగరంలోని కొండాపూర్ ప్రాంతంలో అక్రమ కబ్జాకు గురైన భారీ విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా (HYDRAA) కాపాడింది. రూ.700 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను హైడ్రా అధికారులు విజయవంతంగా స్వాధీనం చేసుకున్నారు. శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం నుంచి మదీనగూడకు వెళ్లే మార్గంలో హైడ్రా కీలక ఆపరేషన్ నిర్వహించింది. సుమారు ఏడు వందల కోట్ల విలువైన ఈ భూమిని కబ్జాదారుల నుంచి విడిపించి హైడ్రా స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగించింది. 


HYDRA News: కొండాపూర్‌లో రూ.700 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడి, ఫెన్సింగ్ వేసిన హైడ్రా

స్థానిక జంగమోనికుంటకు సంబంధించిన 4 ఎకరాల భూమిని కొందరు కబ్జాదారులు ఆక్రమించారు. ఆ నీటి కుంటను మట్టితో పూడ్చి ప్లాట్లుగా మార్చి విక్రయించడానికి సన్నద్ధమయ్యారు. ఈ అక్రమాలపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు అందడంతో, వారు కబ్జాదారులపై కేసులు నమోదు చేశారు. ప్రజల ఫిర్యాదులతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ఆ విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని కుంట చుట్టూ ఫెన్సింగ్ వేసి రక్షణ కల్పించారు. నగరంలోని ప్రధాన నాలాలపై ఉన్న ఆక్రమణలను తొలగించడం ద్వారా వర్షాకాలంలో నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టింది.

ఇటీవల గండిపేట మండ‌లం, నార్సింగ్ విలేజ్‌, ఆరుణోద‌య హౌసింగ్ సొసైటీలోని పార్కును క‌బ్జాల చెర నుంచి హైడ్రా కాపాడింది. నార్సింగ్ చౌర‌స్తాలో 3 వేల గ‌జాల పార్కు భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఆ భూమి విలువ రూ. 60 కోట్ల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు.
HYDRA News: కొండాపూర్‌లో రూ.700 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడి, ఫెన్సింగ్ వేసిన హైడ్రా

హైడ్రా అంటే ఏంటి.. ఏ పనులు చేస్తుంది..

హైదరాబాద్ నగరంలోని ప్రకృతి వనరులను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యవస్థే హైడ్రా (HYDRAA - Hyderabad Disaster Response and Asset Protection Agency). జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ ఆస్తులను రక్షించడం, చెరువులు, కుంటలు, నాలాలను కబ్జాల నుండి విముక్తి చేయడం, విపత్తు నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 'హైడ్రా'ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. గతంలో ఉన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగానికి మరిన్ని అదనపు అధికారాలను కల్పిస్తూ హైడ్రా ద్వారా కబ్జాదారుల పని పడుతోంది. ముఖ్యంగా నగరం చుట్టూ ఉన్న చెరువుల ఎఫ్‌టీఎల్ (FTL), బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించి, భవిష్యత్తులో వరద ముప్పును తగ్గించాలని అనేది దీని ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ భూములను కాపాడటంతో పాటు, అత్యవసర సమయాల్లో విపత్తుల నుంచి నగర ప్రజలను కాపాడేందుకు హైడ్రాకు ప్రభుత్వం అధికారులు ఇచ్చింది. 

హైడ్రా చేపట్టిన ఇతర కీలక ఆపరేషన్లు
గండిపేట, హిమాయత్ సాగర్: జంట జలాశయాల పరిధిలోని క్యాచ్‌మెంట్ ఏరియాల్లో నిర్మించిన విలాసవంతమైన ఫామ్‌హౌస్‌లను, అక్రమ కట్టడాలను హైడ్రా సిబ్బంది తొలగించి ప్రభుత్వ భూములను కాపాడారు.
అమీన్‌పూర్ చెరువు: అత్యంత వివాదాస్పదమైన అమీన్‌పూర్ చెరువు సమీపంలోని ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుండి విడిపించి, అక్కడ వెలిసిన భారీ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది.
మాదాపూర్, శేరిలింగంపల్లి: ఐటీ కారిడార్‌లోని విలువైన చెరువు శిఖం భూముల్లో నిర్మించిన అపార్ట్‌మెంట్ గోడలు, షెడ్లను తొలగించి కుంటలను సైతం హైడ్రా పునరుద్ధరించింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
Bandi Sanjay: పాతబస్తీ హిందువులదే.. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మరుస్తాం: బండి సంజయ్
పాతబస్తీ హిందువులదే.. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మరుస్తాం: బండి సంజయ్
Ashada Bonalu: పాతబస్తీలో అంబరాన్నంటిన బోనాల జాతర.. లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
పాతబస్తీలో అంబరాన్నంటిన బోనాల జాతర.. లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Embed widget