అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Hyderabad: ట్యాంక్‌బండ్‌పై నిమజ్జన ఉత్కంఠకు తెర! క్రేన్లు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం

ట్యాంక్ బండ్ పై కొత్తగా 10 క్రేన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే, ట్యాంక్ బండ్‌పై నిమజ్జనాలు నిర్వహించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Hyderabad Nimajjan News: హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాలు చేసే అంశంలో ఉత్కంఠకు తెర పడింది. వినాయక నిమజ్జనాలకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. హుస్సేన్ సాగర్ చుట్టూ క్రేన్లను ఏర్పాటు చేస్తున్నారు. మట్టి విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసేందు కోసం ఎన్టీఆర్‌ మార్గ్‌లో 8, నెక్లెస్‌ రోడ్డులో 4 క్రేన్లను హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ ఇప్పటికే ఏర్పాటు చేసింది. ట్యాంక్‌ బండ్‌పై వినాయక విగ్రహాల నిమజ్జనంపై గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ తాజాగా ట్యాంక్‌ బండ్‌పై నుంచి కూడా నిమజ్జనాలు చేయడానికి జీహెచ్‌ఎంసీ భారీ క్రేన్లను ఏర్పాట్లు చేస్తోంది. 

ట్యాంక్ బండ్ పై కొత్తగా 10 క్రేన్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే, ట్యాంక్ బండ్‌పై నిమజ్జనాలు నిర్వహించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ట్యాంక్‌ బండ్‌పై క్రేన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కొద్ది రోజులుగా భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ సభ్యులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న (సెప్టెంబరు 6) వారు బైక్ ర్యాలీ నిర్వహించేందుకు పూనుకోగా, పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి వారిని స్టేషన్ కు తరలించారు.

కోర్టు ఆదేశాలు పాటిస్తాం - సీపీ
ఈ విషయంపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నిన్న (సెప్టెంబరు 6) విలేకరులతో మాట్లాడుతూ.. గణేష్ నిమజ్జనం సందర్భంగా హైకోర్టు గత నెలలో ఇచ్చిన ఆదేశాలనే పాటిస్తామని అన్నారు. తాజా హైకోర్టు ఆదేశాలను అనుసరించి.. వినాయక విగ్రహాలను ట్యాంక్ బండ్ పై నిమజ్జనం చేయడానికి వీల్లేదన్నారు. కేవలం మట్టి వినాయక విగ్రహాలను మాత్రమే ట్యాంక్ బండ్ కు అవతలి వైపు నిమజ్జనం చేయొచ్చని తెలిపారు. పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్ వైపు కూడా నిమజ్జనం చేయొచ్చని వివరించారు.

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను తప్పనిసరిగా బేబీ పాండ్స్ లోనే నిమజ్జనం చేయాలని చెప్పారు. ‘‘ప్రతి ఏడాది వినాయక నిమజ్జనం సమయంలో మార్గదర్శకాలను కోర్టు జారీ చేయాల్సి వస్తోంది. వచ్చే ఏడాది మార్చిలోగా నిమజ్జనంపై తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్దేశిత ప్రణాళికను రూపొందించాలి’’ అని ఇటీవల హైకోర్టు ఇటీవల కీలక ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్పష్టమైన ప్రకటన ఇవ్వాల్సి ఉంది.

వ్యర్థాలు ఉన్న చోట నిమజ్జనం పాపం - ఉత్సవ సమితి
వ్యర్ధాలు అధికంగా ఉన్న చెరువులో నిమజ్జనం చేయడం మహా పాపం అని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు అన్నారు. హుస్సేన్ సాగర్ లో వినాయకుడి నిమజ్జనానికి ప్రభుత్వం వెంటనే ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. నిమజ్జన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు సమీక్ష చేయడం లేదని ప్రశ్నించారు. మహంజాహీ మార్కెట్ చౌరస్తాలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆందోళనలు చేస్తున్న వారిని పోలీసులు చెదరగొట్టడంతో ఉద్రిక్తత నెలకొంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Embed widget