అన్వేషించండి

Hyderabad Terror Attack Plan: హైదరాబాద్‌లో మరో ఉగ్రదాడికి కుట్ర! చంచల్‌గూడ జైలు ములాఖత్‌లే వేదికగా స్కెచ్?

Hyderabad Terror Attack: నగరంలోని చంచల్‌గూడ జైలు ములాఖత్‌లలో ఉగ్రకుట్రకు ప్లాన్ చేస్తున్నారని, లష్కరే తోయిబా ఉగ్రవాదులు దీని వెనుక ఉన్నారని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి.


హైదరాబాద్ నగరంలో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ ఉగ్రకుట్రకు చంచల్‌గూడ జైలు ప్రధాన కేంద్రంగా మారినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. జైలులో ఉన్న ఖైదీలను కలిసేందుకు వచ్చే 'ములాఖత్' సమయంలోనే ఉగ్రదాడులకు సంబంధించి ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇదివరకే పలుమార్లు ఉగ్రదాడులు జరిగాయి. కోఠి గోకుల్ చాట్, లుంబిని పార్క్, మక్కా మసీదు, దిల్‌సుఖ్ నగర్ బస్టాప్ వద్ద పలు సందర్భాలలో జరిగిన పేలుళ్లలో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.

చంచల్‌గూడ జైలు నుంచే ప్లాన్!

చంచల్‌గూడ జైలులో ఉన్న ఉగ్రవాదులు, ములాఖత్‌కు వచ్చిన వ్యక్తులతో హైదరాబాద్ నగరంలో దాడులు చేయడమే లక్ష్యంగా సంభాషణలు జరిపినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ మొత్తం కుట్ర వెనుక నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (LeT) కి చెందిన ఒక కీలక ఉగ్రవాది ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. 

టార్గెట్ ఏరియాలు: ఉగ్రవాదుల కదలికలు, పాత నేరస్తుల రికార్డులు పరిశీలించిన నిఘా అధికారులు నగరంలోని ముసారంబాగ్‌, సైదాబాద్‌, మలక్‌పేట్ ప్రాంతాలలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

నగరంలో పోలీసులు అలర్ట్..
చంచల్ గూడ జైలు ములాఖత్ సమయంలో ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్నారన్న సమాచారంతో నగర పోలీసులు,  కౌంటర్ ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. జైలులో ములాఖత్ కోసం వస్తున్న వ్యక్తుల వివరాలను, వారి గత చరిత్రను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానిత ప్రాంతాల్లో సోదాలు నిర్వహించడంతో పాటు, సిసిటివి ఫుటేజీలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నగర వాసులు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
New Fielding Coach: టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Raw Onions Side Effects : పచ్చి ఉల్లిపాయలు తింటే కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఇవే.. వారు తినకూడదట
పచ్చి ఉల్లిపాయలు తింటే కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఇవే.. వారు తినకూడదట
Vishnu Manchu: కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
కొరియన్ స్కిన్ కేర్ క్లినిక్‌లో మంచు ఫ్యామిలీ... మోహన్ బాబు, విష్ణు వైరల్ ఫోటోలు
Embed widget