Mahender Reddy: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై మాజీ మంత్రి మహేందర్ రెడ్డి గరం గరం! తన స్థాయి కాదంటూ ఫైర్
Ex Minister Mahender Reddy About Rohit Reddy: తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై మాజీ మంత్రి మహేందర్ రెడ్డి సీరియస్ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి తాండూరు అసెంబ్లీ టికెట్ తనకే అని మహేందర్ రెడ్డి అన్నారు.
Ex Minister Mahender Reddy About Rohit Reddy: పార్టీ ఫిరాయింపులు, జంపింగ్ జపాంగ్ లతో అధికార పార్టీ బీఆర్ఎస్ లో వర్గ పోరు కొనసాగుతోంది. అధికార పార్టీకి చెందిన నేతలే పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై మాజీ మంత్రి మహేందర్ రెడ్డి సీరియస్ అయ్యారు. బీఆర్ఎస్ నుంచి తాండూరు అసెంబ్లీ టికెట్ ఎవరికి వస్తుందన్న దానిపై రోహిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తనను ఔట్ డేటెడ్ అన్న రోహిత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి మహేందర్ రెడ్డి మండిపడ్డారు. పార్టీ మారినప్పుడే (కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన) రోహిత్ రెడ్డి ఔట్ డేటెడ్ అయ్యాడని, అనుకోకుండా గెలిచి మొనగాడు అనుకుంటున్నాడంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రోహిత్ రెడ్డి గెలుస్తాడనుకోలేదు..!
రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుస్తాడనుకోలేదు అని, అనుకోని పరిస్థితుల్లో అడ్డిమార్ గుడ్డిమార్ లాగ గెలిచాడంటూ సెటైర్లు వేశారు మహేందర్ రెడ్డి. ఆయన గతంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి పుణ్యాన ఎమ్మెల్యే అయ్యాడు అని ఆరోపించారు. తాండూరు అసెంబ్లీకి టికెట్ ఎవరికి వచ్చేది మూడు నెలల్లో తెలుస్తుందన్నారు. రోహిత్ రెడ్డి మాటలు, ఆయన తీరు గురించి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. బీఆర్ఎస్ అధిష్టానం తనకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఔట్ డేటెడ్ కాదని, ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించి జిల్లాల్లో చక్రం తిప్పుతానని పేర్కొన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని పట్టించుకోనవసరం లేదన్నారు. ఆ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు. రోహిత్ రెడ్డి లాంటి వ్యక్తి మాటలకు సైతం తాను వివరణ ఇచ్చుకోవడం, స్పందించాల్సి రావడం ఏదోలా ఉందన్నారు. కానీ సీరియస్ వ్యాఖ్యలు చేసినప్పుడు దీటుగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
రోహిత్ రెడ్డి గురించి మాట్లాడాల్సింది చాలా ఉందని, కానీ ఇది సందర్భం కాదన్నారు. విశ్వేశ్వర రెడ్డి రోహిత్ రెడ్డికి టికెట్ ఇప్పించారు, గెలిపించారని చెప్పారు. తెలంగాణ వచ్చినప్పుడు ప్రజలు పార్టీకి మద్దతుగా నిలిచారు. కానీ ఇప్పుడు గతంలోలాగ పరిస్థితి ఉండదన్నారు. నిజం చెప్పాలంటే రోహిత్ రెడ్డిది తన స్థాయి కాదన్నారు. తాను టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరి కారు గుర్తుపై పోటీ చేసి విజయం సాధించానని ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి గుర్తుచేశారు. కానీ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరినప్పుడే ఔట్ డేటెడ్ పొలిటీషియన్ అయ్యారని కామెంట్ చేశారు.
కేజీఎఫ్ మ్యూజిక్‌తో BRS ఎమ్మెల్యే ఫోజులు! ప్రభుత్వ సెక్యురిటీతో రీల్
ఆ మధ్య తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఆయనే బాగా హైలెట్ అయ్యారు. మునుగోడు ఎన్నికలకు ముందు బీజేపీకి చెందిన కొందరు పెద్దలు తమకు డబ్బు ఆశ చూపి బీఆర్ఎస్ నుంచి బయటికి రావాలని కోరినట్లుగా ఆయన ఆరోపించారు. భారీ డబ్బు తనకు ఆఫర్ చేసినా నైతికతకు కట్టుబడే తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పారు. ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పైలట్ రోహిత్ రెడ్డి కీలకంగా మారడంతో ఆయన భద్రత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు వై కేటగిరి సెక్యూరిటీని కల్పించింది. అయితే, ఆ సెక్యూరిటీ వాడుకొని రోహిత్ రెడ్డి తాజాగా చేసిన ఓ పని ఆయన్ని వివాదంలోకి నెట్టింది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది.