అన్వేషించండి

Hydra News: హైడ్రా మరో సంచలనం- నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ కూల్చివేత 

N Convention Demolished: నాగార్జునకు సంబంధించిన N కాన్వెన్షన్ సెంటర్‌ను HYDRA కూల్చివేస్తోంది. తెల్లవారు జామునే భారీ మెషిన్లు వచ్చి బందోబస్తు మధ్య ప్రక్రియ పూర్తి చేస్తున్నారు.

Hyderabad News: తెలంగాణలో వణుకుపుట్టిస్తున్న హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను కూల్చివేస్తోంది. భారీ బందోబస్తు మధ్య ఈ ప్రక్రియ చేపడుతోంది. తెల్లవారు జామునే జంబో మెషిన్‌లతో వచ్చి కూల్చివేత ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. భారీ పోలీసులు బందోబస్తు మధ్యలో కూల్చివేతలు హైడ్రా చేపట్టింది. తిమ్మిడి కుంటకు సంబందించిన బఫర్‌లో N కన్వెన్షన్ కట్టారని అనేక ఫిర్యాదులు రావడంతో హైడ్రా కూల్చివేస్తోంది. 

హైదరాబాద్‌లోని మాధాపూర్‌లో ఉందీ ఎన్‌ కన్వెన్షన్ హాల్. ఇది సినిమా నటుడు నాగార్జునకు చెందింది. చెరువును కబ్జా చేసి దీన్ని నిర్మించారని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ఏకంగా మూడు ఎకరాలను తుమ్మిడి కుంట చెరువు కబ్జా ఈ సెంటర్‌ నిర్మించారని గతంలో చాలా మంది పోరాటాలు కూడా చేశారు. అయితే ఇన్నాళ్లకు అధికారులు చర్యలు తీసుకున్నారు. 

హైదరాబాద్‌లోనే అత్యంత ఖరీదైన కన్వెన్షన్‌ సెంటర్స్‌లో N కన్వెన్షన్ ఒకటి. దీనిపై రాజశేఖర్ రెడ్డి హయాం నుంచే ఆరోపణలు ఉన్నాయి. అనేక ఫిర్యాదులు అధికారులకు ఇస్తూ వస్తున్నారు పర్యావరణవేత్తలు. కానీ ఇప్పటి వరకు అవన్నీ బుట్టదాఖలయ్యాయి. ఇప్పుడు హైడ్రా రాకతో చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. భారీ బందోబస్తు మధ్య  కూల్చివేతలను కొనసాగిస్తోందిహైడ్రా.  N కన్వెన్షన్‌కు వెళ్లే రహదారిని అధికారులు మూసివేశారు. కూల్చివేతకు ముందే యజమానికి హైడ్రా నోటీసులు పంపించింది. 

ఏంటీ హైడ్రా?

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ షార్ట్ కట్ నేమే హైడ్రా. మూడు లక్ష్యాలతో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో ఉన్న చెరువులు, పార్కులు, క్రీడా మైదానాలు, బహిరంగ ప్రదేశాలు, నాలాలు, రోడ్లు, ఫుట్ పాత్లు, ల్యాండ్ పార్సిళ్లు లాంటి ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే ఈ సంస్థ మొదటి టాస్క్. విపత్తులు ఏర్పడినప్పుడు వరదలు వచ్చినప్పుడు ప్రజల ప్రాణాలు ఆస్తులు రక్షించడం రెండో పని. నీట మునిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయడం, హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణ థర్డ్ టాస్క్. 

సీఎం ఆధ్వర్యంలో హైడ్రా పని

బృహత్ బాధ్యత ఉన్న ‘హైడ్రా’కు సీఎం ఛైర్మన్‌గా ఉంటారు. ఆయనకు దాదాపు ఇరవై మంది సభ్యులతో పాలకమండలి ఉంటుంది. హైడ్రాకు మెంబర్ సెక్రెటరీగా కమిషనర్ వ్యవహరిస్తారు. ఈ సభ్యుల్లో పురపాలక, రెవెన్యూ మంత్రులతోపాటు 4 జిల్లాల ఇన్చార్జి మంత్రులు ఉంటారు. జీహెచ్ఎంసీ మేయర్, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, పురపాలక ప్రిన్సిపల్ సెక్రెటరీ, కమాండ్ కంట్రోల్ సెంటర్ హెడ్, నాలుగు జిల్లాల కలెక్టర్లు, వివిధ విభాగాల అధికారులు సభ్యులుగా ఉంటారు. పాలకమండలి విధాన నిర్ణయాలు తీసుకోవడం, వాటిపై నిరంతరం రివ్యూ చేస్తుంది. దీనికి రంగనాథ్ అనే పోలీస్ ఆఫీసర్ను కమిషనర్ మెంబర్‌గా నియమించారు. 

హైడ్రా పరిధి ఇదే

ఈ హైడ్రా పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని చాలా ప్రాంతాలను తీసుకొచ్చారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జీహెచ్ఎంసీ సహా 27 మున్సిపాల కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, 33 పంచాయతీలను ఈ హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చారు. అంటే దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ హైడ్రా తన విధులు నిర్వహించనుంది. నాలుగు జిల్లాల యంత్రాంగం, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల, గ్రామ పంచాయతీ అధికారులు, పోలీసు, విద్యుత్, రెవెన్యూ, పురపాలక, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మెట్రోరైల్, ఇలా ఒకటేమిటి దాదాపు ప్రభుత్వం  ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి అధికారి వరకు అందర్నీ సమన్వయం చేసుకొని తన సత్తా చూపాల్సిందిగా సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేశారు. 

Also Read: రేసుగుర్రంలా దూసుకెళ్తున్న హైడ్రా రంగనాథ్‌- రేవంత్‌పైకి దూసుకొస్తున్న రాజకీయ బుల్డోజర్లు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget