Hyderabad News: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌కు ప్రమాదం- అసలేం జరిగిదంటే?
Haryana Governor: శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో హర్యానా గవర్నర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న టైంలో ఘటన చోటు చేసుకుంది.
![Hyderabad News: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌కు ప్రమాదం- అసలేం జరిగిదంటే? Haryana Governor Bandaru Dattatreya convoy met with an accident in hyderabad near by shamshabad airport Hyderabad News: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌కు ప్రమాదం- అసలేం జరిగిదంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/21/d3b4070dfb2eae35bc7e2ce937558c7a1729476893014215_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Telangana News: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. రాత్రి ఏడు గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న క్రమంలో శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది. గవర్నర్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.
గవర్నర్ వాహనం శంషాబాద్ విమానాశ్రయానికి దగ్గర్లోకి రాగానే... ఓ కారు సడెన్‌కు ఎడమ వైపునకు తిరిగింది. అకస్మాత్తుగా ఎదురుగా ఉన్న కారు ఒక్కసారిగా ఎడమవైపునకు తిరగడంతో గవర్నర్ కాన్వాయ్‌లోని కార్ డ్రైవర్ కన్ఫ్యూజ్ అయ్యారు. దీంతో ముందుగా వెళ్తున్న కారు సడెన్ బ్రేక్‌పట్టారు. ఆ కారును వెనుక నుంచి వస్తున్న కార్లు ఢీ కొట్టాయి. దీంతో మూడు కార్లు ఒకదానితో ఒకటి ఢీ కొన్నాయి. ప్రమాదంలో గవర్నర్ దత్తాత్రేయ క్షేమంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన ఎండీవర్ కారుపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: తెలంగాణ వాహనదారులకు అలర్ట్ - అలా చేస్తే లైసెన్స్ రద్దు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)