అన్వేషించండి

Hyderabad Fire Accident: హైదరాబాద్ లో ఆగని అగ్ని ప్రమాదం - ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న మంటలు!

Hyderabad Fire Accident: హైదరాబాద్ రాజేంద్రనగర్ శాస్త్రీపురంలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న తుక్కు గోదాంలో ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. 

Hyderabad Fire Accident: హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. 36 గంటల క్రితమే సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో మంటలు చెలరేగి ఆరుగురు చనిపోగా.. రాజేంద్రనగర్ శాస్త్రీపురంలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న తుక్కు గోదాంలో ప్రమాదం జరగడంతో పెద్ద ఎత్తుల మంటలు చెలరేగాయి. ఉవ్వెత్తున ఎగిసిపడుతుండడంతో.. స్థానికులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గోదాంలో అధిక మొత్తంలో ప్లాస్టిక్ వస్తువులు ఉండడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తున్నాయి. దట్టమైన పొగ వస్తుండడంతో.. అక్కడి ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ప్రమాదం జరిగినట్లు గుర్తించిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్పందికి సమాచారం అందించారు.

స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. రెండు అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పుతున్నారు. ప్రమాదంలో తుక్కు కోసం వినియోగించే రెండు డీసీఎం వాహనాలు దగ్ధం అయ్యాయి. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ యే కారణం అని ప్రాథమికంగా భావిస్తున్నారు. 

సికింద్రాబాద్ లో వరుస అగ్నిప్రమాదాలు..

సికింద్రాబాద్‌ పరిధిలో జ‌రుగుతున్న అగ్ని ప్రమాదాలు ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి. గురువారం స్వప్నలోక్‌ షాపింగ్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించడంతో అసలు అగ్ని ప్రమాదాల‌కు కార‌ణాల‌పై చ‌ర్చ సాగుతోంది. అగ్నిప్రమాదాలు జరిగిన అన్ని చోట్లా అక్రమ గోదాములే ప్ర‌ధాన కారణంగా తెలుస్తోంది. జనవరిలో డెక్కన్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం తర్వాత హడావుడి చేసిన ప్రజాప్రతినిధులు, బల్దియా అధికారులు తూతూమంత్రంగా చర్యలు చేప‌ట్టారు. డెక్కన్ మాల్ ఘటన తర్వాత అగ్ని ప్ర‌మాదాల‌ నివారణకు ఓ కమిటీని ఏర్పాటు చేసిన అధికారులు.. రెండు స‌మావేశాలు నిర్వ‌హించి ఆ త‌ర్వాత ఆ సంగ‌తి మ‌ర్చిపోయారు. 

ముందు జాగ్ర‌త్త‌లేవీ..?

బోయిగూడలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది మృతికి కార‌ణం గోడౌనే.. సెప్టెంబ‌ర్‌లో రూబీ లాడ్జిలో ప్రమాదం జ‌రిగి 8 మంది మృతి చెంద‌గా.. బ్యాటరీ గోదామే కార‌ణ‌మైంది. డెక్కన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ మంటల్లో ముగ్గురు స‌జీవ ద‌హ‌నానికి కారణం గోడౌనే. ఇప్పుడు స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో అగ్నికీలలు చెలరేగడానికి కారణమూ గోదామే. ఫైర్‌సేఫ్టీ మచ్చుకైనాలేని చోట ప్రాణాలను మింగేస్తున్న గోడౌన్లు. కమర్షియల్ కాంప్లెక్సుల్లోనూ గోదాముల నిర్వహణతో ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదాలు జరిగిన తర్వాత సహాయక చర్యలే తప్ప.. పున‌రావృతం కాకుండా ముందస్తు చర్యలు చేప‌ట్ట‌డంలో ప్రభుత్వం చొర‌వ చూప‌డంలేదు. నిబంధనలు ఉల్లంఘించి ప్రమాదకర పరిస్థితుల్లో వ్యాపారాలు సాగుతున్నా.. కఠినంగా వ్యవహరించటంలో మాత్రం అధికార యంత్రాంగం విఫలమవుతోంది. 

తూతూమంత్రం చ‌ర్య‌లే..!

గోడౌన్లపై సర్వే చేసి మరీ రిపోర్టు అందివ్వాలని అప్పట్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత దిశ‌గా చర్యలు తీసుకోలేదు. వరుస ప్రమాదాలు జరిగిన సికింద్రాబాద్ జోన్లోనైనా చర్యలు శూన్యం. అనుమతి లేని అంతస్తులు, గృహ అవసరాల కోసం నిర్మించిన ఇళ్లు భారీగా వ్యాపార సముదాయాలుగా మారడం, రోడ్ల ఆక్రమణ జరుగుతున్నా బల్దియా అధికారులు, పోలీసులు చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. స్థానికంగా కొందరు కిందిస్థాయి అధికారులకు ఆమ్యామ్యాలు అందుతుండటంతో ఈ పరిస్థితి నెలకొందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రమాదం జరిగాక హడావుడి చేయడం కన్నా.. ముందే అప్రమత్తమైతే ప్రాణాలతో పాటు ఆస్తినష్టం జరగకుండా కాపాడుకునే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
Ethanol EV Charger: ఈవీ ఛార్జింగ్‌లో కొత్త విప్లవం.. తెలంగాణలో ఇథనాల్ ఆధారిత ఛార్జర్ ప్రారంభం!
ఈవీ ఛార్జింగ్‌లో కొత్త విప్లవం.. తెలంగాణలో ఇథనాల్ ఆధారిత ఛార్జర్ ప్రారంభం!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Embed widget