Gold Rate Today: పసిడి ప్రియులకు ఊరట - నేడు బంగారం ధరలకు బ్రేక్, మరోవైపు కొండెక్కిన వెండి రేట్లు
Gold Rates Today In Hyderabad: గత రెండు వారాలుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు నిలకడగా ఉన్నాయి. మొన్న 2022లోనే గరిష్ట ధరలకు బంగారం ఎగబాకింది.
Gold Price Today 12th March 2022 : ఉక్రెయిన్, రష్యా యుద్ధం ప్రభావంతో దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత రెండు వారాలుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు నిలకడగా ఉన్నాయి. మొన్న 2022లోనే గరిష్ట ధరలకు బంగారం ఎగబాకింది. వెండి ధర భగభగ మండుతోంది. హైదరాబాద్ మార్కెట్‌లో తాజాగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,200 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.52,580 గా ఉంది. స్వచ్ఛమైన వెండి ధర రూ.500 మేర పెరగడంతో హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.74,600 కు చేరింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు ముందు కేజీ వెండి ధర దేశంలో రూ.68 వేలుగా ఉండేది.
ఏపీలో బంగారం ధర.. (Gold Rate In Andhra Pradesh)
ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 12th March 2022) 10 గ్రాముల ధర రూ.52,580 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,200గా ఉంది. విజయవాడలో వెండిపై రూ.500 పెరగడంతో 1 కేజీ ధర రూ.74,600 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
విశాఖపట్నం, తిరుపతిలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,580 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.48,200 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్‌లో బంగారం, వెండి ధర రూ.74,600 కు చేరింది.
ప్రధాన నగరాల్లో బంగారం ధర..
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,570 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,200 గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో బంగారం ధర స్థిరంగా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,580 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,200 గా ఉంది.
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.42,400 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,850 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
బెంగళూరులో బంగారం ధర నిలకడగా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,580 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,200 గా ఉంది.
ప్లాటినం ధర
బంగారంతో పాటు మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధరలు పలు నగరాలలో ఇలా ఉన్నాయి.
ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.25,960 కి దిగొచ్చింది. తాజాగా ఢిల్లీలో రూ.69 మేర తగ్గింది.
హైదరాబాద్‌లో రూ.143పెరిగి 10 గ్రాముల ధర రూ.26,650కి పతనమైంది.
చెన్నై, ముంబైలోనూ ధర తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.26,650కి క్షీణించింది.
బెంగళూరులో రూ.143 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.26,650 అయింది.
పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: iPhone 12 Offer: ఐఫోన్ 12పై అమెజాన్‌లో బంపర్ ఆఫర్ - ఏకంగా రూ.12 వేలు తగ్గింపు!