అన్వేషించండి

వివేక హత్య కేసులో అవినాష్‌ రెడ్డికి భారీ ఊరట- ముందస్తు బెయిల్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు

రెండు రోజుల వాదోపవాదనలు తర్వాత తెలంగాాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

వివేక హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల పాటు ఇరు పక్షాల వాదలను విన్న తెలంగాణ ధర్మాసనం ఇవాళ తీర్పు వెల్లడించింది. షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 

వివేక హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్‌ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ పిటిషన్‌పై పది రోజుల నుంచి హైడ్రామా నడుస్తోంది. సుప్రీంకోర్టు వరకు వెళ్లిన అవినాష్‌ ముందస్తు బెయిల్ కోసం పోరాడారు. సీబీఐ వాదనలతో ఏకీభవించిన తెలంగాణ హైకోర్టు అవినాష్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు సీబీఐ దీనిపై ఏం చేస్తుందో చూడాలి. 

ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టు పెట్టిన షరతులు

  • ప్రతి శనివారం సీబీఐ విచారణ హాజరుకావాలి
  • ఐదు లక్షల పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలి
  • సీబీఐకి సమాచారం ఇవ్వకుండా దేశం విడిచి వెళ్లకూడదు
  • షరతులు ఉల్లంఘిస్తే కోర్టుకు వెళ్లొచ్చని సీబీఐకి సూచన 

వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్‌ఆర్‌సీపీ ఎంపి అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్‌లో సుదీర్ఘ వాదనలు జరిగాయి. కేసు దర్యాప్తులో అవినాష్‌ ఎక్కడ సహకరించడం లేదని అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నారని సీబీఐ తరఫున న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. హత్యకు మూడు నెలల ముందే కుట్ర జరిగిందని వివరించారు. రాజకీయ కోణంలోనే హత్య జరిగిదని పేర్కొన్నారు. 

హత్య జరిగిన రోజున నిందితుడు అవినాష్ ఇంట్లో ఉన్నారని ఎలా చెప్తారని ప్రశ్నించింది కోర్టు. ఆధారాల సేకరణ ఎందుకు ఆలస్యమైందని క్వశ్చన్ చేసింది. లోక్‌ సభ అభ్యర్థిగా అవినాష్‌ను అనధికారికంగా ముందే ప్రకటించారు కదా ఆయన్ని అందరూ సమర్థిస్తున్నారు కదా అని కోర్టు ప్రశ్నించింది. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే మేనేజ్ చేసి ఉండొచ్చుకదా... హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కోర్టు క్రాస్ ఎగ్జామిన్ చేసింది. 

గదిలో రక్తం తుడిస్తే ఏమవుతుందని కోర్టు ప్రశ్నించింది. శరీరంపై గాయాలు ఉంటే అది హత్య అని తెలుస్తుంది కదా అని అనుమానం వ్యక్తం చేసింది. హత్య అని తెలిసినప్పుడు రక్తపు మరకలతో అవసరం ఏముంటుందని అడిగింది. అవినాష్‌ వాట్సాప్‌ డేటా తీసుకున్నారా అని కోర్టు అడిగింది. ఏ 1 వాట్సాప్ టేడా తీసుకున్నారా అని అడిగింది. దీనికి సమాధానం చెప్పిన సీబీఐ... చాట్ చేయలేదని గంగిరెడ్డి చెప్పారని పేర్కొంది.

మరి తెల్లవారు జామున అవినాష్‌ ఎవరితో చాట్ చేశారని అడిగింది. అది ఆయన ఫోన్ స్వాధీనం చేసుకుంటే తెలుస్తుందని సమాధానం చెప్పింది. ఐపీడీఆర్‌ ద్వారా వాట్సాప్‌ కాల్‌ గురించి మాత్రమే తెలుస్తుందని చెప్పింది. ఆ టైంలో ఎవరెవరి వాట్సాప్ యాక్టివ్‌లో ఉందని కోర్టు అడిగింది. ఇంత కీలకమై కేసులో అవినాష్ ఫోన్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించింది తెలంగాణ హైకోర్టు.

27న ఈ వాదనలు జరిగిన తర్వాత ఆయనకు తాత్కాలిక ఉపశమనం కలిగించింది. బుధవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీబీఐని ఆదేశించింది. 31 తుది తీర్పు వెల్లడిస్తామని పేర్కొంది. ఇవాళ(బుధవారం) అవినాష్‌కు ముదస్తు బెయిల్ ఇస్తూ ఫైనల్ తీర్పు చెప్పేసింది. 

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget