By: ABP Desam | Updated at : 12 Dec 2022 03:11 PM (IST)
Edited By: jyothi
ఆదిభట్ల బాధితురాలు
BDS Student Kidnap Case: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసినవని. తనకు వాటితో ఎలాంటి సంబంధం లేదని ఆదిభట్లలో కిడ్నాప్ అయిన యువతి తెలిపింది. రెండోసారి యువతి స్టేట్ మెంట్ ను పోలీసులు ఈరోజు రికార్డు చేయనున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 32 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మరోవైపు ఆదిభట్ల మెడికో కిడ్నాప్ వ్యవహారంలో ఇవాళ దర్యాప్తు కొనసాగనుంది. పోలీసులకు ఆమె ఇచ్చే వాంగ్మూలం ఈ కేసులో కీలకంగా మారనుంది. యువతి మాత్రం నవీన్ రెడ్డి గతంలో ఇచ్చిన ప్రకటనలను తోసిపుచ్చుతోంది. సంవత్సర కాలంగా నవీన్ రెడ్డి తనను వేధిస్తున్నాడంటూ ముందు నుంచి చెబుతోంది. పెళ్లి నిజం కాదని, ఫొటోలు, వీడియోలన్నీ మార్ఫింగేనని ఆమె వివరిస్తోంది.
పరిచయం ఉంది, కానీ ప్రేమించలేదు!
నిందితుడు నవీన్ రెడ్డితో తనకు పరిచయం ఉందని, కానీ అతడ్ని ప్రేమించలేదని.. తమకు పెళ్లి అయిందన్న వార్తల్లో నిజం లేదని బాధితురాలు క్లారిటీ ఇచ్చింది. పెళ్లి జరిగిందని నవీన్ రెడ్డి చెప్పిన రోజు తాను డెంటల్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లు చెప్పింది. తాను ఒంటరిగా నవీన్ రెడ్డితో ఎప్పుడూ వెళ్లలేదని, తన కుటుంబంతో పాటు కొన్నిసార్లు టూర్లకు వెళ్లినట్లు తెలిపింది. తన కుమారుడ్ని కాపాడుకునేందుకు నవీన్ రెడ్డి తల్లి సైతం ఆరోపణలు చేసినట్లు బాధితురాలు అన్నారు. నీ లైఫ్ నువ్వు చూసుకో, మా లైఫ్ మేం చూసుకుంటాం అని చెప్పినా నవీన్ రెడ్డి వినలేదని, ఫొటోలు మార్ఫింగ్ చేసి వేధింపులకు పాల్పడ్డాడని చెప్పింది. నవీన్ రెడ్డి చెప్పిన విషయాలకు, బాధిత యువతి వెల్లడించిన విషయాలకు పొంతన కుదరడం లేదు. యువతి స్టేట్‌మెంట్ ను పోలీసులు ఇదివరకే వీడియో రికార్డింగ్ చేశారు. తాజాగా మీడియా ముందుకు వచ్చిన యువతి తనపై వచ్చిన ఆరోపణలపై క్లారిటీ ఇచ్చింది.
3 నెలల కిందటే పీఎస్‌లో ఫిర్యాదు
నవీన్ రెడ్డి తనను వేధిస్తున్నాడని 3 నెలల క్రితమే పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశాను కానీ పొలీసులు పట్టించుకోలేదని బీడీఎస్ స్టూడెంట్ వెల్లడించింది. పోలీస్ లు కనుక అప్పుడే అతడిపై చర్యలు తీసుకుని ఉంటే ఈ ఘటన జరిగేది కాదు. నేను మేజర్‌ను. నేను కూడా ఇష్టపడితే కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్ళిచేసుకునే దాన్ని. నేను ఎలాంటి పేపర్ల పై సంతకాలు పెట్టలేదు. కారు, ఇన్సూరెన్సులపై నామినీగా నా పేరు ఇచ్చాడు. కానీ నేను ఎలాంటి పేపర్లపై సంతకాలు చేయలేదు. కానీ మా కుటుంబ సభ్యులతో కలిసి నవీన్ రెడ్డితో యాత్రకు వెళ్లామని చెప్పింది బాధితురాలు.
"కిడ్నాప్ చేసిన రోజు చాలా హింసించాడు"
తనను కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకుని వెళ్లాక.. జుట్టు పట్టి కొట్టాడని, మెడపై దాడి చేసి గాయపరిచాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. మెడ మెలి తిప్పి హింసించాడని, కాళ్లు కూడా మెలితిప్పి తీవ్రంగా హింసించారని కిడ్నాపర్ల చెర నుంచి బయటడపడ్డ యువతి తెలిపింది. తాను ప్రేమించకపోయినా సరే, నవీన్ రెడ్డి ప్రేమించినందుకు అతడ్ని వివాహం చేసుకోవాలని, కలిసుండాలంటూ వేధించాడని చెప్పింది. తనకు ఇష్టం లేకున్నా సరే అతడితోనే కలిసుండాలని డిమాండ్ చేస్తూ కుటుంబంపై దాడి చేసి కిడ్నాప్ చేశారన్నారు. ప్రాణ భయం ఉందని, పోలీసులతో తనకు రక్షణ కల్పించాలని ఆమె కోరింది. పెళ్లి కాకున్నా వివాహం జరిగిందని నవీన్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నాడని తన కెరీర్ నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేసింది.
Bandi Sanjay: ముందస్తుకు మేం కూడా రెడీ, కానీ అదొక్కటే షరతు అంటున్న బండి సంజయ్
BRS Corporators Arrest : మేడిపల్లిలో పేకాట స్థావరంపై దాడి, డిప్యూటీ మేయర్ సహా 7గురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అరెస్టు
BRS Parliamentary Party Meet : దేశ ప్రజల కష్టార్జితాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు, పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీయండి - సీఎం కేసీఆర్
Telangana 3వ స్థానంలో ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ యూపీకి చివరి స్థానం: మంత్రి హరీష్ రావు
Gujarat Junior Clerk Exam Cancel: హైదరాబాద్లో పేపర్ లీకేజీ కలకలం, జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ రద్దు చేస్తూ కీలక నిర్ణయం
Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్
Weather Latest Update: నేడు వాయుగుండంగా అల్పపీడనం, ఏపీకి వర్ష సూచన - ఈ ప్రాంతాల్లోనే