అన్వేషించండి

KTR News: అంతర్జాతీయ వేదికలపై భారత్ పరువు తీయొద్దు.. AI సమ్మిట్‌లో కాంగ్రెస్ నిరసనపై కేటీఆర్

Youth Congress Protests at Global AI Summit | రాజకీయాలు చేయడానికి ఓ హద్దు, సమయం ఉంటుందని అంతర్జాతీయ వేదికలపై నిరసన తెలిపి భారత్ పరువు తీయవద్దని కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ సూచించారు.

హైదరాబాద్: న్యూఢిల్లీలో జరిగిన AI ఇంపాక్ట్ సమ్మిట్‌ను కాంగ్రెస్ నేతలు విమర్శల కోసం వాడుకుని అంతర్జాతీయ వేదికపై దేశం పరువు తీస్తున్నారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక 'AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026' వేదికను యూత్ కాంగ్రెస్ సభ్యులు తమ రాజకీయ ప్రదర్శనలకు వేదికగా మార్చుకోవడం అత్యంత విచారకరం అన్నారు.

కృత్రిమ మేధ (AI) రంగంలో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్న అతిపెద్ద గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌ను కాంగ్రెస్ నేతలు తమ నిరసనల కోసం ఉపయోగించడం వల్ల, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్ట మసకబారే ప్రమాదం ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమే అయినప్పటికీ, ఎక్కడ, ఎలా నిరసన తెలపాలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని హితవు పలికారు.

రాజకీయ అసమ్మతిని వ్యక్తం చేయడానికి సమయం, సందర్భం ఉంటాయని, అంతర్జాతీయ సదస్సులు ఖచ్చితంగా అందుకు సరైన వేదికలు కావని కేటీఆర్ పేర్కొన్నారు. . అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, అదే సదస్సులో తమ సొంత పార్టీకి చెందిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలోనే యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ నిరసన చేపట్టారు. ఇలాంటి చర్యలు అభివృద్ధి లక్ష్యాలను పక్కదారి పట్టించడమే కాకుండా, దేశ గౌరవానికి విఘాతం కలిగిస్తాయని కేటీఆర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఏఐ కౌన్సిల్, ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలి: రేవంత్ రెడ్డి 

ప్రపంచాన్ని శాసిస్తున్న కృత్రిమ మేధస్సును (AI) సమర్థవంతంగా వినియోగించుకోవడానికి జాతీయ స్థాయిలో ఏఐ కౌన్సిల్, ప్రత్యేక 'ఏఐ మంత్రిత్వ శాఖ'ను ఏర్పాటు చేయాలని ఢిల్లీలో జరిగిన సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి సూచించారు. న్యూఢిల్లీలో జరిగిన సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. దేశ భద్రత, చట్టపరమైన రక్షణ కోసం ఈ చర్యలు అవసరమని పేర్కొన్నారు. అలాగే, ఏఐ పురోగతిని పర్యవేక్షించేందుకు హైదరాబాద్‌లో 'జాతీయ ఏఐ వార్‌రూమ్' ఏర్పాటుకు తెలంగాణ సిద్ధంగా ఉందన్నారు. 

భారత ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో దేశంలోనే తొలి 'ఏఐ స్టార్టప్ విలేజ్'ను నెలకొల్పనున్నట్లు వెల్లడించారు. ఏఐ అనేది కేవలం సాంకేతికత మాత్రమే కాదని, సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలనకు అది ఒక శక్తివంతమైన సాధనంగా మారాలని ఆకాంక్షించారు. ఈ రంగంలో పెట్టుబడులను ఆహ్వానిస్తూ, అవగాహన పెంచేందుకు ఏడాదికి రెండుసార్లు వివిధ నగరాల్లో ఏఐ సమ్మిట్లు నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. భారత్ సేవల రంగంలోనే పురోగతి సాధించిందని, గూగుల్, మెటా, వాట్సాప్ వంటి ప్లాట్‌ఫార్మ్‌లను సృష్టించలేకపోయామని పేర్కొన్నారు. ఇప్పుడు ఏఐ విప్లవాన్ని అందిపుచ్చుకుని, భారత్ సైతం  ప్లాట్‌ఫార్మ్ క్రియేటర్ గా ఎదగాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Telangana Cabinet Decisions: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget