అన్వేషించండి

Harish Rao: రేవంత్ రెడ్డి సవాలు స్వీకరిస్తా, అదే జరిగితే రాజీనామా, ఇక పోటీ చేయను - హరీశ్ రావు

Telangana News: ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేసి, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీశ్ రావు తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించారు.

Harish Rao Vs Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది తొండి రాజకీయం అని.. ఆయన ఇచ్చిన సవాలును తాను స్వీకరిస్తున్నానని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆగస్టు 15 లోపు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసి, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీశ్ రావు తేల్చి చెప్పారు. మళ్ళీ ఇక తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని.. తనకు పదవులు ముఖ్యం కాదని హరీష్ రావు అన్నారు.

‘‘రైతు రుణమాఫీ, ఇచ్చిన హామీలు చేయకపోతే నువ్వు నీ సీఎం పదవికి రాజీనామా చేస్తావా? ఈ విషయాలపై ఎల్లుండి నేను అసెంబ్లీ ముందు ఉన్న అమరుల స్థూపం వద్దకు చర్చకు వస్తా. కాంగ్రెస్ పార్టీ అమలు చేయాల్సిన 8 ప్రధాన హామీలు అమలు చేస్తే నేను రాజీనామా చేస్తాను. అమలు చేయకుంటే రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. 2014 ఆగస్టు 14 అర్థరాత్రి వరకు మీకు గడువు’’ అని హరీశ్ రావు అన్నారు.

హరీశ్ రావు ప్రధాన డిమాండ్లు ఇవీ
1. రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 నాడే చేస్తామన్నారు. ఇంకా చేయలేదు. కనీసం దానికి సంబంధించిన విధి విధానాలు కూడా తయారు చేయలేదు. ఇప్పుడు మళ్లీ కొత్త డేట్ పెడుతున్నారు. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేయనందుకు ముందు రేవంత్ రెడ్డి గారు రైతులకు క్షమాపణ చెప్పాలి. జరిగిన జాప్యానికి బాధ్యత వహించాలి. తాజాగా ఇచ్చిన హామీ ప్రకారమైనా ఆగస్టు 15లోపు వందకు వంద శాతం రుణమాఫీ చేయాలి. 

2. మహాలక్ష్మి పథకం కింద ప్రతీ మహిళకు నెలకు 2,500 ఇస్తామన్నారు. ఇప్పటికి నాలుగు నెలలు గడిచి పోయాయి. ఒక్కో మహిళలకు మీరు ఇప్పటికే 10,000 బాకీ ఉన్నారు. ఎప్పుడు ఈ బాకీ తీరుస్తారు. నెల నెలా ఎప్పటి నుంచి ఖాతాలో వేస్తారు? 

3. కల్యాణలక్ష్మి పథకం కింద ఇచ్చే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం 
ఇస్తామన్నారు. గడిచిన నాలుగు నెలల్లో వేల సంఖ్యలో పెళ్లిల్లు జరిగాయి. వారికి బంగారం ఎప్పుడు ఇస్తారు?

4. రైతుభరోసా కింద ఎకరానికి 15,000 చొప్పున ఇస్తామన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రబీ సీజన్ లో రైతుబంధుకు పెంచిన సాయం అందిస్తామని చెప్పారు. కానీ మేమిచ్చిన రైతుబంధు పథకం డబ్బులే ఇంకా అందరీ అందలేదు. గడిచిన రబీసీజన్ కు ఎకరానికి 5 వేలు బకాయి పడ్డారు. మళ్లీ ఖరీఫ్ సీజన్ లో జూన్ నుంచి మీరు ఎకరానికి 15,000 ఇవ్వాల్సి ఉంది. ఎప్పుడు ఇస్తారు? ఎంత ఇస్తారు? అసలు ఇస్తారా? ఇవ్వరా? 

5. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతీ పంటకు క్వింటాకు 500 చొప్పున బోనస్ ఇస్తామన్నారు. రబీ సీజన్ నుంచే ఇస్తామని చెప్పారు. కానీ రబీ సీజన్ లో ఒక్క క్వింటాకు కూడా బోనస్ ఇవ్వలేదు. దానికి ఎవరు బాధ్యత  వహిస్తారు? 

6. వ్యవసాయ కూలీలకు 12 వేల చొప్పు ఆర్థిక సాయం చేస్తామన్నారు. వంద రోజుల్లో చేస్తామని చెపితే, నాలుగు నెలలు దాటి ఐదో నెల గడుస్తోంది.  వ్యవసాయ కూలీలకు డబ్బులు ఎప్పుడు ఇస్తారు?

7. చేయూత పథకం కింద పెన్షన్ ను 2 వేల నుంచి నాలుగు వేలకు పెంచుతామన్నారు. కానీ నేటికీ పెంచిన పెన్షన్ రావడం లేదు. బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల చొప్పున ఇచ్చే పెన్షన్ కూడా మీరు జనవరి నెలకు ఇవ్వలేదు. నెలకు రెండు వేల చొప్పున ఐదు నెలలకు గాను, మీరు ఒక్కొక్కరికీ పదివేల రూపాయలు బాకీ పడ్డారు. జనవరి నెలకు సంబంధించి మొత్తం ఎగ్గొట్టారు. ఆ నెలది కూడా బకాయి పడ్డారు. బకాయిలు ఎప్పుడు ఇస్తారు? పెంచిన పెన్షన్ ఎప్పుడిస్తారు?

8. నిరుద్యోగ భృతి కింద నెలకు 4,000 ఇస్తామని హామీ ఇచ్చారు. నేటి వరకు ఎవరికీ ఇవ్వలేదు. ఐదు నెలలకు గాను, ఒక్కో నిరుద్యోగికి మీరు 20,000 బాకీ పడ్డారు. అవి ఎప్పుడు ఇస్తారు’’ అని హరీశ్ రావు డిమాండ్లు పరిష్కరించాలని కోరారు.

టాప్ హెడ్ లైన్స్

Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
Bandi Sanjay: పాతబస్తీ హిందువులదే.. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మరుస్తాం: బండి సంజయ్
పాతబస్తీ హిందువులదే.. భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా మరుస్తాం: బండి సంజయ్
Ashada Bonalu: పాతబస్తీలో అంబరాన్నంటిన బోనాల జాతర.. లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
పాతబస్తీలో అంబరాన్నంటిన బోనాల జాతర.. లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget