By: ABP Desam | Updated at : 28 Dec 2022 05:45 PM (IST)
హైదరాబాద్‌లో బాలిక అదృశ్యం
హైదరాబాద్‌లో చిన్నారుల వరుస మిస్సింగ్‌లు గత కొద్దిరోజులుగా కలకలం రేపుతోన్నాయి. ఇలాంటి ఘటనలు తల్లిదండ్రులకు ఆందోళన పెంచుతున్నాయి. నగరంలో చిన్నారుల మిస్సింగ్‌లతో తమ పిల్లలను బయటకు పంపించాలంటేనే తల్లిదండ్రులు బయపడే పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో మరో బాలిక అదృశ్యమైన ఘటన చర్చనీయాంశంగా మారింది. 24 గంటలు గడిచినా బాలిక ఆచూకీ తెలియరాలేదు. తల్లిదండ్రులు చిన్నారి కోసం ఆందోళన చెందుతున్నారు.
అసలేం జరిగిందంటే..
హైదరాబాద్ కవాడిగూడకు చెందిన 13 ఏళ్ల బాలిక అదృశ్య ఘటన కలకలం రేపుతోంది. తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్లడంతో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్లడంతో బాలిక ఒంటరిగా ఇంట్లోనే ఉంటుంది. ఎవరూ లేని సమయంలో బాలిక ఇంట్లో నుంచి వెళ్లిపోయింది ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మధ్యాహ్నం 12 గంటలకు తండ్రి ఆఫీస్ నుంచి ఫోన్ చేయగా.. బాలిక ఎంతసేపటికీ లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానంతో తండ్రి హుటాహుటిన ఇంటికి వచ్చి చూడగా.. కూతురు కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల నుంచి బాలిక వివరాలు సేకరించి పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.
డిసెంబర్ 27న సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య బాలిక ఫోన్ సిగ్నల్స్ నాగోల్ సమీపంలోని స్నేహపురి కాలనీలో చూపించినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ప్రాంతంలో చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. బాలిక ఆచూకీ కోసం నాలుగు ప్రత్యేక బృందాలను పోలీసులు ఏర్పాటు చేశారు. ఇప్పటికీ 24 గంటలు గడుస్తున్నా కూడా బాలిక ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చిన్నారి మానసిక పరిస్థితి కూడా గత కొంతకాలంగా సరిగ్గా ఉండటం లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. గతం లో కూడా గాంధీనగర్ చౌరస్తా వద్ద 4 గంటల పాటు మిస్ అయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు..
సీసీ కెమెరా ఆధారంగా ఆటో డ్రైవర్ ని పట్టుకుని అడగగా అతను నగోల్ సమీపం లో దింపినట్టు చెప్పారని పోలీసులు తెలిపారు. చివగా నాగోల్ లోని స్నేహపురి కాలనీ వద్ద పాప సెల్ ఫోన్ ట్రాక్ అవ్వడంతో.. దాని ఆధారంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇంటి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగోల్ వరకు బాలిక ఎందుకు వెళ్లిందన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
సివిల్స్ అభ్యర్థి ఆత్మహత్య కలకలం !
రంగారెడ్డి: శంషాబాద్‌లోని రాయల్ విల్లా కాలనీలో విషాదం చోటుచేసుకుంది. పూజిత (27) అనే సివిల్స్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అవుతున్న యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఇబ్రహీంపట్నానికి చెందిన పూజిత శంషాబాద్ లో అద్దె గదిలో ఉంటూ సివిల్స్ కు ప్రిపేర్ అవుతోంది. ఈ క్రమంలో యువతి అద్దె ఇంట్లో చున్నీతో ఉరివేసుకుని చనిపోయింది. అయితే మహమ్మద్ అలీ అనే వ్యక్తి పూజితతో సన్నిహితంగా మెలిగేవాడని, తమ కూతురు మృతికి అతడే కారణం అంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయి రెండు, మూడు అయినందున మృతదేహం కుళ్లిపోయి వాసన వస్తోందని స్థానికులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భారత్ ఇంజనీంగ్ కాలేజీ నుంచి 2018లో బీటెక్ పూర్తి చేసింది పూజిత. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాయల్ విల్లాస్ లో ఇల్లు అద్దెకు తీసుకుని నాలుగు నెలలుగా నివాసం ఉంటోంది. అక్కడే సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న పూజిత ఉరికి వేలాడుతూ కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
Hyderabad G-20 Startup 20 Inception : స్టార్టప్ వ్యవస్థను మరింతగా ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటి- కిషన్ రెడ్డి
BJYM Protest : డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, బీజేవైఎం అధ్యక్షుడికి గాయాలు
ఇది అవమానమే .! కేసిఆర్ ప్రభుత్వంపై పద్మశ్రీ అవార్డు గ్రహీత సంచలన వ్యాఖ్యలు!
Hyderabad IIIT: త్రిబుల్ ఐటీ హైదరాబాద్ సిల్వర్ జూబ్లీ టాక్ సిరీస్ ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ఎమ్మెల్సీ కవితతో నటుడు శరత్ కుమార్ భేటీ- రాజకీయాలపై చర్చ!
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
CBI Case Avinash Reddy : సీబీఐ ఎదుట హాజరైన అవినాష్ రెడ్డి - ముందుగా వైఎస్ విజయలక్ష్మితోనూ భేటీ !
Minister Harish Rao : వరంగల్ హెల్త్ సిటీ దేశానికే ఒక మోడల్, దసరా నాటికి నిర్మాణం పూర్తి- మంత్రి హరీశ్ రావు
Mylavaram Politics : మైలవరంలో వసంత సైలెంట్ అయ్యారా? సైలెంట్ గా వర్క్ చేస్తున్నారా?