Hyderabad Metro Rail హైదరాబాద్ మెట్రో రైలుకు అంతర్జాతీయ పురస్కారం, ప్రత్యేక గుర్తింపు
Hyderabad News | హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు అంతర్జాతీయంగా గుర్తింపు దక్కింది. జర్మనీలో జరిగిన కార్యక్రమంలో 2025 ఎడిషన్ కుగానూ హైదరాబాద్ మెట్రో పురస్కారం దక్కించుకుంది.

Hyderabad Metro Rail Project | దేశంలోని బెస్ట్ ప్రాజెక్టులలో ఒకటైన హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇటీవల జర్మనీలోని హాంబర్గ్ లో జరిగిన ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 2025 లో అవార్డు దక్కించుకుంది. ఆప్టిమైజ్డ్ మెట్రో ఆపరేషన్ ప్లాన్ బ్లీడింగ్ టు ఇంక్రీజ్‌డ్ రెవెన్యూ ఫర్ ట్రైన్ ప్రాజెక్టు గాను హైదరాబాద్ మెట్రో (L & T HRML) పురస్కారం దక్కించుకుంది. ఈ విషయాన్ని ఎల్ అండ్ టీ సంస్థ ఎండి, సీఈవో కేవీబి రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ప్రయాణికుల రాకపోకలను సమర్ధవంతంగా నిర్వహిస్తున్న ప్రాజెక్టులకు ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రతి ఏడాది అవార్డులు ఇస్తుంది.
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు ప్రత్యేక గుర్తింపు
ఏడాది ప్రపంచవ్యాప్తంగా ట్రాన్సిట్ ఆపరేటర్ల నుంచి దాదాపు 500 వరకు ఎంట్రీలు వచ్చాయి. ఆపరేషనల్ ఎక్సలెన్స్ విభాగంలో హైదరాబాద్ మెట్రో టాప్ ఫైవ్ లో చోటు దక్కించుకుంది. డేటా నిర్వహణ ఆధారిత విధానాలకుగాను హైదరాబాద్ మెట్రో కు ప్రత్యేక గుర్తింపు లభించింది. అత్యుత్తమ నిర్వహణ సామర్థ్యాలు, సరికొత్త వ్యూహాలతో హైదరాబాద్ మెట్రో ప్రపంచ వేదికపై పురస్కారం దక్కించుకున్నందుకు గర్వంగా ఉందని కేవీబీ రెడ్డి వర్షం వ్యక్తం చేశారు.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టుపై ఫోకస్ చేసింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2బీ పనులకు పరిపాలనా అనుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెట్రో విస్తరణకు సంబంధించి ఇంజినీర్లు, నిపుణులు, అధికారులు రూపొందించిన డీపీఆర్ ను కేంద్రానికి పంపించారు. ఇటీవల పాతబస్తీకి మెట్రో విస్తరణ పనులకు సైతం రాష్ట్ర ప్రభుత్వం రూ.125 కోట్లు విడుదల చేసింది. హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులు పూర్తయితే నగరంలోని పలు ప్రాంతాల వారికి ట్రాఫిక్ కష్టాలు తీరతాయి. హైదరాబాద్ మెట్రో ఇటీవల ఛార్జీలను పెంచింది. కానీ ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడానికి, తక్కువ సమయంలో జర్నీ పూర్తిచేసుకునేందుకు నగరవాసులు మెట్రో రైలు ఎక్కక తప్పడం లేదు.





















