అన్వేషించండి

Hyderabad No petrol: నిల్వలున్నా ఇంధన సెగ - హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలకు కారణం ఎవరు?

Fuel shortage: భాగ్యనగరంలో ప్రస్తుతం నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై క్షేత్రస్థాయి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ప్రభుత్వం చేసే ప్రకటనలు వేరుగా ఉన్నాయి. అన్నీ ఉన్నా ప్రజలకు మాత్రం కష్టాలు తప్పడంలేదు.

Hyderabad Fuel shortage Problem: హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా ఇంధన సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడటం సామాన్య వాహనదారులను ఇబ్బంది పెడుతోంది.  రాష్ట్రంలోనూ, దేశంలోనూ తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని అటు కేంద్ర పెట్రోలియం శాఖ, ఇటు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ   చెబుతున్నప్పటికీ, బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడం గందరగోళానికి దారితీస్తోంది. ప్రభుత్వ లెక్కల్లో నిల్వలు పుష్కలంగా ఉన్నా, అవి వినియోగదారుడి వాహనం దాకా చేరకపోవడమే అసలు సమస్యగా మారింది.

మారిన రూల్స్ తో సమస్యలు           

నిల్వలు ఉన్నప్పటికీ బంకులకు చేరకపోవడానికి ప్రధాన కారణం 'సప్లై చైన్' లేదా రవాణా వ్యవస్థలో తలెత్తిన లోపాలేనని తెలుస్తోంది. చమురు కంపెనీల డిపోల నుండి బంకులకు ఇంధనాన్ని చేరవేసే ట్యాంకర్ల లభ్యత తగ్గడం లేదా రవాణా కాంట్రాక్టర్ల మధ్య తలెత్తిన సమన్వయ లోపం వల్ల సకాలంలో లోడింగ్ జరగడం లేదని చెబుతున్నారు. అయితే ముందుగానే డబ్బులు చెల్లించాలని మార్చిన నిబంధనల వల్ల కూడా.. పెట్రోల్ బంకులకు తగినంత ఇంధనం అందడం లేదనిచెబుతున్నారు.  

యుద్ధం కారణంగా పానిక్ బయింగ్

కొరత ఉందన్న చిన్నపాటి వదంతులు సోషల్ మీడియాలో వ్యాపించగానే, వాహనదారులు తమ అవసరానికి మించి ఇంధనాన్ని నింపుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా రోజూ 5 వేల లీటర్లు అమ్ముడయ్యే బంకులో, ఒకేసారి 15 వేల లీటర్ల డిమాండ్ రావడం వల్ల నిల్వలు త్వరగా అయిపోతున్నాయి. ఇదే క్రమంలో కొంతమంది బంకు నిర్వాహకులు ధరలు పెరుగుతాయన్న ఆశతో లేదా ముందస్తు జాగ్రత్తగా స్టాక్ ఉన్నా లేదని చెబుతూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.

పర్యవేక్షణ లోపం 

నిల్వలు ఉన్నాయని ప్రకటనలు ఇవ్వడానికే పరిమితమైన ప్రభుత్వ యంత్రాంగం, క్షేత్రస్థాయిలో తనిఖీలను విస్మరించిందన్న విమర్శలు వస్తున్నాయి. పౌరసరఫరాల శాఖ అధికారులు బంకుల్లోని నిల్వలను తనిఖీ చేసి, స్టాక్ ఉండి కూడా అమ్మని వారిపై చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు.  డిపోల వద్ద ట్యాంకర్ల క్లియరెన్స్‌ను వేగవంతం చేసేలా చమురు కంపెనీలతో సమన్వయం చేసుకోవడంలో విఫలమవ్వడం వల్లే ఈ అనిశ్చితి కొనసాగుతోంది.  

పరిష్కార మార్గం 

ప్రస్తుత సంక్షోభం తొలగాలంటే కేవలం ప్రకటనలు సరిపోవు. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను రంగంలోకి దింపి, ప్రతి బంకులో ఉన్న నిల్వలపై పారదర్శకత తీసుకురావాలి. ట్యాంకర్ల రవాణాను యుద్ధ ప్రాతిపదికన క్రమబద్ధీకరించి, రాత్రిపూట కూడా లోడింగ్ జరిగేలా చూడాలి. ప్రజల్లో ధైర్యం నింపేలా ప్రతి బంకు వద్ద అందుబాటులో ఉన్న స్టాక్ వివరాలను డిజిటల్ బోర్డుల ద్వారా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని అంటున్నారు.                                             

టాప్ హెడ్ లైన్స్

Ashada Bonalu: పాతబస్తీలో అంబరాన్నంటిన బోనాల జాతర.. లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
పాతబస్తీలో అంబరాన్నంటిన బోనాల జాతర.. లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
Hyderabad Bonalu Traffic Diversions: బోనాల పండుగ.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపులు- ఈ రూట్లలో వెళ్తే జాగ్రత్త
బోనాల పండుగ.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్‌ మళ్లింపులు- ఈ రూట్లలో వెళ్తే జాగ్రత్త
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Embed widget