![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Nagarajuna: నేను అవినీతిపరుడినే - ఏం చేయలేను- నాగార్జున ఇంటర్వ్యూ వైరల్
N Convention Center : చెరువును కబ్జా చేసి కట్టారన్న కారణంతో హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా అధికారులు కూల్చేశారు. దీంతో నాగార్జున గతంలో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
![Nagarajuna: నేను అవినీతిపరుడినే - ఏం చేయలేను- నాగార్జున ఇంటర్వ్యూ వైరల్ Hero Nagarjuna An old interview video goes viral during N Convention Center demolition in Madhapur Nagarajuna: నేను అవినీతిపరుడినే - ఏం చేయలేను- నాగార్జున ఇంటర్వ్యూ వైరల్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/24/3192359aa0523005766e8ad8e2c94d0e1724480634624215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Hero Nagarjuna Comments On Corruptions : హైదరాబాద్‌లోని మాధాపూర్‌లో ఉన్న హీరో నాగార్జనకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను పూర్తిగా హైడ్రా అధికారులు కూల్చేశారు. చెరువును కబ్జా చేసి కట్టారన్న కారణంతో చర్యలు తీసుకున్నారు. ఉదయం నుంచి ఈ కూల్చివేతలు సాగాయి. కన్వెన్షన్ సెంటర్‌లోని రెండు హోటళ్లను కూడా అధికారులు పడగొట్టేశారు.
ఓవైపు నాగార్జనకు చెందిన కన్వెన్షన్ సెంటర్ కూల్చివేస్తున్న టైంలోనే అప్పుడెప్పుడో నాగార్జున చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అవును నేను అవినీతిపరుడునే అంటూ చేసిన ఇంటర్వ్యూ ఒకటి సోషల్ మీడియాలో తిరుగుతోంది.
నేను అవినీతిపరుడినే: నాగార్జున
అప్పుడెప్పుడో మంచు లక్ష్మి చేసిన ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ... చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావంతో తాను అవినీతి చేయాల్సి వచ్చిందంటూ చెప్పుకొచ్చారు. ఒకరకమైన అవినీతి తన జీవితంలోకి వచ్చేసిందని అన్నారు. లంచాలకు అలవాడు పడే వాళ్లు ఇలా చాలా మంది జీవితంలోకి వచ్చేశారని.. తనకు ఇష్టం లేకపోయినా వేరే దారి లేదని చెప్పుకొచ్చారు.
కోపం ఉండేది తగ్గించుకున్నా: నాగార్జు
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఇష్టమైనవి చెప్పాలని నాగార్జును అడిగారు మంచు లక్ష్మి ఆ ప్రశ్నను దాటవేయడంతో అయితే ఇష్టం లేని విషయాలు గురించి గుచ్చిగుచ్చి అడిగారు. మొదట్లో తనకు కోపం ఎక్కువగా ఉండేదని తర్వాత కంట్రోల్‌లోకి వచ్చేసిందన్నారు. ఇంకా ఏదైనా చెప్పాలని ఒత్తిడి తీసుకురావడంతో తను అవినీతి పరుడిని అంటూ కుండబద్దలు కొట్టి చెప్పారు. అందుకు కారణాలు కూడా వివరించారు.
సినిమా ఇండస్ట్రీ చాలా బెటర్: నాగార్జు
ఈ అవినీతి మన సిస్టమ్‌లోకి కాకుండా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉందన్నారు నాగార్జున. బయట ఉన్న పరిస్థితులతో పోల్చుకుంటే సినిమా ఇండస్ట్రీలో అవినీతి చాలా తక్కువ ఉందన్నారు. ఇక్కడ ప్రేక్షకుడు సినిమా బాగుంటే చూస్తాడే తప్ప నీవు ఏదో చేసినంత మాత్రాన చూడబోరని అన్నారు. అయితే హీరోయిన్ డేట్స్ కావాలంటే మేనేజర్‌కు ఎంతకొంత ఇవ్వడం ఇలాంటి చిన్న చిన్నవే తప్ప పెద్దగా అవినీతి లేదన్నారు. బయట ప్రపంచంలో మాత్రం అవినీతిని మనం తట్టుకోలేమంటూ చెప్పుకొచ్చారు. ఆ కారణంతోనే సినిమా పరిశ్రమపై తనకు గౌరవం పెరిగిందన్నారు. సినిమా పరిశ్రమలో మన గొడవలేవో మనం పడతామని... ఇక్కడ ఇగో ప్రాబ్లమ్స్ తప్ప వేరేవి లేవన్నారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత టైంలో ఈ వీడియో వైరల్‌గా మారుతోంది.
Also Read: హైడ్రా మరో సంచలనం - నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Sadhguru is a Yogi, mystic, visionary and author](https://cdn.abplive.com/imagebank/editor.png)