అన్వేషించండి

Hyderabad News: ఇల్లు ఖాళీ చేయకుండా వేధిస్తున్నారు- పోలీసులను ఆశ్రయించిన జేసీ దివాకర్ రెడ్డి

Telangana News: అద్దె ఇల్లు ఖాళీ చేయకుండా తన సంతకం పోర్జరీ చేసి వేధిస్తున్నారని ఓ వ్యక్తిపై హైదరాబాద్‌ పోలీసులకు జేసీ దివాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కోర్టును కూడా వాళ్లు మోసం చేశారని పేర్కొన్నారు.

JC Divakar Reddy : మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ఎప్పుడూ ఏదో హాట్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో ఉండే జేసీ దివాకర్ రెడ్డి ఈసారి ఓ ఇంటి వివాదంపై పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. హైదరాబాద్‌లో ఉన్న తన ఇంటిని ఓ ఫ్యామిలీ ఖాళీ చేయకపోగా... తన సంతకాలు ఫోర్జరీ చేసిందని ఫిర్యాదు చేశారు. 

హైదరాబాద్‌లోని  జూబ్లీ హిల్స్‌ రోడ్డు నెంబర్‌ 62లో జేసీ దివాకర్ రెడ్డికి ఓ ఇల్లు ఉంది. దీన్ని సాహితీ లక్ష్మీనారాయణ అనే ఫ్యామిలీకి అద్దెకు ఇచ్చారు. ఇప్పుడు వివాదానికి కేంద్రం బిందువు ఈ ఇల్లే. అద్దెకు ఇల్లు ఇచ్చినప్పుడు మూడేళ్లకు ఒప్పందం చేసుకున్నారు. మూడేళ్ల పాటు ఎలాంటి సమస్య రాలేదు. 

మూడేళ్ల గడవు తీరిపోయి ఏడాది దాటింది. అంటే 2023 మేలోనే ఒప్పందం గడువు ముగిసింది. అప్పటి నుంచి ఇల్లు ఖాళీ చేయాలని సాహితీ లక్ష్మీనారాయణ ఫ్యామిలీని జేసీ దివాకర్ రెడ్డి చెబుతూ వస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్లు పట్టించుకోలేదు. అద్దె ఒప్పంద గడువు ముగిసినా తన ఇల్లు ఖాళీ చేసి ఇవ్వడం లేదని జేసీ దివాకర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. 

ఇక్కడ కేసు మరో మలుపు తిరిగింది. కోర్టుకు జేసీ దివాకర్ రెడ్డి పేరుతో ఉన్న ఒప్పందం కోర్టు సమర్పంచినట్టు నోటీసులు వచ్చాయి. గడువు తీరక ముందే ఖాళీ చేయించడం సరికాదని సమాధానం చెప్పాలని అందులో ఉంది. అది చూసి షాక్ తిన్న జేసీ దివాకర్ రెడ్డి ఆ డాక్యుమెంట్స్‌ను ఒకటి పదిసార్లు చెక్ చేశారు. అప్పుడుగానీ అర్థం కాలేదు అది తప్పుడు డాక్యుమెంట్ అని.  

బూదాటి లక్ష్మీనారాయణ, అతని కుమారుడు సాత్విక్‌ తన సంతకాన్ని ఫోర్జరీ చేసి సివిల్ కోర్టులో పిటిషన్ వేసినట్టు గుర్తించారు. అందులో తేదీ కూడా 2021 నాటిదిగా గమనించారు. దీని ఆధారంగానే కోర్టు నోటీసులు పంపించిందని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ఒప్పందం ప్రకారం గడువు ముగిసేలోపు ఇల్లు ఖాళీ చేసి ఇవ్వకపోవడం ఒక తప్పు అయితే... తన సంతకాలను ఫోర్జరీ చేయడం నేరమని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. 

జేసీ దివాకర్ రెడ్డి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం కేసు రిజిస్టర్ అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందీ వివాదం.  లక్ష్మీనారాయమ, సాత్విక్‌తోపాటు వాళ్ల లాయర్‌ మహమ్మద్‌ షాజుద్దీన్‌ తప్పుడు సమచారంతో కోర్టును కూడా మోసగించారని తన ఫిర్యాదులో జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget