Hyderabad Rains: ట్విట్టర్ ట్రెండింగ్ లో హైదరాబాద్ రైన్స్- మీమ్స్ తో రెచ్చిపోతున్న నెటిజన్లు
Hyderabad Rains: హైదరాబాద్ వానలు ట్విట్టర్ లో ట్రెండింగ్ లో నిలిచాయి. పెద్ద ఎత్తున వరదల వీడియోలను నెటిజెన్లు షేర్ చేస్తున్నారు.
Hyderabad Rains: ట్విట్టర్ ట్రెండింగ్ లో హైదారాబాద్ వానలు ట్రెండింగ్ లో నిలిచాయి. #Hyderabadrains రెండో ప్లేస్ నుంచి పైపైకి పోతోంది. శనివారం ఉదయం రెండున్నర గంటల పాటు భారీగా కురిసిన వర్షాలకు పెద్ద ఎత్తున వరదలు వస్తున్నాయి. మోకాళ్ల లోతు నీరు నిండిపోయి కనీసం నడిచే పరిస్థితి కూడా లేకుండా పోతోంది. వరదలు, భాగ్య నగరంలో వర్షాల వల్ల ఏర్పడుతున్న సమస్యలను వీడియోలుగా తీసి నగర వాసులు, విపక్ష నేతలు పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తున్నారు. నగర పౌరులు కూడా ఈ ట్రెండింగ్ లో పాల్గొని తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలంలో కురిసిన అకాల వర్షానికే హైదరాబాద్ పరిస్థితి ఇలా ఉంటే.. పూర్తిగా వర్షాలు కురిస్తే పరిస్థితి ఇంకా ఎంత ఘోరంగా ఉంటుందోనంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.
Stay indoors and stay safe in #HyderabadRains 😲😲😲 pic.twitter.com/NVk0yzeyrs
— Raghav Chaturbedi (@RaghavChaturbe2) April 29, 2023
Heavy rain in #Hyderabad this early morning #HyderabadRains pic.twitter.com/i3xrnQYY5A
— Swetcha Votarkar (@swetchajourno) April 29, 2023
మరోవైపు హైదరాబాద్‌లోని కళాసిగూడాలో విషాదం చోటు చేసుకుంది. పాలకోసం వెళ్లిన నాలుగోతరగతి చదువుతున్న చిన్నారి మౌనికను మురికి కాలవ బలితీసుకుంది. చిన్నపాటి వర్షానికే నాలా పొంగి చిన్నారి ప్రాణం తీసింది. నాలాలో కొట్టుకుపోయిన చిన్నారి పార్క్‌లైన్ వద్ద శవమైతేలింది. "రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షం హైదరాబాద్‌లో ఓ చిన్నారిని బలి తీసుకుంది. నాలోలో పడిన నాల్గో తరగతి చదువుతున్న మౌనిక అనే బాలిక మృతి చెందింది". "సికింద్రాబాద్‌లోని కళాసిగూడలో దారుణం జరిగింది. నాల్గో తరగతి చదువుతున్న మౌనిక అనే బాలికను నాలా మింగేసింది. ఉదయాన్నే పాల కోసం వెళ్లిన బాలిక కంటికి కనిపించని నీటితో నిండిపోయిన ఉన్న నాలాలో పడిపోయింది. ఇదంతా జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్లక్ష్యమే" అంటున్నారు స్థానికులు. రెండు గంటల పాటు వర్షానికి ఇలాంటి పరిస్థితి ఉంటే... రేపు వర్షా కాలంలో పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. చిన్నారి మృతితో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.
కళాసిగూడలో పాల ప్యాకెట్ కోసమని బయటకు వెళ్లిన బాలిక. మ్యాన్హోల్ మూత తెరచివుండటంతో డ్రైనేజీలో పడిపోయిన చిన్నారి. పార్క్‌లైన్ దగ్గర పాప మృతదేహం గుర్తింపు. మృతురాలు 4వ తరగతి చదువుతున్న మౌనికగా గుర్తింపు. pic.twitter.com/KIa1dsHJnZ
— Nellutla Kavitha (@iamKavithaRao) April 29, 2023
కాళేశ్వరం మొదటి ఫలితం హైదరాబాద్ కి అందినట్లుందిగా! #Hyderabad#HyderabadRains #Telangana pic.twitter.com/En2EuPyT92
— Manpreet Singh (@manpreetstweet) April 29, 2023
Cars and Two Wheelers washed away near Padma Colony, Nallakunta near the overflowing drain, due to sudden downpour in Hyderabad today. Alerts to @GHMCOnline , @GadwalvijayaTRS, @KTRBRS .#HyderabadRains #Hyderabad #HeavyRains #HeavyRain pic.twitter.com/SKeA2AgOjA
— Surya Reddy (@jsuryareddy) April 29, 2023
మిషన్ _______________??
— 𝐒𝐚𝐠𝐚𝐫 𝐆𝐨𝐮𝐝 (@Sagar4BJP) April 29, 2023
fill the blank pic.twitter.com/0oBeaOfsPT