అన్వేషించండి

Hyderabad Rains: హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం, ఆకాశాన్ని కమ్మేసిన దట్టమైన మేఘాలు- పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

Telangana Rains | తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. రైతులు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Telangana News Updates | హైదరాబాద్: ఉపరితల ఆవర్తనం, అల్పపీడనద్రోణి ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లోని పలుచోట్ల బుధవారం మధ్యాహ్నం వర్షం మొదలైంది. సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, కొత్తపేట, బేగంపేట, అల్వాల్‌, తిరుమలగిరిలో వర్షం కురుస్తోంది. భారీ వర్ష సూచనతో  తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. రైతులు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. మే 22, 23, 24 తేదీల్లోనూ తెలంగాణకు వర్ష సూచన ఉంది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. 

మరో మూడు రోజులపాటు వర్షాలే..

నేటి నుంచి మూడు రోజులపాటు పలు జిల్లాల్లో వర్షాలున్నాయి. దాంతో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-5 డిగ్రీలు తక్కువగా నమోదుకానున్నాయి. గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. తెలంగాణలో ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడా వర్షం కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది.

 

దిగొస్తున్న పగటి ఉష్ణోగ్రతలు 
ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది. మిగతా చోట్ల ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతున్నాయి. 
ఆదిలాబాద్ 41.3 డిగ్రీలు
భద్రాచలం 36 డిగ్రీలు
దుండిగల్ 33.6 డిగ్రీలు
హన్మకొండ 36.5 డిగ్రీలు
హైదరాబాద్ 35.7 డిగ్రీలు
ఖమ్మం 37.4 డిగ్రీలు
మహబూబ్ నగర్ 35 డిగ్రీలు
మెదక్ 34.2 డిగ్రీలు
నల్గొండ 37 డిగ్రీలు
నిజామాబాద్ 39 డిగ్రీలు
రామగుండం 38.6 డిగ్రీలు

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలోనూ గత కొన్ని రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు , నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణశాక ప్రజలను అప్రమత్తం చేసింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Embed widget