అన్వేషించండి

Hyderabad Metro Takeover: తుది దశకు హైదరాబాద్ మెట్రో టేకోవర్.. IDBI ఫైనాన్స్ రిపోర్ట్ సైతం రెడీ

Hyderabad Metro Takeover: హైదరాబాద్ మెట్రో రైలును తెలంగాణ ప్రభుత్వం టేకోవర్ చేసుకోవడంపై కీలక అప్డేట్ వచ్చింది. ఇందుకు సంబంధించిన రిపోర్టుకు కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది.

Hyderabad Metro Rail Project | హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం టేకోవర్‌పై కీలక అప్డేట్ వచ్చింది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకునే (Takeover) ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా, అంటే మార్చి 31 నాటికి ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఫైనాన్స్, టెక్నికల్ స్టడీ రిపోర్టులు సిద్ధమయ్యాయి. హైదరాబాద్ మెట్రో టేకోవర్‌కు సంబంధించి సాంకేతిక సలహాదారుగా డీఎంఆర్సీ (DMRC) వ్యవహరిస్తుండగా, ఆర్థిక & న్యాయపరమైన అంశాల అధ్యయనాన్ని ఐడీబీఐ పూర్తి చేసింది.

ప్రస్తుతం మెట్రోను నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ (L&T) సంస్థకు చెల్లించాల్సిన బకాయిలపై తెలంగాణ ప్రభుత్వం ఒక స్పష్టమైన నివేదికను రూపొందించింది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL), ఎల్ అండ్ టీ మధ్య ఉన్న ఒప్పందాల మార్పులపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సిద్ధం చేసిన తుది నివేదికలను ఈ నెల 23న జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన ఫైనాన్స్, టెక్నికల్ స్టడీ రిపోర్టులపై చర్చించనున్నారు. ఆ నివేదికకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం పొందిన వెంటనే టేకోవర్ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి తేదీలోపు హైదరాబాద్ మెట్రో ప్రభుత్వం టేకోవర్ చేసుకుంటుంది.

హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు పురోగతిపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇటీవల అధికారిక లేఖ రాశారు. ఇటీవల తాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భేటీ అయ్యానని, మెట్రో రెండో దశ నిర్మాణానికి కేంద్రం మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. అయితే, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కాలంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని తక్షణ చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి లేఖలో సూచించారు.

అధికారుల కమిటీ ఏర్పాటు - రాష్ట్రానికి పిలుపు
మెట్రో రెండో దశ పనుల పర్యవేక్షణ, సమన్వయం కోసం ఒక నలుగురు సభ్యుల ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో కేంద్రం తరఫున ఇద్దరు, రాష్ట్రం తరఫున ఇద్దరు అధికారులు ఉంటారు. ఈ కమిటీ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతిపాదించే ఇద్దరు అధికారుల పేర్లను వెంటనే పంపాలని కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ప్రాజెక్టు రూపకల్పన, నిధుల కేటాయింపు మరియు అమలు తీరుపై ఈ కమిటీయే తుది నిర్ణయాలు తీసుకోనుంది.

హైదరాబాద్ మెట్రో నెట్‌వర్క్ స్వాధీనం - కీలక నిబంధన
మెట్రో మొదటి దశకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు పూర్తయిన తర్వాతే రెండో దశ ప్రక్రియ వేగం పుంజుకుంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎల్ అండ్ టీ (L&T) ఆధ్వర్యంలో ఉన్న మెట్రో నెట్‌వర్క్‌ను రాష్ట్ర ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకునే ప్రక్రియ ముగిసిన తర్వాతే, రెండో దశకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను (DPR) కేంద్రానికి పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి కిషన్ రెడ్డి కొన్ని రోజుల కిందటే సూచించారు. ఈ సాంకేతిక అడ్డంకులు తొలగితేనే కేంద్రం నుండి నిధుల విడుదల, సహకారం తేలిక అవుతుందని వివరించారు.

హైదరాబాద్ మెట్రో ఫేజ్ II-B విస్తరణ.. రూ. 19,579 కోట్లతో భారీ ప్రణాళిక
హైదరాబాద్ రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా హైదరాబాద్ మెట్రో రెండో దశ (Phase II-B) విస్తరణకు సంబంధించి కీలక అడుగులు పడుతున్నాయి. ఈ ప్రతిపాదిత ప్రాజెక్టును మొత్తం 86.1 కిలోమీటర్ల పొడవునా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భారీ విస్తరణ కోసం సుమారు రూ. 19,579 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికలు సిద్ధం చేశారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను (DPR) ఇప్పటికే ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు.

ముఖ్యమైన మెట్రో మార్గాలు, దూరం:
ఈ రెండో దశ విస్తరణలో భాగంగా నగరాన్ని నలుమూలలా అనుసంధానించేలా మూడు ప్రధాన మార్గాలను ప్రకటించారు. 

ఎయిర్‌పోర్ట్ (RGIA) నుండి ఫ్యూచర్ సిటీ వరకు
శంషాబాద్ విమానాశ్రయం నుండి స్కిల్ యూనివర్సిటీ ఉన్న ఫ్యూచర్ సిటీ వరకు అత్యంత పొడవైన మార్గాన్ని నిర్మించనున్నారు. దీని మొత్తం పొడవు 39.6 కిలోమీటర్లు.

జేబీఎస్ (JBS) నుండి మేడ్చల్ వరకు
 జూబ్లీ బస్ స్టేషన్ నుండి మేడ్చల్ వరకు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కల్పించేలా 24.5 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ విస్తరించనున్నారు.

జేబీఎస్ నుండి శామీర్‌పేట్ వరకు
జూబ్లీ బస్ స్టేషన్(JBS) నుండి శామీర్‌పేట్ వైపు మరో 22 కిలోమీటర్ల మార్గాన్ని ప్రతిపాదించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget