Hyderabad Water Problem: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. నేడు, రేపు ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా బంద్
Water Supply disruption in Hyderabad | కృష్ణా తాగునీటి సరఫరా ప్రాజెక్టులో మరమ్మతు పనుల కారణంగా హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో అక్టోబర్ 13 నుంచి 36 గంటల పాటు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.

హైదరాబాద్: ఓవైపు వర్షాలు కుండపోత కురుస్తున్నా హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో నేడు తాగునీటి సరఫరా ఉండదు. కృష్ణా తాగునీటి సరఫరా ప్రాజెక్టు (Phase-III)లో మరమ్మతుల పనుల కారణంగా అక్టోబర్ 13, అక్టోబర్ 14 తేదీలలో మధ్య హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. అక్టోబర్ 13న ఉదయం 6 గంటల నుండి అక్టోబర్ 14న సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 36 గంటలపాటు డ్రింకింగ్ వాటర్ షట్‌డౌన్ అమలులో ఉంటుంది.
కోదండపూర్, గొడకొండల మధ్య 2375 మి.మీ మందం కలిగిన పైప్‌లైన్‌లో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. దాంతో హైదరాబాద్‌లోని ఈ ఏరియాలలో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ క్రింది ప్రాంతాలలో తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుంది.
నీటి సరఫరా బంద్ ఉన్న ఏరియాలు
మెహదీపట్నం
గోల్కొండ
గచ్చిబౌలి
కొండాపూర్
మాదాపూర్
జూబ్లీ హిల్స్
లంగర్ హౌజ్
బండ్లగూడ
రాజేంద్రనగర్
వనస్థలిపురం
ఉప్పల్
బోడుప్పల్ వాటి పరిసర ప్రాంతాలలో 36 గంటల పాటు తాగునీటి సరఫరా బంద్ చేశారు.
ఈ ఏరియాలలో నివాసం ఉండేవారు ఈ విషయాన్ని గమనించి ముందుగానే తగినంత నీటిని నిల్వ చేసుకోవాలని, లేదా ప్రత్యామ్నాయం చూసుకోవాలని HMWSSB కోరింది.






















