Tamilisai Soundararajan: పెండింగ్ బిల్లులపై స్పందించిన గవర్నర్ తమిళిసై - మూడింటికి ఓకే, రెండు రిటర్న్
Tamilisai Soundararajan: పెండింగ్ బిల్లులపై తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పిందించారు. ఐదు బిల్లులో మూడిండికి ఓకే చెప్పిన ఆమె.. మరో రెండిండిటిని సర్కారుకు తిప్పి పంపించారు.
![Tamilisai Soundararajan: పెండింగ్ బిల్లులపై స్పందించిన గవర్నర్ తమిళిసై - మూడింటికి ఓకే, రెండు రిటర్న్ Governor Tamilisai Soundararajan Accepted Three Pending Bills And Two Rejected Tamilisai Soundararajan: పెండింగ్ బిల్లులపై స్పందించిన గవర్నర్ తమిళిసై - మూడింటికి ఓకే, రెండు రిటర్న్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/10/0372276d7f1a48de365175b1a38ea69a1681111178399215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Tamilisai Soundararajan: తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ తమిళిసైకి పంపించిన బిల్లులు చాలా కాలంగా పెండింగ్ లోనే ఉన్నాయి. అయితే తాజాగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు. ఐదు బిల్లులలో.. మూడింటిని ఆమోదించారు. మరో రెండింటిని తిరిగి ప్రభుత్వానికి పంపించారు. ఇంకా రెండు బిల్లులను పెండింగ్ లోనే ఉంచారు. కాగా.. పెండింగ్ బిల్లుల విషయంపై తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ కు మధ్య కొద్ది రోజులుగా విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ పంచాయతీని తేల్చుకునేందుకు తెలంగాణ సర్కారు సుప్రీంకోర్డు వరకు వెళ్లింది. ఈ పిటిషన్ పై ఈరోజు విచారణ జరగనుంది. చట్ట సభలు ఆమోదించిన బిల్లలకు గవర్నర్ తమిళిసై ఆమోద ముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్రం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శులను పేర్కొన్నారు.
రాజ్ భవన్‌లో నెలల తరబడి పెండింగ్‌లో 10 అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు
బిల్లుల ఆమోదాన్ని ఆలస్యం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తి, ప్రజల ఆకాంక్షకు విరుద్ధమని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ లో పేర్కొంది. విషయ తీవ్రత, ప్రాధాన్యత దృష్ట్యా విధి లేక సుప్రీం కోర్టును ఆశ్రయించినట్లు తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలు ఆమోద ముద్ర వేసిన 8 బిల్లుల్లో ఒక్క బిల్లును మాత్రమే ఆమోదించారు. ఏడు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించిన బిల్లుల్లో ద్రవ్య వినిమయ బిల్లుకు వెంటనే ఆమోదముద్ర వేసిన గవర్నర్ తమిళి సై మరో మూడు బిల్లులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో పది బిల్లులపై గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. బడ్జెట్ సమావేశాల ముందు రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ మధ్య విభేదాలు తలెత్తాయి. బడ్జెట్‌ను ఆమోదించకపోవడంతో తెలంగాణ సర్కార్ హైకోర్టుకెు వెళ్లింది. హైకోర్టు సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది, రాజ్‌భవన్ తరఫున న్యాయవాది చర్చల జరిపారు. ఇరువురి మధ్య సఖ్యత కుదరడంతో బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి తెలంగాణ సర్కార్ ఆమోదం తెలిపింది.
ప్రభుత్వం, గవర్నర్ మధ్య ఉన్న వివాదాలు ఇక కొలిక్కి వచ్చినట్లేనని కొన్నినెలలుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులకు కూడా ఆమోద ముద్ర పడుతుందని ప్రభుత్వం భావించింది. కానీ గవర్నర్ ఆమోదం తెలుపలేదు. పైగా మరో మూడు బిల్లులపైనా నిర్ణయం తీసుకోలేదు. విశ్వవిద్యాలయాల్లో నియామకాల కోసం తెచ్చిన కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు కోసం, సిద్దిపేట జిల్లా ములుగులో ఏర్పాటు చేసిన అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను అటవీ విశ్వవిద్యాలయంగా మారుస్తూ తెచ్చిన బిల్లు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ, జీహెచ్‌ఎంసీ, పురపాలక చట్టాలకు సవరణ, పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట సవరణ, అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ, జీఎస్టీ చట్ట సవరణ ఇలా ఏడు బిల్లులను ప్రభుత్వం తెచ్చింది. వీటిని అసెంబ్లీ, మండలిలో ఆమోదించి గవర్నర్ ఆమోదం కోసం పంపింది. వీటిలో జీఎస్టీ చట్ట సవరణ బిల్లును మాత్రమే గవర్నర్ ఆమోదించడంతో చట్టంగా రూపుదాల్చింది. మిగిలినవి పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా ఉభయ సభలు వ్యవసాయ విశ్వవిద్యాలయం, పురపాలక, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులు ఆమోదం తెలిపాయి. వీటికి గవర్నర్ ఆమోదం తెలపలేదు. బడ్జెట్‌కు సంబంధించిన రెండు ద్రవ్య వినిమయ బిల్లులకు నిన్న గవర్నర్ ఆమోదం తెలిపారు. గత సమావేశాల్లోని 7, తాజాగా 3 కలిపి మొత్తం పది బిల్లులపై గవర్నర్ ఆమోదించలేదు. వీటి కోసం సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్ వెళ్లింది. ఈ క్రమంలోనే మూడింటిని ఆమోదించి రెండింటిని తిరిగి వెనక్కి పంపించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)