Terror suspects in Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి గుజరాత్ ఏటీఎస్ సోదాలు - ఉగ్రడాక్టర్ ఇంట్లో మరిన్ని ఆధారాలు స్వాధీనం
Gujarat ATS: హైదరాబాద్ లో ఉగ్రమూలాల ఉనికి ఎక్కువగా ఉంది. గుజరాత్ ఏటీఎస్ పోలీసులు మరోసారి కొన్ని చోట్ల తనిఖీలు చేస్ుతన్నారు.

Gujarat ATS again conducted searches in Hyderabad: గుజరాత్ పోలీసుల అంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) ఉగ్ర కుట్రకు సంబంధించి హైదరాబాద్‌లోని ప్రధాన నిందితుడు డా. అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ (35) ఇంట్లో మళ్లీ సోదాలు నిర్వహించింది. అహ్మదాబాద్‌లో గత వారం అరెస్టుల నుంచి లభించిన క్లూల ఆధారంగా రాజేంద్రనగర్‌లోని అతని నివాసాన్ని సీజ్ చేశారు. డిజిటల్ పరికరాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కుట్ర ISIS-కొరసాన్ (ISKP) సంస్థలో ముడిపడి ఉందని, ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్‌లో దాడులకు ప్లాన్ చేశారని ATS టీమ్ వెల్లడించింది. వీరు రిసిన్ అనే విషపదార్థంతో సామూహిక హత్యలు చేయాలనుకున్నారు. ఈ అరెస్టులు భారతదేశంలో బయో-వెపన్స్ దాడుల కుట్రలను బయట పెట్టింది.
డా. అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్, ఖమ్మం జిల్లా నుంచి వచ్చారు. చైనాలో MBBS పూర్తి చేసిన యువకుడు. హైదరాబాద్‌లోని తొలిచౌకీలో స్థిరపడి, డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తూ మరో వైపు షవర్మా ఔట్‌లెట్ నడుపేవాడు. సోషల్ మీడియా, ముఖ్యంగా టెలిగ్రామ్ ద్వారా రాడికలైజ్ అయినట్టు ATS దర్యాప్తులో తేలింది. టెలిగ్రామ్ గ్రూపుల్లో ఉగ్రవాద సాహిత్యం పోస్ట్ చేసి, ఇతరులను రాడికలైజ్ చేస్తూ పర్సనల్ చాట్‌లు ప్రారంభించేవారు. అతని 'హ్యాండిలర్' అఫ్ఘానిస్తాన్‌కు చెందిన అబు ఖదీజా (ISKP నాయకుడు)తో సంప్రదింపులు జరిపి, AQIS (అల్-ఖైదా ఇండియన్ సబ్‌కాంటినెంట్) సంస్థలతో ముడిపడి ఉన్నారని పోలీసులు తెలిపారు.
ఈ కుట్ర కారణంగా 2025లో దాడులకు ప్లాన్ చేశారు. అహ్మద్, తన సహచరులతో కలిసి రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ నుంచి ఆయుధాలు సేకరించారు. పాకిస్తాన్ నుంచి డ్రోన్‌ల ద్వారా ఆయుధాలు స్మగ్లింగ్ చేసుకున్నారని రాజస్థాన్‌లో 'డెడ్ డ్రాప్' పద్ధతితో తెప్పించుకున్నారని ATS వర్గాలు గుర్తించాయి. రిసిన్ విషం తయారీకి కాస్టర్ ఆయిల్ ఉపయోగించారు. రిసిన్ అమెరికా CDC ప్రకారం 'కెటగరీ B' బయో-ఎజెంట్, శ్వాసకోశ సమస్యలు, వాంతులు, డయేరియా కలిగించే మారక విషం. దీనికి యాంటిడోట్ లేదు, కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ కింద నిషేధితం.
నవంబర్ 9, 2025న అహ్మదాబాద్ సమీపంలోని అడలజ్ టోల్ ప్లాజాలో ATS టీమ్ అహ్మద్‌ను అరెస్ట్ చేసింది. ఏపీ రిజిస్ట్రేషన్ కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఆపి, అతని బ్యాగ్‌లో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అదే రోజు ఉత్తరప్రదేశ్‌కు చెందిన అజద్ సులైమాన్ షేక్ , మొహమ్మద్ సుహైల్ మొహమ్మద్ సాలీమ్ ఖాన్ లను కూడా అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురూ ఢిల్లీ, లఖ్‌నౌ, అహ్మదాబాద్‌లోని ప్రదర్శనలు, RSS కార్యాలయాలు, జనసమ్మర్దమైన ప్రదేశాల్లో దాడులకు ప్లాన్ చేశారు. అహ్మద్ తన ఫ్యామిలీకి 'గుజరాత్‌లో పని కోసం వెళ్తున్నాను' అని చెప్పి వెళ్లాడు, అరెస్టు తర్వాత ఫోన్‌లో 'ట్రాప్‌లో పడ్డాను' అని చెప్పినట్లుగా తెలుస్తోంది.
Gujarat ATS again conducted searches in #Hyderabad after inputs linked to Ahmedabad arrests over alleged Ricin terror plot. Prime suspect Dr Ahmed Mohiyuddin Saiyed (35), MBBS, from Khammam. His house searched, sealed; digital devices & documents seized.#TerrorAttack https://t.co/JgDt3484rZ
— Ashish (@KP_Aashish) November 12, 2025
అరెస్టుల నుంచి లభించిన ఇన్‌ఫర్మేషన్ ఆధారంగా ATS టీమ్ నవంబర్ 12న హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో అహ్మద్ ఇంట్లో మళ్లీ దాడి చేసింది. ల్యాప్‌టాప్‌లు, మొబైల్స్, టెలిగ్రామ్ డేటా, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో రిసిన్ తయారీకి సంబంధించిన మరిన్ని ఆధారాలు లభించినట్లుగా తెలుస్తోంది.





















